Reset
-
రీసెట్-2016కు సన్నాహాలు
పీహెచ్డీ సీట్ల పెంపునకు అవకాశం ఎస్కేయూ : వర్సిటీ పరిధిలో ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించే రీసెట్–2016 రాత పరీక్ష నిర్వహించేందుకు ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో పరిశోధన సీట్లు , మార్గదర్శకాలు, విధివిధానాలు దరఖాస్తులో పేర్కొన్నారు. పీహెచ్డీ సీట్లు గతంలో కంటే మరిన్ని పెరిగే దిశగా చర్యలు తీసుకొన్నారు. అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులకు గైడ్షిప్ కల్పించనున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి అయినట్లు సమాచారం. జేఎన్టీయూ తరహాలోనే అనుబంధ కళాశాలల అధ్యాపకులకు గైడ్షిప్ ఇచ్చే అంశంపై ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టతకు వచ్చారు. మరోవైపు గత వారం సెల్ఫ్‌ఫైనాన్స్ సీట్లు అధ్యయనం చేయడానికి పర్యటించిన ఉన్నత కమిటీ అడ్‌హక్ లెక్చరర్లు , అనుబంధ కళాశాలల అధ్యాపకులకు రీసెర్చ్ గైడ్షిప్ కల్పించాలని సూచించారు. ఇదిలా ఉండగా 21 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం పూర్తయి ఏడు సంవత్సరాలైనా వీరికి గైడ్షిప్ ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
విద్యాపీఠంలో రీసెట్ ఫలితాలు విడుదల
యూనివర్సిటీ క్యాంపస్: రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో రీసెట్ (విద్యావారధి) ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం వీసీ హరేకృష్ణశతపతి విడుదల చేశారు. గత నెల 9న దేశంలోని 17 కేంద్రాల్లో ఈ ప్రవేశపరీక్ష నిర్వహించారు. 1,690 మంది దరఖాస్తు చేయగా 1,076 మంది పరీక్ష రాశారు. వారిలో 633 మంది అర్హత సాధించారు. ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీకి చెందిన లాల్‌బహుదూర్‌శాస్త్రి సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ ఆర్సీ పాండే, రాష్ట్రీయ సంస్కృత సంస్థ పరీక్షల నియంత్రణాధికారి జీఆర్ మిశ్రా, రిజిస్ట్రార్ ఉమాశంకర్ పాల్గొన్నారు. -
ఎస్వీయూ రీసెట్ నోటిఫికేషన్ విడుదల
తిరుపతి: ఎస్వీయూ రీసెట్-2015(పరిశోధన ప్రవేశ పరీక్ష) నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. వర్సిటీ రీసెర్చ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు, మార్పులు చేసి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మార్చి 2 నుంచి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీసెట్ ధరఖాస్తు ధరను రూ. 1000గా నిర్ణయించారు. తొలిసారిగా వర్సిటీలో ఎంఫిల్‌ను తొలగించి రీసెట్ నోటిఫికేషన్ విడుదలచేశారు. ఎంఫిల్‌ను తొలగించడంతో పీహెచ్డీ సీట్లను భారీగా పెంచారు. గతంలో 1+1 పద్ధతిన పీహెచ్డీ సీట్లు భర్తీ చేశారు. ప్రస్తుత నోటిఫికేషన్లో మాత్రం ఆ సంఖ్యను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్లకు గతంలో ఉన్న ఖాళీ సీట్లను దృష్టిలో ఉంచుకుని ఫుల్ టైం సీట్లను (1+2) రెండుకు పెంచింది. అదేవిధంగా పార్ట్ టైం సీట్లను ఖాళీలతో సంబంధం లేకుండా ప్రొఫెసర్‌కు-2, అసోసియేట్ ప్రొఫెసర్‌కు-1, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు-1 లెక్కన సీట్లను భర్తీ చేస్తారు.