- పీహెచ్‌డీ సీట్ల పెంపునకు అవకాశం
రీసెట్-2016కు సన్నాహాలు
Published Mon, Mar 20 2017 11:55 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
ఎస్కేయూ :
వర్సిటీ పరిధిలో ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించే రీసెట్–2016 రాత పరీక్ష నిర్వహించేందుకు ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో పరిశోధన సీట్లు , మార్గదర్శకాలు, విధివిధానాలు దరఖాస్తులో పేర్కొన్నారు. పీహెచ్‌డీ సీట్లు గతంలో కంటే మరిన్ని పెరిగే దిశగా చర్యలు తీసుకొన్నారు. అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులకు గైడ్‌షిప్ కల్పించనున్నారు.
ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి అయినట్లు సమాచారం. జేఎన్‌టీయూ తరహాలోనే అనుబంధ కళాశాలల అధ్యాపకులకు గైడ్‌షిప్ ఇచ్చే అంశంపై ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టతకు వచ్చారు. మరోవైపు గత వారం సెల్ఫ్‌ఫైనాన్స్ సీట్లు అధ్యయనం చేయడానికి పర్యటించిన ఉన్నత కమిటీ అడ్‌హక్ లెక్చరర్లు , అనుబంధ కళాశాలల అధ్యాపకులకు రీసెర్చ్ గైడ్‌షిప్ కల్పించాలని సూచించారు. ఇదిలా ఉండగా 21 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం పూర్తయి ఏడు సంవత్సరాలైనా వీరికి గైడ్‌షిప్ ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement
Advertisement