release delayed
-
సాహో విడుదలపై సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్ : యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సాహో విడుదల ఇప్పట్లో సాధ్యం కాదని తెలుస్తోంది. ఎస్ఎస్ రాజమౌళి చెక్కిన బాహుబలి రెండు భాగాల్లో అభిమానులను ఉర్రూతలూగించిన ప్రభాస్‌ను మరోసారి తెరపై చూడాలని ఉవ్విళ్లూరుతున్న అభిమానులకు నిరాశ ఎదురవనుంది. సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సాహో షూటింగ్ పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టనుంది. తొలుత ఈ ఏడాది దీపావళికి సాహో ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుందని అంచనాలు వెల్లడయ్యాయి. తాజా సమాచారం మేరకు సాహో ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరోవైపు పూజా హెగ్డేతో ఇంకా టైటిల్ వెల్లడించని ప్రభాస్ 20వ చిత్రం సాహో కంటే ముందుగా విడుదల కావచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే బాహుబలి తర్వాత సాహోనే తొలుత రిలీజ్ కావాలని ప్రభాస్ పట్టుబడుతున్నట్టు తెలిసింది. సాహోలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తుండగా, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
భారీ యాక్షన్ మూవీ రిలీజ్ వాయిదా..!
ప్రపంచ వ్యాప్తంగా వరుస విజయాలు సాధిస్తున్న యాక్షన్ సినిమా సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. రేసింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లోని సినిమాలో హాలీవుడ్ తో పాటు ఇతర దేశాల్లోనూ భారీ వసూళ్లు సాధించాయి. ఈ ఏడాది విడుదల అయిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 ఘనవిజయం సాధించటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. అయితే 8వ భాగం రిలీజ్ సందర్భంగా తదుపరి భాగాన్ని 2019 ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్రయూనిట్, తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. సినిమాను ఏకంగా ఏడాది ఆలస్యంగా విడుదల చేయనున్నట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్ ప్రకటించింది. 2020 ఏప్రిల్ 10న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లో 9 వ భాగం విడుదల అవుతుందని అధికారిక సోషల్ మీడియా పేజ్ లో ప్రకటించారు. అయితే ఆలస్యానికి కారణం ఏంటన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. A post shared by The Fate of the Furious (@fastandfuriousmovie) on Oct 4, 2017 at 11:00am PDT -
అడ్డంకులు తొలగి.. 'పులి' విడుదల
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన పులి ఆర్థిక పరమైన సమస్యల కారణంగా కాస్త ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. గురువారం ఉదయం 4 గంటల షోతోనే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా క్యూబ్ సంస్థకు రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లించని కారణంగా ఆలస్యం అయినట్టు చెపుతున్నారు. బుధవారం పులి యూనిట్ సభ్యుల ఇళ్ల పై జరిగి ఆదాయ పన్ను దాడులే ఈ ఆలస్యానికి కారణంగా భావిస్తున్నారు. నిర్మాతలతో పాటు హీరో విజయ్, ఇతర యూనిట్ సభ్యులు చొరవ తీసుకోవటంతో బెనిఫిట్ షోస్ మిస్ అయినా మార్నింగ్ షో టైంకు కొన్ని ప్రాంతాలలో సినిమా విడుదలైంది. అయితే అన్ని ప్రాంతాల్లో విడుదలకు మాత్రం మరి కాస్త సమయం పట్టనుంది. ప్రస్తుతానికి మదురై, సేలం లాంటి ప్రాంతాల్లో సినిమా ప్రదర్శన మొదలైనట్టు హీరోయిన్ హన్సిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కోలీవుడ్‌లో సాధారణంగా పెద్ద హీరోల సినిమాలను తెల్లవారుజామున 4 గంటలకు, 5 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తారు. కానీ గురువారం ఇవేవీ ప్రదర్శించలేదు. అనుకున్న సమయానికి సినిమా విడుదల కాకపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ధర్మపురి, సేలంలో థియేటర్ల వద్ద అభిమానులు ఆందోళన చేశారు. మదురైలో బస్సులను ధ్వంసం చేశారు. ఐటీ దాడుల కారణంగా ఎగ్జిబిటర్లకు చెల్లింపులు చేయడానికి ఆదాయపన్ను అధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉందని, అందువల్లే సినిమా ఆలస్యం అయినట్టుగా తెలుస్తుంది. బ్యాంకులు తెరిచిన తర్వాత చెల్లింపులు జరిగి, ఆ తర్వాతే సినిమా విడుదలైందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శృతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తుండగా, శ్రీదేవి, సుధీప్, ప్రభు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. All issues sorted ... It's time to Roar . It's time for #puli ☺️☺️ it's #showtime