releaf
-
గో ఫస్ట్‌కు ఎన్సీఎల్టీలో ఊరట
న్యూఢిల్లీ: స్వచ్ఛంద దివాలా ప్రకటించిన విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఊరట లభించింది. కంపెనీకి లీజుకు ఇచి్చన విమానాలను స్వా«దీనం చేసుకునేందుకు లెస్సర్లు దాఖలు చేసిన పిటీషన్లను ఎన్సీఎల్టీ తోసిపుచి్చంది. ఏవియేషన్ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ.. ఇంకా వాటిని డీరిజిస్టర్ చేయనందున కార్యకలాపాల పునరుద్ధరణకు అవి అందుబాటులో ఉన్నట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. విమానాలు, ఇంజిన్లే గో ఫస్ట్ వ్యాపారానికి కీలకమైనవని, వాటిని తీసివేస్తే ’కంపెనీ మరణానికి’ దారి తీస్తుందని ఎన్సీఎల్టీ తెలిపింది. దీని వల్ల రుణభార సమస్య పరిష్కారానికి అవకాశమే లేకుండా పోతుందని వివరించింది. మరోవైపు తమ విమానాలు, ఇంజిన్లను తనిఖీ చేసుకునేందుకైనా అనుమతినివ్వాలంటూ లెస్సర్లు చేసిన విజ్ఞప్తిని కూడా ఎన్సీఎల్టీ తోసిపుచి్చంది. విమానాల భద్రతా ప్రమాణాలు అత్యుత్తమ స్థాయిలో ఉండేలా చూడాల్సిన బాధ్యత పరిష్కార నిపుణుడికి (ఆర్పీ) ఉంటుందని స్పష్టం చేసింది. మే 3 నుంచి గో ఫస్ట్ కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
దుబ్బాక ఫలితాల తర్వాత టీఆర్ఎస్కు ఫిట్స్
సాక్షి, ఢిల్లీ: దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్కు ఫిట్స్ వచ్చాయని బీజేపీ సీనియర్‌నేత, మధ్యప్రదేశ్ బీజేపీ ఇంచార్జ్ మురళీధర్‌రావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల జిమ్మిక్కులు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 7 తర్వాత వరద సాయం ఇస్తామని ఇప్పటికీ ఎందుకు అందజేయలేదని ప్రశ్నించారు. వరంగల్‌లో ప్రజలు వర్షాలతో నష్టపోయినా వారికి రూ.10వేలు ఇవ్వలేదని మండిపడ్డారు. చదవండి: రజనీ పార్టీ ఏర్పాటు ముహూర్తం అప్పుడే! కరోనాతో ప్రైవేట్ స్కూళ్లల్లో పనిచేస్తున్న 6 లక్షలమంది రోడ్డునపడ్డారని దుయ్యబాట్టారు. ప్రైవేట్ పాఠశాలపై పరోక్షంగా ఆధారపడిన వారికి ఉపాధి పోయిందన్నారు. చార్మినార్ తెలంగాణకు బాసింగం కాదని, కాకతీయ తోరణం తెలంగాణ అస్తిత్వమని తెలిపారు. కాకతీయులు ఫ్యూడలిజం ప్రవేశపెట్టలేదని, గొలుసు చెరువులతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఆదుకుంటున్నారని, అమ్మ ఒడి పేరుతో తల్లిదండ్రులకు ఫీజు రీయింబర్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. -
గ్రేటర్ వరద సాయంలో రూ.387కోట్ల స్కాం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన ప్రజలకు పరిహారం పంపిణీ చేయడంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ వరద సాయం పంపిణీపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వ సాయం అంటశాలపై చర్చించేందుకు శుక్రవారం ఆయన పార్టీ నేతలతో గాంధీ భవన్లో సమావేశమయ్యారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్‌యాదవ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్కు మేలు చేసేందుకే... వరద బాధితులకు రూ.550 కోట్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, రూ. 2 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో రూ. 5 వేల కోట్లు కూడా హైదరాబాద్‌కు ఇవ్వలేరా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్కు మేలు చేసేందుకే అధికారులు వరద సాయాన్ని నగదు రూపంలో ఇచ్చారని ఆరోపించారు. వరద సాయం కింద నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ. 50 వేలు ఇవ్వాలని, కూలిపోయిన ఇళ్లకు రూ.5 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2.5 లక్షలు ఇవ్వాలన్నారు. గవర్నర్‌తో ఫోన్లో సంభాషణ గ్రేటర్ పరిధిలో జరిగిన వరద సాయం అక్రమాల్లో జోక్యం చేసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఆమెతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు చేసినట్లు టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. -
ముగ్గురు సౌదీ బాధితులకు విముక్తి
ఇద్దరిపై కేసు నమోదు కదిరి : సౌదీలో ఇబ్బందులు పడుతున్న తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు చెందిన ఖాదర్‌బాషా, షాహిన్, సుమియాకు కదిరి పోలీసులు విముక్తి కల్పించారు. వీరిని సౌదీకి పంపి మోసగించిన కదిరి పట్టణానికి చెందిన బ్రోకర్లు అయూబ్, హిదయతుల్లాపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళ వారం కదిరిలో డీఎస్పీ ఎ¯ŒSవీ రామాంజనేయులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కదిరి ప్రాంతానికి చెం దిన పలువురు బ్రోకర్ల మాయమాటలు నమ్మి సౌదీకి వెళ్లారని, బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసుకుని ఓ బృందాన్ని సౌదీకి పంపి వారికి విముక్తి కల్పించామన్నారు. నకిలీ ఏజెంట్ల మాయలో పడి సౌదీకి వెళితే అక్కడ బాధలు తప్పవన్నారు. అనంతరం బాధితులు సైతం ఇదే విషయాన్ని మీడియాకు వివరించారు. సౌదీ వెళ్లిన పోలీస్ బృందంలో సీఐలు లక్ష్మణ్, శ్రీనివాసులు, ఎస్ఐలు శ్రీనివాసులు, జయపాల్‌రెడ్డి ఉన్నారని డీఎస్పీ తెలిపారు.