breaking news
Rest of India in Irani Cup team
-
కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. వైస్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్
అక్టోబర్ 1 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే ఇరానీ కప్ (Irani Cup) 2025 కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా (Rest of India) జట్టును ఇవాళ (సెప్టెంబర్ 25) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా రజత్ పాటిదార్ (Rajat patidar) ఎంపిక కాగా, అతనికి డిప్యూటీగా (Vice Captain) రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) నియమితుడయ్యాడు.ఈ జట్టులో అభిమన్యు ఈశ్వరన్, ఇషాన్ కిషన్, ఖలీల్ అహ్మద్, ఆకాశ్‌దీప్ లాంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. తొలుత ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ను (Shreyas iyer) కెప్టెన్‌గా అనుకున్నారు. అయితే అతను రెడ్ బాల్ క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం కోరడంతో ఎంపిక చేయలేదు. ఆసీస్-ఏతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్యలోనే (తొలి మ్యాచ్ తర్వాత) శ్రేయస్ వైదొలిగాడు.రెస్ట్ ఆఫ్ ఇండియా వర్సెస్ విదర్భఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు రంజీ ఛాంపియన్ విదర్భతో (Vidarbha) తలపడనుంది. గతేడాది ముంబై (అప్పటి రంజీ ఛాంపియన్) చేతిలో ఓటమి పాలైన రెస్ట్ ఆఫ్ ఇండియా, ఈసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.రెస్ట్ ఆఫ్ ఇండియా: రజత్ పాటిదార్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఆర్యన్ జుయల్ (వికెట్‌కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యష్ ధుల్, షేక్ రషీద్, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), తనుష్ కోటియన్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, ఆకాశ్‌దీప్, అన్షుల్ కంబోజ్, సరాన్ష్ జైన్మూడో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న విదర్భ2017-18, 2018-19 సీజన్లలో ఇరానీ కప్ గెలిచిన విదర్భ జట్టు, మూడో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు అక్షయ్ వాద్కర్ కెప్టెన్‌గా, గత రంజీ సీజన్లో 960 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన యశ్ రాథోడ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.విదర్భ: అక్షయ్ వాద్కర్ (కెప్టెన్ & వికెట్‌కీపర్), యశ్ రాథోడ్ (వైస్ కెప్టెన్), అథర్వ తైడే, అమన్ మొఖాడే, డానిష్ మాలేవార్, హర్ష్ దూబే, పార్థ్ రేఖడే, యశ్ ఠాకూర్, నచికేత్ భూతే, దర్శన్ నల్కండే, ఆదిత్య ఠాకరే, అక్షయ్ కర్నేవార్, యష్ కదమ్, శివమ్ దేశ్‌ముఖ్ (వికెట్‌కీపర్), ప్రఫుల్ హింగే, ధ్రువ్ షోరేచదవండి: BCCI: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా ప్రకటన.. అతడిపై వేటు -
కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు!
ఇరానీ కప్-2024కు ముంబై జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. రెస్టాఫ్ ఇండియాపై గెలుపే లక్ష్యంగా ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెడ్‌బాల్ మ్యాచ్‌లో ముంబైకి అజింక్య రహానే సారథ్యం వహించనున్నాడు.ఇక ఈ మ్యాచ్‌కు ఇద్దరు టీమిండియా స్టార్లు కూడా అందుబాటులోకి రావడంతో జట్టు మరింత పటిష్టంగా మారనుందని ముంబై వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా రంజీ ట్రోఫీ గెలిచిన జట్టుకు, రెస్టాఫ్ ఇండియా టీమ్‌కు మధ్య ఇరానీ కప్ పోటీ జరుగుతుంది.రంజీ తాజా ఎడిషన్ విజేత ముంబైఈ ఏడాది రంజీ టోర్నీలో రహానే సారథ్యంలోని ముంబై జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరు 1 నుంచి మొదలయ్యే ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియాతో తలపడనుంది. ఇందుకోసం ఎంసీఏ మంగళవారం తమ జట్టును ప్రకటించనున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది.ఇద్దరు టీమిండియా స్టార్లు అందుబాటులోకిరహానే కెప్టెన్సీలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎంసీఏ అధికారులు నిర్ధారించినట్లు పేర్కొంది. కాగా టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఇటీవల ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. లీసస్టర్షైర్కు ఆడే క్రమంలో అతడు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.అయితే, ఇరానీ కప్ మ్యాచ్ నాటికి రహానే పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. టీమిండియాలో చోటు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్.. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు కూడా ఎంపిక కాలేదు. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్‌లతో మిడిలార్డర్లో పోటీలో అతడు వెనుకబడ్డాడు.శ్రేయస్‌కు మరో అవకాశంఇటీవల దులిప్ ట్రోఫీ-2024లోనూ శ్రేయస్ నిరాశపరిచాడు. దీంతో ఇరానీ కప్ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాలని అతడు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. శస్త్ర చికిత్స అనంతరం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన శార్దూల్ ఠాకూర్ సైతం ఈ మ్యాచ్‌కు అందుబాటులోని రానున్నట్లు సమాచారం. కాగా ముంబై చివరగా 1998లో ఇరానీ కప్ గెలిచింది. అయితే, ఈసారి మేటి ఆటగాళ్లు జట్టులో భాగమవడం సానుకూలాంశం. మరోవైపు.. రెస్టాఫ్ ఇండియా జట్టు గత హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదుంది. గత మ్యాచ్‌లలో సౌరాష్ట్రపై రెండుసార్లు, మధ్యప్రదేశ్ జట్టుపై ఒకసారి గెలిచి ఇరానీ కప్ టైటిల్ సొంతం చేసుకుంది. కాగా శ్రేయస్, శార్దూల్ రంజీ గెలిచిన ముంబై జట్టులోనూ సభ్యులేనన్న విషయం తెలిసిందే.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..! -
ఇరానీ కప్ విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా
గ్వాలియర్: ఆద్యంతం ఆధిపత్యం చాటుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు 30వ సారి ఇరానీ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. రంజీ చాంపియన్ మధ్యప్రదేశ్ జట్టుతో ఆదివారం ముగిసిన ఐదు రోజుల ఫైనల్లో మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలోని రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు 238 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 437 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 58.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 81/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ ఆట చివరిరోజు మరో 117 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో సౌరభ్ కుమార్ మూడు వికెట్లు తీయగా... ముకేశ్ కుమార్, అతీత్, పుల్కిత్ నారంగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. -
రెస్టాఫ్ ఇండియా కెప్టెన్‌గా హర్భజన్
న్యూఢిల్లీ: ఇరానీ కప్‌లో పాల్గొనే రెస్టాఫ్ ఇండియా జట్టుకు స్నిన్నర్ హర్భజన్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు. ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమైన ఓపెనర్ గౌతమ్ గంభీర్ 15 మంది జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈనెల 9 నుంచి బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్‌లో రంజీ చాంపియన్ కర్ణాటకతో రెస్టాఫ్ ఇండియా తలపడనుంది. భజ్జీని కెప్టెన్‌గా చేయడంతో పాటు గంభీర్‌ను ఆడిస్తుండడంతో టెస్టు ఫార్మాట్లో వీరిద్దరిని సెలక్టర్లు ఇంకా పరిగణనలోకి తీసుకుంటున్నారనే సూచనలు కనిపిస్తున్నాయి. రంజీ ట్రోఫీ టాప్ స్కోరర్ కేదార్ జాదవ్, బాబా అపరాజిత్, అంకిత్ బావ్నే కూడా జట్టులో ఉన్నారు. రెస్టాఫ్ ఇండియా జట్టు: హర్భజన్ (కెప్టెన్), జీవన్‌జ్యోత్ సింగ్, గంభీర్, అపరాజిత్, కేదార్ జాదవ్, బావ్నే, దినేశ్ కార్తీక్, మిశ్రా, పంకజ్, దిండా, ఆరోన్, రసూల్, అనురీత్ సింగ్, బెహరా, మన్దీప్ సింగ్.


