relay fasting
-
కొనసాగుతున్న వైఎస్సార్ సీపీ రిలే నిరాహార దీక్షలు
సాక్షి నెట్వర్క్: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పోరు రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. పార్టీ శ్రేణులన్నీ కంకణబద్ధులై ఆందోళనలో పాల్గొంటున్నాయి. ఢిల్లీ పరిణామాలకు అనుగుణంగా స్పందిస్తూ నిరసనను హోరెత్తిస్తున్నాయి. మంగళవారం జాతీయరహదారులన్నీ దిగ్బంధనం చేసిన శ్రేణులు బుధవారం రైలురోకోను నిర్వహించాయి. నియోజకవర్గ కేంద్రాలలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నాయి. మండుటెండను సైతం పట్టించుకోకుండా హోదా కోసం పార్టీ నాయకులు..కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. వైఎస్సార్సీపీ చేస్తున్న రిలేనిరాహార దీక్షలకు కొన్నిచోట్ల ప్రజాసంఘాలు మద్ధతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు. సత్తెనపల్లిలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో 6 వ రోజు రిలే నిరాహారదీక్షలు. వినుకొండ శివయ్యస్థూపం సెంటర్లో బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో మహిళల ఆరో రోజు రిలే నిరాహారదీక్ష చిలకలూరిపేట సమన్వయకర్త మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆరో రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్షలు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేక హోదా కోరుతూ అమలాపురం కోఆర్డినేటర్ విశ్వరూప్ ఆధ్వర్యంలో ఏడవ రోజు కొనసాగుతున్న రిలేనిరాహార దీక్షలు. పిఠాపురం ఉప్పాడ సెంటర్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పెండెందొరబాబు ఆధ్వర్యంలో ఏడవ రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు. దీక్షల్లో పాల్గోన్న మాజీమంత్రి కొప్పన మోహన్ రావ్. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో తుని గొల్లప్పారావు సెంటర్లో 7 వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు. రాజమండ్రి గోకవరం సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపి, జనసేన, వామపక్షాల ఆందోళన. అదేచొట చంద్రబాబుకు వ్యతిరేకంగా బీజేపి ఆధ్వర్యంలో ఆందోళన ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఎంపీలు చేస్తున్న దీక్షకు మద్దతుగా కనిగిరిలో ఆరో రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీనేతలు బన్నీ, రంగనాయకులు రెడ్డి, మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కస్తూరి రెడ్డి, సుజాత, కృష్ణా రెడ్డి,కార్యకర్తలు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఒంగోలులో చేపట్టిన రైల్‌రోకో కార్యక్రమంలో పాల్గొన్న వరికూటి అశోక్ బాబును దుర్భాషలాడిన ఒంగోలు సీఐ గంగా వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయాలంటూ చీరాల గడియార స్తంభం సెంటర్ వద్ద సీఐ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వైఎస్సార్సీపీ నాయకుడు వరికూటి అమృతపాణి. కృష్ణాజిల్లా ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్దతుగా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో 7వ రోజుకు చేరిన రిలే నిరాహారదీక్షలు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటానికి మద్ధతుగా తిరువూరు నియోజకవర్గ కేంద్రంలో పట్టణ పార్టీ అధ్యక్షులు చలమాల సత్యనారాయణ ఆధ్వర్యంలో 6వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పాల్గొన్న పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పరసా శ్రీనివాసరావు, కౌన్సిలర్లు ఆర్ లక్ష్మణరావు, చిట్టిపోతుల లక్ష్మీనారాయణ, మండల మైనార్టీ అధ్యక్షులు జాఖీర్, కే నాగేశ్వరరావు తదితరులు. ఎంపీల ఆమరణ దీక్షకు మద్ధతుగా పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో నియోజకవర్గ కన్వీనర్ కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో 6వ రోజు రిలే నిరాహార దీక్షలు. కార్యక్రమంలో భారీగా పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గుడివాడ గాంధీ మండపంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేనిరాహార దీక్షల్లో 6వ రోజు మహిళ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. చంద్రబాబు, మోడీ శవయాత్ర నిర్వహించిన ఆందోళనకారులు. నల్ల దుస్తులు ధరించి టీడీపీ-బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ సర్కిల్లో కొనసాగుతున్న పార్టీ శ్రేణుల రిలే దీక్షలు. బి.కొత్తకోటలో హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు. కర్నూలు జిల్లా ఆలూరులో ప్రత్యేక హోదా కోసం ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం ఆధ్వర్యంలో ఆరో రోజు కొనసాగుతున్న రిలేదీక్షలు డోన్‌లో జడ్పీటీసీ శ్రీరాములు ఆద్వర్యం లో ప్రత్యేక హోదా కోసం 6వ రోజు కొనసాగుతున్న వైస్సార్సీపీ శ్రేణుల రిలే నిరాహారదీక్షలు ఆదోని పట్టణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా కోసం 6వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో 6వ రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు. పాల్గొన్న జడ్పీటీసీ యుగంధర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస రెడ్డి, మండల కన్వీనర్లు కాంతారెడ్డి,నాగభూషణం రెడ్డి తదితరులు. పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం 6 వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు. ప్రత్యేక హోదా కోసం ఎంపీల ఆమరణదీక్షకు సంఘీభావంగా కర్నూలు ధర్నా చౌక్ వద్ద నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో 6వరోజు ముస్లిం మైనార్టీలు రిలే దీక్షలు. నెల్లూరు జిల్లా కావలిలో ప్రత్యేక హోదా కోసం ఎంఎల్ఏ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు. -
ప్రొద్దుటూరులో వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు
ప్రొద్దుటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్షకు మద్ధతుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు దిగారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం కడుతోన్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. -
విభజనను అడ్డుకుంటాం : సామినేని
సాక్షి, విజయవాడ : విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణాజిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ప్రారంభమైన రిలేదీక్షలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పలుచోట్ల నిరాహార దీక్షలు జరుగగా, కలిదిండిలో రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నేతృత్వంలో జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో రిలేదీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తామూ సమైక్యానికే కట్టుబడి ఉన్నామని చెబుతున్న సీమాంద్ర అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలని డిమాండ్‌చేశారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తమ పార్టీ రాష్ట్రాన్ని విడదీయకుండా అడ్డుకోవటం ఖాయమని, సమైక్య రాష్ట్రంలోనే త్వరలో ఎన్నికలు జరుగుతాయని ఉదయభాను పేర్కొన్నారు. విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గ కన్వీనర్ పి.గౌతంరెడ్డి నేతృత్వంలో వాంబేకాలనీలో రిలేనిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అవనిగడ్డలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. వీరులపాడు మండలం జుజ్జూరులో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్ష చేపట్టారు. కంచికచర్ల, నందిగామ, చందర్లపాడు మండలాల్లో కూడా రిలే దీక్షలు జరిగాయి. మైలవరంలో పాత ఆస్పత్రి ఎదుట గల వైఎస్ విగ్రహం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అలాగే స్థానిక ఎల్‌హెచ్ కాంప్లెక్స్ వద్ద గల వైఎస్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు. పెడన పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాం ప్రసాదు ఆధ్వర్యంలో దీక్షను చేపట్టారు. పెనమలూరు సెంటర్లో పార్టీ సమన్వయకర్తలు తాతినేని పద్మావతి, పడమట సురేష్‌బాబు నేతృత్వలో రిలేదీక్షలు జరిగాయి. గన్నవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరహార దీక్షల్లో పట్టణ కన్వీనర్ సూరం విజయకుమార్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. మైలవరంలో జేఏసీ రిలే నిరాహర దీక్షలు రెండవ రోజు కొనసాగాయి. -
సమరోత్సాహం
సాక్షి, విజయవాడ : జిల్లాలో సమైక్య ఉద్యమం సమరోత్సాహంతో ఉరకలెత్తుతోంది. వేలమంది విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనంచేశారు. వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు మండలాలలో రిలేదీక్షలు చేపడుతున్నారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద రెండోరోజు నిర్వహించిన నిరశన దీక్షలను జిల్లా కన్వీనర్ ఉదయభాను ప్రారంభించారు. తిరువూరులో ఉద్యోగుల జేఏసీ చేపట్టిన రిలేనిరాహారదీక్షలకు ఎమ్మెల్యే పద్మజ్యోతి మద్దతు ప్రకటించి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. గుడివాడలో సంపూర్ణబంద్ నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూచౌక్ సెంటర్లో రిలేదీక్షలు చేశారు. కైకలూరు పార్టీ కార్యాలయం వద్ద సాగుతున్న రిలే దీక్షలు ఐదో రోజుకు చేరాయి. కలిదిండి మండలం గుర్వాయిపాలెంలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే దీక్షలు జరిగాయి. మూలలంక గ్రామస్తులు రోడ్డుపై వంటావార్పు చేశారు. జగ్గయ్యపేట పట్టణంలో సమైక్యాంధ్ర కోరుతూ రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన రిలేదీక్షలలో ఎస్జీఎస్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ సెంటర్లో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. జిల్లా సరిహద్దు గరికపాడు వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై కొద్దిసేపు ఆందోళన జరిపారు. మైలవరంలో ఎన్జీఓల సంఘం అధ్వర్యంలో రిలేదీక్షలు ప్రారంభించారు. మైలవరం రిక్షా వర్కర్స్ యూనియన్ సభ్యులు భారీగా ర్యాలీ నిర్వహించి, కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ అధ్వర్యంలో మైలవరంలో నాలుగో రోజు కూడా దీక్షలు కొనసాగాయి. తెలుగు తల్లి సెంటర్లో కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు జరిపారు. నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విజయమ్మ దీక్షకు మద్దతుగా నందిగామలో భారీ ర్యాలీ చేశారు. చల్లపల్లిలో పలు విద్యాసంస్ధల విద్యార్థులు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. గిలక్కాయలు ఊదుతూ నిరసన వ్యక్తంచేశారు. జి. కొండూరులోని గెయిల్ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళన చేశారు. చల్లపల్లిలో ఎస్సార్‌వైఎస్పీ జూనియర్ కళాశాల విద్యార్థులు సైకిల్‌ర్యాలీ చేశారు. వార్డెన్లు సమ్మెలో పాల్గొనడంతో చల్లపల్లి మండలంలో ఆరు వసతి గృహాలు మూతపడ్డాయి. వైఎస్సార్సీపీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి ర మేష్‌బాబు ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో విజయమ్మ దీక్షాస్థలికి తరలి వెళ్లారు. గన్నవరంలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు పదో రోజుకు, హనుమాన్‌జంక్షన్‌లో నాన్ పోలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఉయ్యూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు భారీ ప్రదర్శన చేశారు. ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. వ్యాపారులంతా స్వచ్ఛందంగా బంద్ పాటించారు. కంకిపాడులో బైక్ ర్యాలీ జరిగింది. పెనమలూరు మండలంలో సిద్ధార్థ కళాశాల వద్ద దీక్షలు కొనసాగాయి. విజయమ్మ దీక్షకు మద్దతుగా గంగూరులో రిలే నిరశన మూడో రోజూ కొనసాగింది. ఆటో వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. విజయవాడలో... ఎన్జీవోల ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు బెంజిసర్కిల్‌లో మానవహారం నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులు ఎన్‌హెచ్-5 పైప్రదర్శన చేశారు. విజయవాడ విద్యాసంస్థల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఎంజీరోడ్డులోని సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏటీఏ ఆధ్వర్యంలో ఆటోనగర్‌లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు సామినేని ఉదయభాను, ఉప్పులేటి కల్పన సంఘీభావం ప్రకటించారు. ఆటోనగర్ గేట్ వద్ద నిర్వహించిన ఆందోళనలో పాల్గొని ఉదయభాను డప్పు కొట్టారు. సెప్టెంబర్ రెండు తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. గుణదల కమర్షియల్ టాక్స్ కార్యాలయం వద్ద ఆ శాఖ ఉద్యోగులు రాస్తారోకో చేశారు. వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ నేతృత్వంలో వైఎస్ విజయమ్మ ఆమరణదీక్షకు మద్దతుగా స్థానిక మీసాల రాజేశ్వరరావు వంతెన వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.