రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్మార్ట్ క్యాష్ ప్లస్ పేరుతో మనీ బ్యాక్ పాలసీని ప్రవేశపెట్టింది. ప్రతి మూడేళ్లకు నగదు వెనక్కి వస్తుంది. ప్రతీ మనీ బ్యాంక్‌కి ఐదు శాతం చొప్పున నగదు పెరుగుతుంటుంది.
14 నుంచి 55 ఏళ్లలోపు వాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. కనీస బీమా రక్షణ రూ.1,00,000గా నిర్ణయించారు. పాలసీ కాలపరిమితిని 10, 13, 16, 19, 22 ఏళ్లలో ఒకదానిని ఎంచుకోవచ్చు.