బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయండి
అనంతపురం : వర్సిటీలో కొన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ నాయకులు మంత్రి గంటాకు వినతిపత్రం అందజేశారు. 25 ఏళ్లుగా పనిచేస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నాయకులు ఓబులేసు, శ్రీరాములు, ముత్యాలప్ప, మారెప్ప, రామలక్ష్మమ్మ, లోకమ్మ పాల్గొన్నారు.