ముగ్గురు సౌదీ బాధితులకు విముక్తి | releaf to soudi victims | Sakshi
Sakshi News home page

ముగ్గురు సౌదీ బాధితులకు విముక్తి

Published Wed, Feb 15 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

releaf to soudi victims

ఇద్దరిపై కేసు నమోదు
కదిరి : సౌదీలో ఇబ్బందులు పడుతున్న తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు చెందిన ఖాదర్‌బాషా, షాహిన్, సుమియాకు కదిరి పోలీసులు విముక్తి కల్పించారు. వీరిని సౌదీకి పంపి మోసగించిన కదిరి పట్టణానికి చెందిన బ్రోకర్లు అయూబ్, హిదయతుల్లాపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళ వారం కదిరిలో డీఎస్పీ ఎ¯ŒSవీ రామాంజనేయులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

కదిరి ప్రాంతానికి చెం దిన పలువురు బ్రోకర్ల మాయమాటలు నమ్మి సౌదీకి వెళ్లారని, బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసుకుని ఓ బృందాన్ని సౌదీకి పంపి వారికి విముక్తి కల్పించామన్నారు.  నకిలీ ఏజెంట్ల మాయలో పడి సౌదీకి వెళితే అక్కడ బాధలు తప్పవన్నారు. అనంతరం బాధితులు సైతం ఇదే విషయాన్ని మీడియాకు వివరించారు.  సౌదీ వెళ్లిన పోలీస్‌ బృందంలో సీఐలు లక్ష్మణ్, శ్రీనివాసులు, ఎస్‌ఐలు శ్రీనివాసులు, జయపాల్‌రెడ్డి ఉన్నారని డీఎస్పీ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement