చౌక డిపోలపై విజిలెన్స్దాడులు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో రెండు రేషన్ దుకాణాలపై విజిలె న్స్ అధికారులు మంగళవారం దాడులు చేశారు. గ్రామంలోని 21, 22 నంబర్ల రేష న్స్దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేశారు. 21వ నంబర్ దుకాణంలో 1,141 కిలోల బియ్యం, 21 కిలోల పంచదార ఎక్కువగా, 22 నంబర్ దుకాణంలో 11,400 కిలోల బియ్యం, 52 కిలోల పంచదార తక్కువగా ఉన్నాయని విజిలెన్స్ తహసీల్దార్ వి.శైలజ గుర్తించారు. సరుకుల వ్యత్యాసాల కారణంగా షాపులను సీజ్ చేసి 6ఏ కేసు నమోదు చేసినట్టు చెప్పారు. విజిలెన్స్ ఏవో ఎం.శ్రీనివాసకుమార్, ఎస్సైలు రామకృష్ణ, సీతారామ్, జంగారెడ్డిగూడెం సీఎస్డీటీ డీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.