Religious leaders
-
మైనర్‌కు మద్యం తాగించి అఘాయిత్యం... ఆధ్యాత్మిక ‘గురువు’ అరెస్ట్
భోపాల్: నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. ఇంటా బయటా అన్ని చోట్ల వేధింపులు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా, నిందితులను కఠినంగా శిక్షించినా.. కామాంధుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. మహిళలపై లైంగికదాడులు ఆగడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ఓ ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతున్న వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ఠ్ చేశారు. రేవా జిల్లాకు చెందిన ఆధ్యాత్మిక గురువు మహంతి సీతారాం దాస్ అలియాస్ సీతారాం త్రిపాఠి ఓ బాలికను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మార్చి 28న చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే రౌడీ షీటర్ సాయంతో.. అధిక భద్రత కలిగి ఉన్న సర్క్యూట్ హౌజ్ (ప్రభుత్వ భవనం)లో ఈ ఘోరానికి ఒడిగట్టడం గమనార్హం. అనంతరం బాధితురాలిని మహంత్ అనుచరులు కారులో మరో చోటుకి తీసుకెళ్లి వదిలేశారు. అయితే స్థానికుల సహాయంతో ఆమె అక్కడి క్షేమంగా బయటపడింది. చదవండి: సాఫ్ట్వేర్ కంపెనీల్లో మంచి హోదా.. ఉద్యోగాలు పెట్టిస్తానంటూ.. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు రేవా జిల్లా పోలీసులకు మార్చి 29న ఫిర్యాదు చేయగా.. సీతారాం త్రిపాఠి, రౌడీ షీటర్తోపాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవా పోలీసులను ఆదేశించిన కొన్ని గంటల్లోనే సీతారాం త్రిపాఠిని పోలీసులు సింగ్రౌలీ జిల్లాలో గురువారం అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఏసీపీ శివ కుమార్ వర్మ తెలిపారు. అయితే ప్రజాప్రతినిధులతో సహా వీఐపీలు బస చేసేందుకు ఉద్దేశించిన సర్క్యూట్ హౌస్‌లో రౌడీ షీటర్ పేరున గదిని ఎలా కేటాయించారనే దానిపై విచారణ జరుగుతోందని ఏసీపీ తెలిపారు. -
మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకే అరెస్ట్ చేశాం!
గత నెలలో హరిద్వార్‌లోని "ధర్మ సన్సద్" లేదా మతపరమైన సభలో మత పెద్ద నర్సింహానంద్ ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు అతన్ని మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ చేశాం అని తెలిపారు. అంతేకాదు మతపరమైన సభలో ద్వేషపూరిత ప్రసంగం చేసింనందుకు అరెస్ట్ చేయలేదని కూడా వివరించారు. అయితే పోలీససులు ద్వేషపూరిత ప్రసంగం కేసులో మత పెద్దకు నోటీసులు జారీ చేశామని, ఆ కేసులో కూడా ఆయన్ను రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గతనెలలో జరిగిన మతపరమైన సభలో ద్వేషపూరిత ప్రసంగాలపై నమోదైన కేసులో యతి నర్సింహానంద్ పేరు కూడా ఉందన్న సంగతి తెలిసిందే. అయితే మతం మారక ముందు వసీం రిజ్వీగా ఉన్న జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి మాత్రమే ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన ఏకైక సహ నిందితుడు. ఈ ఘటన జరిగిన దాదాపు నెల రోజుల తర్వాత, సుప్రీంకోర్టు జోక్యంతో అతని అరెస్టు జరిగింది. (చదవండి: ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం) -
సన్యాసిని సీఎం చేస్తే ఏం ఒరిగింది!
సాక్షి, భోపాల్: ఐదుగురు సాధువులకు మంత్రి పదవులు ఇవ్వడం మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. వారు ఏం సాధించారని మంత్రి హోదా కల్పిస్తారని ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ప్రశ్నిస్తోంది. మత గురువులైన నర్మదానంద్ మహరాజ్, కంప్యూటర్ బాబా, హరిహరానంద్ మహరాజ్, భయ్యూ మహరాజ్, పండిత్ యోగేంద్ర మహంత్‌లకు మంత్రి హోదా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు నర్మదా నది సంరక్షణా కమిటీ సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాజ్ బబ్బర్ బీజేపీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాషాయం వస్త్రాలు ధరించిన సాధువులను చూపించి ఓట్లడిగి ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఓ సన్యాసిని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే ఏం జరిగిందో దేశం మొత్తం చూసిందని రాజ్ బబ్బర్ పేర్కొన్నారు. నేరాలు పెరిగిపోవడం, మత ఘర్షణలు జరగడం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. కేవలం తమ పాపాల నుంచి విముక్తి పొందేందుకే బాబాలు, సాధువులకు పదవులు, హోదాలు బీజేపీ కల్పిస్తుందన్నారు. సహాయ మంత్రులుగా తమని నియమించడంపై కంప్యూటర్ బాబా స్పందించారు. బాబాలు, మత గురువులు, సాధువులకు పదవులు కట్టబెట్టడంలో తప్పేముందని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. మేం చేసిన పనికి ప్రతిఫలం లభించినట్లు భావిస్తున్నాం. నర్మదా ఘటాలా అవినీతితో పాటు నర్మదా నది పరిరక్షణలో జరిగిన అక్రమాలు, అవినీతిని బయటపెట్టినట్లు కంప్యూటర్ బాబా గుర్తుచేశారు. సాధువులను నర్మదా పరిరక్షణ నేపథ్యంలో సహాయ మంత్రులుగా నియమించడంలో తప్పేంలేదని, ప్రొటోకాల్ ప్రకారమే వారికి బాధ్యతలు అప్పగించామని బీజేపీ అధికార ప్రతినిధి రజనీశ్ అగర్వాల్ తెలిపారు. దీంతో ప్రజలు భాగస్వాములుగా మారితే నది పరిరక్షణ పనులు తేలికగా జరుగుతాయని చెప్పారు. -
మతగురువులకు క్యాబినెట్ హోదా
భోపాల్ : ఉత్తరాది రాజకీయాలపై మత ప్రభావం ఎంతగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఐదుగురు మతగరువులకు క్యాబినెట్ హోదా కల్పించడమే ఇందుకు ఉదాహరణ. నర్మదానంద్ మహరాజ్, హరిహరానంద్ మహరాజ్, కంప్యూటర్ బాబా, భయ్యూ మహరాజ్, పండిత్ యోగేంద్ర మహంత్‌లు మతగురువుల నుంచి క్యాబినెట్ హోదా పాందారు. వీరు నర్మదా నది సంరక్షణా కమిటీ సభ్యులుగా ఉన్నారు. నర్మాదా నది పరిరక్షణా కమిటీ సభ్యులు కావడం వల్లే వారికి పదవులు వచ్చాయని, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం బాబాలకు మంత్రి పదవులు ఇవ్వటం ద్వారా రాజకీయంగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్రం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నర్మదా నది పరిరక్షణను గాలికి వదిలేశారని, చేసిన పాపాలను కడుక్కోవడానికే వారికి మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. కమిటీలో సభ్యులుగా ఉన్న ఐదుగురు నర్మదా నది ఒడ్డున ఆరుకోట్ల మొక్కలు నాటారో లేదో తేల్చాలన్నారు. బీజేపి అధికార ప్రతినిధి రజనీష్ అగర్వాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులకు మతగురువులకు సంబంధించిన విషయాలు నచ్చినట్లుగా లేవన్నారు. కమిటీ సభ్యులుగా ఉన్న ఐదుగురికి నర్మదా నది పరిరక్షణపై సరైన అవగాహన ఉందన్న కారణంతో మంత్రి పదవులు ఇచ్చామని స్సష్టం చేశారు. ప్రజల్ని నర్మరా నది పరిరక్షణలో కలుపుకుని పోవడానికి వీరి పాత్ర అవసరమన్నారు. ఇదిలా ఉండగా కంప్యూటర్ బాబా నర్మదా నది పరిరక్షణ పనుల్లో అవినీతి జరిగిందని చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. -
సిగరెట్ కాల్చలేదని.. డిమోట్ చేశారు!
స్థానిక ముస్లిం నాయకుల ఎదుట సిగరెట్ కాల్చే ధైర్యం చేయనందుకు చైనాలో ఓ ఉద్యోగి డిమోట్ అయ్యాడు. ముస్లింలు ఎక్కువగా ఉండే జింజియాంగ్ రాష్ట్రంలో ఓ కమ్యూనిస్టు పార్టీ అధికారికి హోదా తగ్గించారు. హోటన్ నగరం సమీపంలోని ఒక గ్రామానికి పార్టీ చీఫ్‌గా ఉన్న జెలిల్ మత్నియాజ్ను ’సీనియర్ స్టాఫ్ మెంబర్’ నుంచి ’స్టాఫ్ మెంబర్’ గా డిమోట్చేశారు. మత నాయకుల ఎదురుగా నిలబడి సిగరెట్ కాల్చే ధైర్యం చేయనందుకే ఇలా చేసినట్లు హోటన్ డైలీ తమ సోషల్ మీడియా వుయ్ చాట్ అకౌంటులో పోస్టు చేసిన సమాచారంలో తెలిపింది. సిగరెట్ తాగడం అనేది ఎవరికి వారి వ్యక్తిగత ఇష్టమని, అయితే మతపెద్దల ఎదురుగా సిగరెట్ కాల్చకూడదనేది ఆ ప్రాంతంలో ఉన్న ఆధ్యాత్మిక ఆలోచనల తీవ్రతను తెలియజేస్తుందని హోటన్ నగర అధికారి ఒకరు చెప్పినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది. తీవ్రమైన మత ఆలోచనలకు వ్యతిరేకంగా అతడు పోరాడాల్సి ఉందని, లేకపోతే అతడు ఈ తీవ్రవాద ప్రాంతీయ బలగాలపై పోరాటంలో విఫలం అయినట్లే అవుతుందని ఆ అధికారి వ్యాఖ్యానించారు. స్థానిక మతాచారాల ప్రకారం పెద్దలు లేదా మతపెద్దల ఎదురుగా సిగరెట్లు కాల్చకూడదని ఝెజియాంగ్ నార్మల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తుర్జుంజున్ తుర్సుమ్ తెలిపారు. ఈ అధికారి హోదాను తగ్గించడం అనేది ఒక్క ఘటన మాత్రమేనని, దీన్ని విధాన నిర్ణయంగా తీసుకోకూడదని ఆయన అన్నారు. -
మేం ‘రా’ గూఢచారులమన్న కథనాల వల్లే..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని కరాచీలో అదృశ్యమైన ఇద్దరు మతగురువులు సోమవారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. వారు సాయంత్రం విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ను కలువనున్నారు. కరాచీలోని తన సోదరిని చూసేందుకు మేనల్లుడు సయ్యద్ నజీమ్ అలీ నిజామీతో కలసి హజ్రత్ నిజాముద్దీన్ దర్గా(ఢిల్లీ) ప్రధాన గురువు సయ్యద్ ఆసిఫ్ నిజామీ ఈ నెల 8న వెళ్లారు. ఆ తర్వాత వారు కనిపించకుండాపోయారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌తో సుష్మాస్వరాజ్ ఫోన్లో మాట్లాడారు. వీరి ఆచూకీ కనుగొనాలని కోరారు. దీంతో కనిపించకుండా పోయిన వారిద్దరూ కరాచీలో క్షేమంగానే ఉన్నారని పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని సుష్మాస్వరాజ్ ఆదివారం ట్విట్టర్లో తెలిపారు. పాక్‌లో వారు సురక్షితంగా ఉన్నారని, సోమవారం తిరిగి రానున్నారని వెల్లడించారు. పాకిస్థాన్‌లోని ఉమ్మత్ దినపత్రిక తమ గురించి తప్పుడు కథనాలు రాసిందని, తాము భారత విదేశాంగ నిఘా సంస్థ రా గూఢచారులమని పేర్కొంటూ ఫొటోలు ప్రచురించిందని, అందువల్లే ఇంత గందరగోళం చోటుచేసుకున్నదని నజీమ్ నిజామీ తెలిపారు. -
పాక్‌లో అదృశ్యమైన మత గురువులు క్షేమమే
విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ న్యూఢిల్లీ: పాకిస్తాన్లో అదృశ్యమైన మతగురువులిద్దరూ క్షేమంగానే ఉన్నారని, వారు సోమవారం ఢిల్లీకి చేరుకుంటారని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. కరాచీలోని తన సోదరిని చూసేందుకు మేనల్లుడు సయ్యద్ నజీమ్ అలీ నిజామీతో కలసి హజ్రత్ నిజాముద్దీన్ దర్గా(ఢిల్లీ) ప్రధాన గురువు సయ్యద్ ఆసిఫ్ నిజామీ ఈ నెల 8న ఇక్కడ్నుంచి బయల్దేరి వెళ్లారు. ఆ తర్వాత వారు కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌తో సుష్మాస్వరాజ్ ఫోన్లో మాట్లాడారు. వీరి ఆచూకీ కనుగొనాలని కోరారు. దీంతో కనిపించకుండా పోయిన వారిద్దరూ కరాచీలో క్షేమంగానే ఉన్నారని పాకిస్తాన్ శనివారం వెల్లడించింది. దీనిపై సుష్మాస్వరాజ్ ఆదివారం ట్వీట్ చేశారు. సయ్యద్ నజీమ్ అలీ నిజామీతో మాట్లాడానని, క్షేమంగానే ఉన్నామని ఆయన చెప్పినట్లు తెలిపారు.