reliance life insurance
-
రిలయన్స్ స్మార్ట్ క్యాష్ ప్లస్
రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్మార్ట్ క్యాష్ ప్లస్ పేరుతో మనీ బ్యాక్ పాలసీని ప్రవేశపెట్టింది. ప్రతి మూడేళ్లకు నగదు వెనక్కి వస్తుంది. ప్రతీ మనీ బ్యాంక్‌కి ఐదు శాతం చొప్పున నగదు పెరుగుతుంటుంది. 14 నుంచి 55 ఏళ్లలోపు వాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. కనీస బీమా రక్షణ రూ.1,00,000గా నిర్ణయించారు. పాలసీ కాలపరిమితిని 10, 13, 16, 19, 22 ఏళ్లలో ఒకదానిని ఎంచుకోవచ్చు. -
రిలయన్స్ లైఫ్ నుంచి సూపర్ మనీ బ్యాక్ ప్లాన్
హైదరాబాద్: రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కొత్తగా రిలయన్స్ సూపర్ మనీ బ్యాక్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లో లైఫ్ కవర్ ఎన్నేళ్లు ఉంటుందో, దాంట్లో సగం కాలానికి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని కంపెనీ సీఈవో అనుప్ రావూ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ ఐదేళ్లకు మనీ బ్యాక్ ప్రయోజనాలుంటాయని పేర్కొన్నారు. ప్రీమియం చెల్లింపు కాలం పూర్తయిన తర్వాత పాలసీదారుడు క్రమం తప్పకుండా నెలవారీ ఆదాయం పొందవచ్చని వివరించారు. ఈ నెల వారీ చెల్లింపు ప్రతీ ఏడాది 3% చొప్పున వృద్ధి చెందుతుందని, మెచ్యురిటీ కాలం వరకూ/పాలసీదారుడు జీవించి ఉన్నంత వరకూ ఈ చెల్లింపులు కొనసాగుతాయని తెలిపారు. పూర్తి కాలానికి లైఫ్ ప్రొటెక్షన్ లభిస్తుందని పేర్కొన్నారు. 18-55 సంవత్సరాల వయస్సున్న వ్యక్తులు ఈ పాలసీకి అర్హులని, కనీస బీమా రూ. 1లక్ష అని, 10/20/ 30/40/50 సంవత్సరాల కాలానికి పాలసీ తీసుకోవచ్చని అనుప్ వివరించారు.