సాక్షి, ఢిల్లీ: దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్‌కు ఫిట్స్ వచ్చాయని బీజేపీ సీనియర్‌నేత, మధ్యప్రదేశ్ బీజేపీ ఇంచార్జ్ మురళీధర్‌రావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ నాయకులు ఎన్నికల జిమ్మిక్కులు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 7 తర్వాత వరద సాయం ఇస్తామని ఇప్పటికీ ఎందుకు అందజేయలేదని ప్రశ్నించారు. వరంగల్‌లో ప్రజలు వర్షాలతో నష్టపోయినా వారికి రూ.10వేలు ఇవ్వలేదని మండిపడ్డారు. చదవండి: రజనీ పార్టీ ఏర్పాటు ముహూర్తం అప్పుడే!
కరోనాతో ప్రైవేట్ స్కూళ్లల్లో పనిచేస్తున్న 6 లక్షలమంది రోడ్డునపడ్డారని దుయ్యబాట్టారు. ప్రైవేట్ పాఠశాలపై పరోక్షంగా ఆధారపడిన వారికి ఉపాధి పోయిందన్నారు. చార్మినార్ తెలంగాణకు బాసింగం కాదని, కాకతీయ తోరణం తెలంగాణ అస్తిత్వమని తెలిపారు. కాకతీయులు ఫ్యూడలిజం ప్రవేశపెట్టలేదని, గొలుసు చెరువులతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఆదుకుంటున్నారని, అమ్మ ఒడి పేరుతో తల్లిదండ్రులకు ఫీజు రీయింబర్స్ చేస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment