చిట్ల పేరిట రూ.3 కోట్లకు కుచ్చుటోపీ
తల్లీ కూతుళ్లు పరార్
లబోదిబోమంటున్న బాధితులు
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : చిట్ల పేరిటి తల్లీ కూతుళ్లు న మ్మించి మోసం చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కూలి నాలి చేసి, పైసా పైసా కూడబెట్టి వారి వద్ద దాచుకుంటే డబ్బులతో పరారయ్యారని వాపోతున్నారు. ఇంకొందరు వద్ద బంగారం ఆభరణాలు తీసుకొని ఫైనాన్స్ కం పెనీల్లో తాకట్టు పెట్టి నిండా ముంచేశారు.
బాధితుల కథనం ప్రకారం.. అంగడిదిబ్బకు చెందిన రే లంగి వరలక్ష్మి, ఆమె కూతురు బొల్ల అన్నపూర్ణ స్థానికులతో స్నే హంగా ఉంటూ 15 ఏళ్లుగా రూ.50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు చిట్లు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా చిట్ పాడిన వారికి సొమ్ము ఇవ్వకుండా తిప్పుతున్నారు. సుమారు రూ.3 కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టి కుటుంబంతో సహా ఈ నెల 16న పరారయ్యారు. అందరూ చూస్తుండగానే వీరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం విశేషం.
అప్పటి నుంచి వారి ఆచూకీ లేకపోవడంతో బాధితులు నగ ర పోలీస్ కమిషనర్ బి.శివధర్‌రెడ్డిని ఆశ్రయించారు. ఆయన సూచనల మేరకు మహారాణిపేట జోన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుల బంధువుల ఇంటి అడ్రస్‌లు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.