‘నిషేధం’ నినాదమే!
భద్రత, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో ఫ్లెక్సీలపై ఆంక్షలు విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించినా, వాటిని నిషేధిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంగా ప్రకటించినా.. ఆ ఆదేశాలు ఎవరికీ పట్టట్లేదు. స్వయంగా ప్రభుత్వ శాఖల అధికారులే వాటిని అమలు చేయట్లేదు. నిజామాబాద్ నగరంలో ఎక్కడ పడితే ఫ్లెక్సీలు కనిపిస్తుండడమే అందుకు నిదర్శనం.
తాము ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని, మళ్లీ కొత్తవి పెడుతున్నారని మున్సిపల్ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఫ్లెక్సీలపై నిషేధం ఉన్నప్పుడు అవి మళ్లీ ఎలా వెలుస్తున్నాయో వారికే తెలియాలి! మొత్తానికి ఫ్లెక్సీల నిషేధం.. నినాదంగా మారడం గమనార్హం. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్