ఊహించిందే జరిగింది!
నిజామాబాద్: వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎ ఫ్) విడుదలలో అంతా అనుకున్నట్టే జరిగింది. వచ్చే ఏడా ది నుంచి కేంద్రం ఈ పథకాన్ని ఎత్తివేయనున్నట్లు ప్రచా రం జరిగినా, 2014-15 ప్రతిపాదనలకు సైతం మోక్షం కలగలేదు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇటీవలే బీఆర్జీ నిధులు విడుదల కాగా, ఆ జాబితాలో ఉన్న జిల్లాకు మొండిచెయ్యే ఎదురైంది. ఈ నెలాఖరు వరకైనా జిల్లా నుంచి ప్రతిపాదించిన రూ.25.34 కోట్ల విలువ చేసే 1,934 పనులకు నిధులు వస్తాయని అందరూ భావించారు. ఆ నిధులు విడుదల కాకపోగా, వచ్చే సంవత్సరం నుంచి బీఆర్జీఎఫ్ ఉండబోదని ఇదివరకే సంకేతం ఇచ్చిన కేంద్రం ఈ బడ్జెట్లో కేటా యింపులు కూడ ఇవ్వలేదు. దీంతో వచ్చే ఏడాది మాట పక్కనబెడితే, ఈ ఏడాది నిధులూ నిలిచిపోవడంపై నిరాశ వ్యక్తం అవుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలు ముందే పంపినట్లరుుతే ఈ సమస్య ఉండేది కాదు. జిల్లా పరిషత్ అధికారులు గ్రామాలు, మండలాలవారీగా ప్రతిపాదనలు తెప్పించి ప్ర భుత్వామోదంతో హైపవర్ కమిటీకి పంపే ప్రయత్నం చేసినా, అదే సమయంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మార్పులు, చేర్పులకు పట్టుబట్టడం, జడ్పీ, డీపీ సీలలో ఆమోదించి పంపడంలో ఆలస్యం జరిగింది. ఫలితంగా ‘కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన’ చందంగా మారింది.
ఆలస్యమే అసలు కారణం
జిల్లాలోని 36 మండలాలు నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ మున్సిపాలిటీల నుంచి 1934 పనుల కోసం రూ.25.34 కోట్లకు ప్రతిపాదనలు 2014 జూన్ వరకు ఢిల్లీ హైపవర్ కమిటీకి చేరివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న చర్చ ఉంది. అధికారులు ఇదే ఉద్దేశ్యంతో పనులకు మే మాసంలోనే ప్రతిపాదనలు కో రారు. అప్పుడున్న ప్రత్యేకాధికారులు వాటిని సిద్ధం చేసి పంపించారు. అప్పుడున్న కలెక్టర్ సిఫారసుతో ప్రభుత్వం ద్వారా కేంద్ర హైపవర్ కమిటీకి పంపిచేందుకు స న్నాహాలు చేస్తున్న క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మ్రోగింది. ఎన్నికల ప్రక్రియలో మునిగిపోయిన అధికారులు బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలను పక్కబెట్టారు. ఆ తర్వాతైన పంపేందుకు కొత్త పాలకవర్గంతో జడ్పీ సర్వసభ్యసమావేశం, డీపీసీ ఆమోదం కోసం ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యు లు, జడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదనలలో తేడా వచ్చిందంటూ మార్పులు, చేర్పులకు దిగారు. దీంతో కొంతకాలం వేచి చూసిన అధికారులు బీఆర్జీఎఫ్ మార్గదర్శకాల ప్రకారం పనుల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అరుుతే, వాటిని ఢిల్లీ హైపవర్ కమిటీకి చేరవేయడంలో జరిగిన జాప్యం కారణంగానే నిధుల విడుదలకు అంతరాయం కలిగినట్లు చెబుతున్నారు.
కమిషనర్ కాన్ఫరెన్స్‌తో స్పష్టత
పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనిత రాంచంద్రన్ బీఆర్జీ నిధులపై స్పష్టత ఇవ్వడంతో ఆ నిధుల విడుదలపై భ్రమలు తొలగాయి. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె భవిష్యత్‌లో బీఆర్జీఎఫ్ నిధులుండవని పేర్కొంటూ చివరగా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కే టాయించినట్లు స్పష్టం చేశారు. ఒకవేళ బీఆర్జీఎఫ్ విడుదలైతే గ్రామ పంచాయతీలలో 1,255 పనులకు రూ.1012.40 లక్షలు, మండల పరిషత్‌లకు 346 పనులకు రూ . 607.30లక్షలు, జిల్లా పరిషత్ 174 పనులకు రూ.405 లక్షలు, మున్సిపాల్టీలు 135 పనులకు గాను రూ.509.30 లక్షలు ఖర్చు చేసే అవకాశం ఉండేది. పాత ప్రతిపాదనలు తిరస్కరణకు గురి కాగా, 2015-16 కోసం సిద్ధం చేసిన ప్రతిపాదనలు కూడా ఇక ఉత్తవే కానున్నాయి.