చనిపోతే.. అంతే!
జడ్చర్ల : భవన నిర్మాణానికి సంబంధించి బండలు దించుతుండగా ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతిచెందగా యాజమాన్యం మృతదేహాన్ని గు ట్టుగా అతని స్వరాష్ట్రం పశ్చిమబెంగాల్‌కు తరలిం చి చేతులు దులుపుకుంది.
గురువారం ఆలస్యం గా వెలుగుచూసిన ఈ ఘటన మండలంలోని పో లేపల్లి గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో నూతనంగా ఏర్పాటుచేసిన బిజినెస్ కళాశాలలో చోటుచేసుకుంది. స్థానికులు కొందరు సంబంధిత కళాశాల ఎదుట కొద్దిసేపు ఆందోళన చేపట్టడంతో ఈ విష యం వెలుగుచూసింది.
స్థానికుల కథనం ప్రకారం.. పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో బిజినెస్ కళాశాలను ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయగా భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నా యి. పనుల్లో భాగంగా ఆదివారం అడుగు భా గంలో వేసే మార్బుల్స్‌ను లారీ నుంచి అన్లోడ్ చేస్తుండగా అవి ప్రమాదశాత్తు జారిపడి పశ్చిమబెంగాల్‌కు చెందిన గొల్జర్ రహమాన్(45) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
దీంతో యాజమాన్యం వెంటనే ఎవరికీ తెలియకుండా గుట్టుగా అంబులెన్స్‌లో అతని స్వరాష్ట్రం పశ్చిమబెంగాల్‌కు తరలించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే గురువారం రహమాన్ సోదరులు ముజియలక్, అన్వర్ కళాశాల యాజమాన్యం వద్దకు వచ్చి తమ సోదరుడి మృతికి సంబంధించి విచారించారు.
దీంతో యాజమాన్యం తమకు ఎలాంటి సంబంధం లేదని, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అంటూ చెప్పడంతో వారు స్థానిక అంబేద్కర్ సంఘం నాయకులను ఆశ్రయించారు. దీంతో బాధిత కుటంబానికి రూ.40 లక్షలు ఎక్స్‌గ్రేషియా, పిల్లలకు చదువు వసతి కల్పించాలని, భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట వారు ఆందోళన చేశారు.
ఎస్ఐ వెంకటనారాయణ అక్కడికి చేరుకుని విచారించారు. ఆందోళనలో ఆంబేద్కర్ సంఘం నాయకులు రా జు, అంజి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రహమాన్‌ను పశ్చిమబెంగాల్ రాష్ట్రం కూచిబిహారి జిల్లా దుదీర్‌కుతి దేవంబాస్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఈయనకు భార్య లైలిబీబీ, పిల్లలు లోవెలు హొసైన్, లబీబ్ ఇస్లాం ఉన్నారు.
అసలేం జరుగుతుంది?
పోలేపల్లి గ్రీన్ పార్కులో అసలేం జరుగుతుందన్న అనుమానాలు కలుగుతుంది. ఏదైనా ప్రమాదం చోటుచేసుకుని మరణిస్తే గుట్టుగా శవాలను మాయం చేయడమేనా అన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి.
రోజురోజుకు ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. గతంలోనూ అనేక ప్రమాద సంఘటనలు చోటుచేసుకుని పలువురు మృత్యువాత పడినా అవి పోలీసుల ఖాతాకు చేరకుండానే కథ ముగిసిపోయింది. ప్రస్తుతం కూడా ఇదే కోవలో రహమాన్ మృతదేహాన్ని రాష్ట్రం దాటించారంటే పరిస్థితిని ఊహించవచ్చు.
వాస్తవంగా ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుడిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలి. అక్కడ చికిత్స చేయడం లేదా మరణించారని డాక్టర్లు ధ్రువీకరించిన తర్వాత పోలీసులకు సమాచారం అందించి చట్టప్రకారంగా వ్యవహరించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండానే గుట్టుచప్పుడు కాకుండా తమ చేతులు దులుపుకుంటున్నారు.
వాట్సప్ ద్వారా ఎస్పీ దృష్టికి
ఈ విషయాన్ని కొందరు జిల్లా ఎస్పీ అనురాధ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. మృతుడు, తదితర సంఘటన ఫొటోలను వాట్సప్ ద్వారా ఎస్పీకి పంపినట్లు సమాచారం. దీంతో ఎస్పీ సమగ్ర విచారణకు జడ్చర్ల పోలీసులను ఆదేశించినట్లు తెలిసింది. కాగా, సంఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ భాస్కర్‌గౌడ్ జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు తెలిపారు. అయితే అసలేం జరిగిందన్న వివరాలు వెల్లడించేందుకు సంబంధిత కళాశాల యాజమాన్యం ముందుకు రాకపోవడం గమనార్హం.