respiratory infection
-
వామ్మో చైనా ఇన్ఫెక్షన్
వాషింగ్టన్: చైనాలో నానాటికీ పెరుగుతున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని కొత్త రకం బ్యాక్టీరియల్ నిమోనియా దేశమంతటా శరవేగంగా వ్యాపిస్తుండటం మరింత భయోత్పాతానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో తక్షణం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అమెరికాలో డిమాండ్లు పెరుగుతున్నాయి. చైనాకు రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించాలని ఐదుగురు రిపబ్లికన్ సెనేటర్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. -
అనారోగ్యంతో ఆస్పత్రిలో శిబు సోరెన్
రాంచీ: జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్ శిబు సోరెన్(79) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు జరిపి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ను గుర్తించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సోరెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతోందని ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. 2005–10 మధ్య సోరెన్ జార్ఖండ్ సీఎంగా పనిచేశారు. లోక్‌సభకు 8 పర్యాయాలు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. -
ఆసుప్రతిలో చేరిన మాజీ సీఎం
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోస సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న ఆయనను చికిత్స నిమిత్తం శుక్రవారం రాత్రి బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించినట్లు మాజీ సీఎం సన్నిహితులు తెలిపారు. మైసూర్, ఛిత్రదుర్గ జిల్లాల పర్యటనను ముగించుకున్న కుమారస్వామికి జ్వరంతో పాటు గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఈ క్రమంలో ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొంటున్నారని సమాచారం. ఆయన ఆరోగ్యం గురించి బెంగ పడాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని చెబుతున్నారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో చికిత్స పొందుతున్న కుమారస్వామికి ప్రస్తుతం యాంటీ బయాటిక్స్ ఇస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈరోజు బ్లడ్ టెస్ట్ సహా అన్ని రకాల టెస్టులు చేశామని, ఎక్స్ రే తీశామని.. మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ తో మాజీ సీఎం ఇబ్బంది పడుతున్నారని విక్రమ్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సతీష్ మీడియాకు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లోనే కుమారస్వామిని డిశ్చార్జ్ చేస్తామన్నారు. డాక్టర్ల సలహా మేరకు నాలుగైదు రోజులు తాను రాజకీయ, వ్యక్తిగత కార్యక్రమాలలో పాల్గొనలేనని ఓ ప్రకటనలో కుమారస్వామి వెల్లడించారు. -
నేనొచ్చా....
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది అభిమానులే తన నిజమైన ఆస్తి అని, వారి ప్రేమ, ఆప్యాయతల ముందు వందల కోట్ల రూపాయలు కూడా తనకు గొప్పవిగా కనిపించవని ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు, రాష్ట్ర మంత్రి అంబరీష్ పేర్కొన్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా సింగపూర్‌లో చికిత్స తీసుకొని, అనంతరం మలేషియాలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న అంబరీష్ శుక్రవారం నగరానికి తిరిగివచ్చారు. ఈ సందర్భంగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బెంగళూరు ప్రెస్‌క్లబ్, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్తంగా నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో తన భార్య సుమలతతో కలిసి అంబరీష్ మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదం, ప్రార్థనల కారణంగానే తాను మళ్లీ ఆరోగ్యవంతుడినై ప్రజా జీవితంలో రాగలిగానని పేర్కొన్నారు. తన కోసం ప్రార్థించిన అభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను సింగపూర్‌లో చికిత్స తీసుకుంటుండగా ఎంతో మంది తమ సొంత ఖర్చులతో చూసేందుకు వచ్చారని, వారందరి అభిమానాన్ని తానెప్పటికీ మరిచిపోలేనని అన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకమే తనను మంత్రిని చేసిందని, ప్రస్తుతం తాను గుడిసెలు లేని రాష్ట్రం కోసం కలలు కంటున్నానని అన్నారు. ఏడాది కాలంగా సిద్ధరామయ్య నేతృత్వంలోని తమ ప్రభుత్వం రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే ఈ పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి అపూర్వ విజయాన్ని అందిస్తాయని అన్నారు. దేశాభివృద్ధి గురించి ఒక ప్రణాళిక అంటూ లేని నరేంద్రమోడీ ప్రధాని ఎలా కాగలరని ప్రశ్నించారు. త్వరలోనే పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలిపారు. సుమలత మాట్లాడుతూ...తన భర్త అంబరీష్‌కు ఇది నిజంగానే పునర్జన్మ అని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థనలు జరిపిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.