
సాక్షి నెట్‌వర్క్: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పోరు రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. పార్టీ శ్రేణులన్నీ కంకణబద్ధులై ఆందోళనలో పాల్గొంటున్నాయి. ఢిల్లీ పరిణామాలకు అనుగుణంగా స్పందిస్తూ నిరసనను హోరెత్తిస్తున్నాయి. మంగళవారం జాతీయరహదారులన్నీ దిగ్బంధనం చేసిన శ్రేణులు బుధవారం రైలురోకోను నిర్వహించాయి. నియోజకవర్గ కేంద్రాలలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నాయి. మండుటెండను సైతం పట్టించుకోకుండా హోదా కోసం పార్టీ నాయకులు..కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. వైఎస్సార్‌సీపీ చేస్తున్న రిలేనిరాహార దీక్షలకు కొన్నిచోట్ల ప్రజాసంఘాలు మద్ధతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా
- ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు.
- సత్తెనపల్లిలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో 6 వ రోజు రిలే నిరాహారదీక్షలు.
- వినుకొండ శివయ్యస్థూపం సెంటర్లో బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో మహిళల ఆరో రోజు రిలే నిరాహారదీక్ష
- చిలకలూరిపేట సమన్వయకర్త మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆరో రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్షలు.
తూర్పుగోదావరి జిల్లా
- ప్రత్యేక హోదా కోరుతూ అమలాపురం కోఆర్డినేటర్ విశ్వరూప్ ఆధ్వర్యంలో ఏడవ రోజు కొనసాగుతున్న రిలేనిరాహార దీక్షలు.
- పిఠాపురం ఉప్పాడ సెంటర్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పెండెందొరబాబు ఆధ్వర్యంలో ఏడవ రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు. దీక్షల్లో పాల్గోన్న మాజీమంత్రి కొప్పన మోహన్ రావ్.
- ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో తుని గొల్లప్పారావు సెంటర్లో 7 వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు.
- రాజమండ్రి గోకవరం సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపి, జనసేన, వామపక్షాల ఆందోళన. అదేచొట చంద్రబాబుకు వ్యతిరేకంగా బీజేపి ఆధ్వర్యంలో ఆందోళన
ప్రకాశం జిల్లా
- ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఎంపీలు చేస్తున్న దీక్షకు మద్దతుగా కనిగిరిలో ఆరో రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీనేతలు బన్నీ, రంగనాయకులు రెడ్డి, మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కస్తూరి రెడ్డి, సుజాత, కృష్ణా రెడ్డి,కార్యకర్తలు
- ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఒంగోలులో చేపట్టిన రైల్‌రోకో కార్యక్రమంలో పాల్గొన్న వరికూటి అశోక్ బాబును దుర్భాషలాడిన ఒంగోలు సీఐ గంగా వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయాలంటూ చీరాల గడియార స్తంభం సెంటర్ వద్ద సీఐ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వైఎస్సార్సీపీ నాయకుడు వరికూటి అమృతపాణి.
కృష్ణాజిల్లా
- ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్దతుగా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో 7వ రోజుకు చేరిన రిలే నిరాహారదీక్షలు.
- ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటానికి మద్ధతుగా తిరువూరు నియోజకవర్గ కేంద్రంలో పట్టణ పార్టీ అధ్యక్షులు చలమాల సత్యనారాయణ ఆధ్వర్యంలో 6వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పాల్గొన్న పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పరసా శ్రీనివాసరావు, కౌన్సిలర్లు ఆర్ లక్ష్మణరావు, చిట్టిపోతుల లక్ష్మీనారాయణ, మండల మైనార్టీ అధ్యక్షులు జాఖీర్, కే నాగేశ్వరరావు తదితరులు.
- ఎంపీల ఆమరణ దీక్షకు మద్ధతుగా పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో నియోజకవర్గ కన్వీనర్ కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో 6వ రోజు రిలే నిరాహార దీక్షలు. కార్యక్రమంలో భారీగా పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
- గుడివాడ గాంధీ మండపంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేనిరాహార దీక్షల్లో 6వ రోజు మహిళ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా
- ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. చంద్రబాబు, మోడీ శవయాత్ర నిర్వహించిన ఆందోళనకారులు. నల్ల దుస్తులు ధరించి టీడీపీ-బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు.
చిత్తూరు జిల్లా
- కుప్పంలో వైఎస్ఆర్ సర్కిల్లో కొనసాగుతున్న పార్టీ శ్రేణుల రిలే దీక్షలు.
- బి.కొత్తకోటలో హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు.
కర్నూలు జిల్లా
- ఆలూరులో ప్రత్యేక హోదా కోసం ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం ఆధ్వర్యంలో ఆరో రోజు కొనసాగుతున్న రిలేదీక్షలు
- డోన్‌లో జడ్పీటీసీ శ్రీరాములు ఆద్వర్యం లో ప్రత్యేక హోదా కోసం 6వ రోజు కొనసాగుతున్న వైస్సార్సీపీ శ్రేణుల రిలే నిరాహారదీక్షలు
- ఆదోని పట్టణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా కోసం 6వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు.
- నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో 6వ రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు. పాల్గొన్న జడ్పీటీసీ యుగంధర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస రెడ్డి, మండల కన్వీనర్లు కాంతారెడ్డి,నాగభూషణం రెడ్డి తదితరులు.
- పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం 6 వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు.
- ప్రత్యేక హోదా కోసం ఎంపీల ఆమరణదీక్షకు సంఘీభావంగా కర్నూలు ధర్నా చౌక్ వద్ద నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో 6వరోజు ముస్లిం మైనార్టీలు రిలే దీక్షలు.
నెల్లూరు జిల్లా
- కావలిలో ప్రత్యేక హోదా కోసం ఎంఎల్ఏ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు.
Comments
Please login to add a commentAdd a comment