rented ofices
-
అద్దె ఇంటిలో అంగన్వాడీ..!
సాక్షి, విజయనగరం : అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణంలో గత టీడీపీ ప్రభుత్వం అలసత్వం చూపింది. చిన్నారులు, కార్యకర్తలు, ఆయాలను కష్టాల్లోకి నెట్టింది. నాటి నిర్లక్ష్యం ఫలితంగా భవన నిర్మాణాలు ప్రారంభించి మూడేళ్లు గడిచినా సగం నిర్మాణాలు పూర్తికాలేదు. 111 భవనాలకు అసలు పునాది రాయికూడా వేయలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భవనాలు మంజూరైనా అంగన్వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. నిర్మాణాలకు దూరంగా... 2016 –17 సంవత్సరంలో 596 అంగన్వాడీ కేంద్రాలకు, 2018–19లో 349 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు మంజూరయ్యాయి. మొత్తంగా 945 భవనాలు మంజూరుకాగా వీటిలో కేవలం 411 భవనాల పనులు మాత్రమే పూర్తయ్యాయి. 111 భవనా లకు ఇంకా పునాది రాయి కూడా వేయలేదు. అయితే, ప్రస్తుతం భవనాలు మంజూరై కూడా నిర్మాణం పూర్తికాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇరుకు గదులు, సరైన వసతులు లేనిఅద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో భవనానికి రూ.7.50 లక్షలు.. ఒక్కో భవనానికి రూ.7.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. భవన నిర్మాణం 600 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించాలి. కిచెన్, స్టోర్ రూమ్, హాల్, మరుగుదొడ్డి నిర్మించాలి. రూ.7.50 లక్షల్లో రూ.5 లక్షలు ఉపాధిహామి నిధులు, రెండు లక్షలు ఐసీడీఎస్ శాఖ, పంచాయతీ నుంచి రూ.50 వేలు మంజూరు చేస్తారు. జిల్లాలో 2,977 అంగన్వాడీ కేంద్రాలు, 745 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వెయ్యి కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 700 కేంద్రాలు సామాజిక భవనాల్లో నడుస్తున్నాయి. మిగిలిన కేంద్రాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. గ్రామీ ణ ప్రాంతాల్లో రూ.750, పట్టణ కేంద్రాల్లో రూ.3వేలు చొప్పున ప్రస్తుతం అద్దె చెల్లిస్తున్నారు. అద్దె కేంద్రాలు కూడా విశాలంగా లేకపోవడంతో పిల్లల ఆటపాటలకు ఇబ్బందిగా మారింది. -
సచివాలయం తరలింపుపై గందరగోళం
విజయవాడ: రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయంపై మరో గందరగోళ నిర్ణయం. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం అదనపు భవనాల టెండర్లను రద్దుచేస్తున్నట్లు ఏపీ సర్కారు శనివారం రాత్రి ప్రకటించింది. అదే సమయంలో విజయవాడ, గుంటూరు నగరాల్లో అద్దె భవనాల్లో హెచ్ వోడీల కార్యాలయాలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపింది. జూన్ 27 నాటికి ఉద్యోగులందరినీ ఏపీ రాజధానికి తరలించాలని భీష్మించుకున్న బాబు సర్కార్.. అద్దె భవనాల్లో హెచ్ వోడీ, సిబ్బందికి కార్యాలయాలు ఏర్పాటుచేసి, ఇప్పటికే వెలగపూడిలో నిర్మించిన భవనాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విజయవాడ, గుంటూరుల్లో అద్దె భవనాలను గుర్తించామని, ఉద్యోగుల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విలేకరులకు తెలిపారు. నిజానికి తాత్కాలిక సచివాలయ నిర్మాణం కంటే ముందే అద్దె భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటుచేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. కానీ అంతలోనే మనసుమార్చుకుని ఎల్ ఎండ్ టీ సంస్థకు భారీ టెండర్లు కట్టబెట్టి వెలగపూడిలో తాత్కాలిక భవనాల పనులు ప్రారంభించారు. 45 ఎకరాల స్థలంలో నిర్మితం అవుతోన్న తాత్కాలిక భవనాలకుతోడు మరికొన్ని అదనపు భవనాలకూ టెండర్లు పిలిచారు. అయితే వెలగపూడిలో కనీస సౌకర్యాలు లేనందున అక్కడ పనిచేసేందుకు ఉద్యోగులెవ్వరూ ముందుకురావడంలేదు. దీంతో తాత్కాలిక భవనాల టెండర్లు రద్దుచేయడంతోపాటు, అద్దెభవనాలవైపు మొగ్గుచూపింది సర్కారు. లోటు బడ్జెట్ లోనూ దుబారా ఖర్చులకు ఏమాత్రం వెనుకాడనంటోన్న బాబు ప్రభుత్వం.. తాజా అనాలోచిన నిర్ణయంవల్ల ప్రజలపై మరో రూ.300 కోట్ల భారాన్ని మోపనుంది. ఈ నిర్ణయంపై ఉద్యోగుల స్పందనలు తెలియాల్సిఉంది.