కొత్త పార్టీ.. సోమలింగం
మీడియా ప్రశ్నకు సీఎం కిరణ్ స్పందన
23 తర్వాత పార్టీ ముఖ్యనేతలతో
కలసి మేధోమథనం నిర్వహిస్తాం
పార్టీ బలోపేతానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం
అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసినా అది రాష్ట్రపతికి వెళ్లదు
సాక్షి, హైదరాబాద్:
కొత్త పార్టీ పెడతారంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై వుుఖ్యవుంత్రి కిరణ్‌కువూర్‌రెడ్డి ఎట్టకేలకు పెదవి విప్పారు. ‘‘ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోవులింగవున్నట్లుంది’’ అని కొత్త పార్టీ గురించి వ్యాఖ్యానించారు. ‘‘నేను కాంగ్రెస్‌లో పుట్టిన వాడిని. నా తండ్రితోపాటు నా కుటుంబానికి 1956కు వుుందు నుంచి కాంగ్రెస్‌తో అవినాభావ సంబంధవుుంది. ఈనెల 23తో అసెంబ్లీ సవూవేశాలు వుుగిసిన తర్వాత పార్టీలోని వుుఖ్యనేతలందరం కలసి మేధోవుథన సదస్సు నిర్వహించి పార్టీ బలోపేతానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం’’ అని తెలిపారు. శనివారం అసెంబ్లీలోని తన చాంబర్లో ఆయున మీడియూతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్తపార్టీ గురించి అడగ్గా.. మీడియూలో దీనిపై వస్తున్న వార్తలు చూసి నవ్వు వస్తోందన్నారు. ఇటీవల రాజవుండ్రి వెళ్లినప్పుడు కొంతవుంది ఎమ్మెల్యేలు తవు భవిష్యత్తు ఏమిటోనని ఆందోళన వ్యక్తపరిస్తే వుుందు 23 వరకు అసెంబ్లీలో బిల్లు చర్చపై దృష్టి పెట్టాలని, ఆ తర్వాత పార్టీ వుుఖ్య నేతలందరితో కలసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుందావుని చెప్పాను తప్ప కొత్త పార్టీ ఊసే లేదన్నారు.
కొత్త పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశాలుంటాయో లేదో కూడా చెప్పలేవున్నారు. కాంగ్రెస్‌లో ఉండే వారికి రాజకీయు భవిష్యత్తుపై భరోసా ఇస్తారా అని అడగ్గా.. ‘‘ఎవరు హామీ ఇవ్వగలరు? వునం శాశ్వతవూ? వునం ఇక్కడ ఎల్లకాలం బతుకుతావుని గ్యారెంటీ ఉందా?’’ అని సమాధానమిచ్చారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిపట్ల తామేమీ చేయులేవున్నారు. తెలంగాణ ఇచ్చినా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ గెలుస్తుందో లేదో చెప్పడానికి తాను జ్యోతిష్కుడిని కానని చెప్పారు. ‘‘ఉల్లిపాయుల ధర రూ.5 పెరిగిందని గతంలో ఢిల్లీలో కాంగ్రెస్ ఓడిపోరుుంది. ఆ తర్వాత వుళ్లీ పదేళ్లపాటు వూ పార్టీయే అధికారంలో ఉంది. ఇప్పుడు వుళ్లీ అదే ఉల్లిపాయు ధరతో ఓటమి పాలైంది. పార్టీ ఓడిపోవడానికి చిన్న కారణం చాలు’’ అని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీతో ఇటీవల జరిగన సవూవేశంలో విభజన వల్ల రెండు ప్రాంతాలూ నష్టపోతాయుని చెప్పానన్నారు. ఈనెల 23న అసెంబ్లీలోనే సీఎం రాజీనావూ చేస్తారని, ప్రభుత్వ రద్దుకు సిఫార్సు చేస్తారని వస్తున్న వార్తల గురించి ప్రస్తావించగా... ‘‘ఏదో ఆంగ్ల పత్రికలో ఇలాంటి వార్త చూశాను. మీడియూ ఇలాంటి వుంచి ఐడియాలు బాగానే ఇస్తుంటుంది. నేనైతే ఎవరితోనూ ఇలాంటి అభిప్రాయూలు పంచుకోలేదు’’ అని కిరణ్ వివరించారు. వుుందుగా చెప్పి ఏదీ చేయుబోనన్నారు.
బిల్లుపై చర్చ ప్రారంభిస్తేనే వుంచిది...
విభజన బిల్లుపై చర్చ ఎంత త్వరగా ప్రారంభమై, వుుగిస్తే అంత వుంచిదని సీఎం అభిప్రాయుపడ్డారు. రాష్ట్ర సమైక్యతపై ప్రత్యేక తీర్మాన ం వల్ల ప్రయోజనం లేదని, బిల్లుపై అందరూ అభిప్రాయూలు చెబితే చాలని, అదే తీర్మానం కింద లెక్కకు వస్తుందన్నారు. సభలో చర్చకు అన్ని పార్టీలను ఒప్పించాల్సిన బాధ్యత స్పీకర్దేనని, ప్రభుత్వం కేవలం సహకారం వూత్రమే అందిస్తుందని పేర్కొన్నారు. సభలో విడిగా సమైక్య తీర్మానం చే సినా అది రాష్ట్రపతికి వెళ్లదని, వెళ్లినా దాన్ని విశ్వాసంలోకి తీసుకోరని చెప్పారు. ‘‘ఎవరెంత వుంది ఎటువైపు వూట్లాడారో తేలాలంటే డివిజన్ అనేది ఉండాలి. సభ్యులు అడిగాక స్పీకర్ డివిజన్ ఇవ్వక తప్పదు’’ అని సీఎం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సవుయుంలో, ఆ తర్వాత జరిగిన ఇతర రాష్ట్రాల ఏర్పాటు, ఇటీవల యుూపీ, బీహార్ విభజన సందర్భంగా కూడా అందరి అభిప్రాయూలతో డివిజన్ ద్వారానే రాష్ట్రాలు ఏర్పడ్డాయున్నారు.
అలాంటివి 11 లేఖలున్నాయి..
వుంత్రి శ్రీధర్‌బాబు రాజీనావూ లేఖ అందిందని, అలాంటి లేఖలు ఇంకా తన వద్ద 11 ఉన్నాయుని సీఎం తెలిపారు. ఆదాయుం తగ్గినందునే వాణిజ్య పన్నుల శాఖను శ్రీధర్‌బాబుకు అప్పగించానని పునరుద్ఘాటించారు. హోం వంటి ఇతర శాఖలు కూడ ఇతరులకు ఇస్తారా అని అడగ్గా.. మీలో ఎవరున్నారో చెప్పండి ఇప్పుడే ఇచ్చేస్తా అని మీడియూనుద్దేశించి అన్నారు. వివాదాస్పద ఫైళ్లను క్లియుర్ చేస్తూ సీఎం కోట్ల రూపాయులు కమీషన్లుగా తీసుకుంటున్నారన్న విపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ ‘‘నాది తెరచిన పుస్తకం. ఉద్యోగుల నియూవుకాలు, బదిలీలు, హెల్త్ బిల్లులు వంటివి వూత్రమే వస్తుంటారుు. కాంట్రాక్లర్ల బిల్లులు నా దగ్గరకు రావు. ఏదైనా ఉంటే ఆధారాలతో ఆరోపణలు చేయూలి’’ అని చెప్పారు. చిత్తూరుకు వుంచినీళ్ల పథకానికి రూ.6 వేల కోట్ల ప్రాజెక్టును ఇవ్వడంపై సొంత పార్టీ వారే కోర్టుకు వెళ్తావుంటున్నారనగా... ‘‘నాన్సెస్ వూటలు అవి. చిత్తూరుకు నీళ్ల కోసం రూ.5 వేల కోట్లు ఇస్తే తప్పేంటి? ప్రాణహిత చేవెళ్లకు రూ.38 వేల కోట్లు ఇవ్వడం లేదా? ప్రజలకు ఏది ఎక్కడ అవసరమో ప్రభుత్వం అది చేస్తుంది’’ అని స్పష్టంచేశారు. సీఎం హెలికాప్టర్‌ను పేల్చేస్తావుంటూ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. అలాంటి చీప్ వూటలపై స్పందించనన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా ఒత్తిడి పెంచడానికి శంకుస్థాపనకు వస్తానని చెప్పానే తప్ప ఆరోజున అక్కడకు వెళ్లడం లేదన్నారు.
ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి..
పాలెం బస్సు ప్రవూద బాధితులకు చట్టం ప్రకారం ఏ మేరకు సాయుం చేయూలో అది చేస్తున్నావుని సీఎం చెప్పారు. రూ.25 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగమివ్వాలన్న డివూండ్పై ప్రభుత్వం ఏమీ చేయులేదన్నారు. ‘‘ప్రైవేటు బస్సు ప్రవూదాలు అనేకం జరుగుతుంటారుు. ఎంతోవుంది చనిపోతుంటారు. అందరికీ అడిగినంత ఎలా ఇవ్వగలం. ప్రత్యావ్నూయు ప్రయూణ సదుపాయూలు లేనప్పుడు ఇలాంటి జరుగుతూనే ఉంటారుు’’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో రవాణా రూట్లు ఆర్టీసీ, ప్రైవేటులో 60, 40 శాతం నిష్పత్తిలో ఉన్నాయుని, రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. కేసులు పెట్టినా ప్రైవేటు బస్సులు వుళ్లీ తిరుగుతున్నారుు, కఠిన చర్యలుండడం లేదనగా... అది కేంద్రం చట్టమని, రాష్ట్రమేమీ చేయులేదన్నారు.