కలెక్టరేట్ ఎదుట రిలే దీక్ష
కడప సెవెన్‌రోడ్స్ :
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మోడల్ స్కూల్స్ ప్రోగ్రేసివ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఎంఎస్‌పీటీఏ రాష్ట్ర అధ్యక్షులు కె.శివశంకర్‌రెడ్డి, గౌరవ సలహాదారు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ, సీపీఎస్, సర్వీసు రూల్స్, హెల్త్‌కార్డులు, ప్రత్యేకంగా బాలికల హాస్టల్ వార్డెన్ల తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.
రోజుకో జిల్లా కలెక్టరేట్ ఎదుట వచ్చేనెల 7వరకు రిలే దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 9న విజయవాడలో నిర్వహించనున్న ఆదర్శ దీక్షకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆ సంఘం నాయకులు కె.నాగరాజు, సుబ్బరాయుడు, బాలిరెడ్డి, రామకృష్ణ, భాస్కర్‌రెడ్డి, దివ్య పాల్గొన్నారు. ఎస్‌ఎల్‌టీఏ జిల్లా అధ్యక్షుడు పల్లా భాస్కర్, జేఎల్ అసోసియేషన్ నాయకులు రాజేశ్వరరావు, ఏపీ సీపీఎస్సీ ముఖ్య కార్యదర్శి బి.ఖాదర్‌బాష మద్దతు తెలిపారు.