resu gurram
-
అక్కడా రేసుగుర్రమే!
బాక్సాఫీస్ దగ్గరే కాదు, ఫేస్బుక్లో కూడా అల్లు అర్జున్ రేసుగుర్రంలా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఫేస్బుక్లో అల్లు అర్జున్‌ని అనుసరించే వారి సంఖ్య 50 లక్షలకు చేరింది. బన్నీ ఫేస్బుక్ పేజీ తెరిచిన కొంత కాలానికే ఫేస్బుక్ టీమ్‌నే అఫిషియల్ పేజీగా గుర్తుంపు తెచ్చుకుంది. దక్షిణాదిలో 50 లక్షల ఫేస్బుక్ ఫాలోయర్స్ ఉన్న తొలి హీరోగా క్రెడిట్ రావడం పట్ల బన్నీ చాలా సంతోషంతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు ఓకే చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్ర చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శ కత్వంలో సినిమా మొదలవుతుంది. -
బన్నీతో నాకు అంత చనువుంది! - సురేందర్‌రెడ్డి
‘‘బన్నీకి ఈ టైటిల్ యాప్ట్... ఈ కథ యాప్ట్... టోటల్‌గా ఈ సినిమా యాప్ట్’’ అంటున్నారు సురేందర్‌రెడ్డి. మాస్ సినిమాని కూడా క్లాస్‌గా, స్టయిలిష్‌గా తెరకెక్కించే సురేందర్‌రెడ్డి, బన్నీని ‘రేసుగుర్రం'గా తీర్చిదిద్దారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా. కె. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అభిమానుల ఆకాంక్షలను నెరవేర్చి, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సురేందర్‌రెడ్డి చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఆయనతో జరిపిన సంభాషణ ఈ విధంగా... ‘రేసుగుర్రం' అంటున్నారు... హీరో బైక్ రేసరా? హార్స్ రైడరా? ఈ రెండూ కాదు. రేసు గుర్రం అంత వేగంగా హీరో పాత్ర ఉంటుంది. సినిమా కూడా చాలా స్పీడ్‌గా సాగుతుంది. ఇంతకీ హీరో ఏం చేస్తాడు? ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే సాధించేవరకూ నిద్రపోడు. సినిమా మొత్తంలో హీరోకి రెండు, మూడు లక్ష్యాలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి ఏం చేశాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథ బన్నీని దృష్టిలో పెట్టుకునే తయారు చేశారా? అవును. బన్నీకి వంద శాతం నప్పే కథ ఇది. టైటిల్ మాత్రం షూటింగ్ సగంలో ఉన్నప్పుడు అనుకున్నాం. బన్నీ ఎంత ఎనర్జిటిక్కో మరోసారి ఈ సినిమాలో చూస్తారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కోపం వచ్చినప్పుడు తిట్టడం, బాధ అనిపించినప్పుడు అలగడం.. ఇలా నా ఫీలింగ్ ఏదైనాసరే నేను నిర్భయంగా వ్యక్తపరచగల చనువు నాకు బన్నీ దగ్గర ఉంది. అతను అంత కంఫర్టబుల్. ‘రేసు గుర్రం’ కథ ఏంటి? భిన్న మనస్తత్వాలున్న ఇద్దరు అన్నదమ్ముల కథ. టామ్ అండ్ జెర్రీ తరహా అన్నమాట. అన్న శ్యామ్. తమ్ముడు బన్నీ. చదివే పుస్తకాల్లో ఏది ఉంటే దాన్ని అనుసరించడం అన్న స్టయిల్. కానీ, తన మనసుకి ఏది అనిపిస్తే అది చేయడం తమ్ముడి స్టయిల్. ఈ ఇద్దరూ రామ-లక్ష్మణుల్లా ఉండాలని వారి తల్లి కోరిక. కానీ, అలా ఉండరు. ఈ అన్నతమ్ముల్లిద్దరి మధ్య సాగే ట్రాక్ చాలా వినోదంగా ఉంటుంది. తమిళ ‘వేట్టయ్', హిందీ ‘రామ్‌లఖన్'లా ఈ సినిమా ఉంటుందనే టాక్ ఉంది? ఆ సినిమాలకీ ఈ సినిమాకీ అస్సలు పోలిక లేదు. నేనిప్పటివరకు చేసిన సినిమాల్లో వినోదం, యాక్షన్ ఉంటాయి. ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. ఈ వేసవికి కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి చిత్రాన్ని ఇస్తున్నాం. ఈ సినిమా కోసం 12 కేవీ లైట్ ఏదో వాడారట? మామూలుగా కీలక సన్నివేశాలకు, పాటలకు మాత్రమే ఈ లైట్ వాడుతుంటాం. కానీ, కెమేరామేన్ మనోజ్ పరమహంస సినిమా మొత్తం వాడదామన్నారు. ఖర్చుతో కూడుకున్నది కావడంతో ‘మొత్తం 105 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు వద్దంటే వేరే లైట్ వాడదాం’ అని నిర్మాత బుజ్జిగారితో అన్నాం. కానీ, కథకు న్యాయం జరగాలి కాబట్టి, రాజీపడొద్దన్నారు. సినిమాకి ఏది కావాలన్నా సమకూర్చారు కాబట్టే, ఫలితం బ్రహ్మాండంగా ఉంది. సినిమా చూసినవాళ్లకి ఆ లైట్ ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది. ‘కిక్ 2’ చేయనున్నారట.. ఆ విశేషాలు? అది ‘కిక్'కి సీక్వెల్ కాదు. వేరే కథతో రూపొందించనున్నాం. రవితేజ హీరోగా చేస్తారు. హీరో కల్యాణ్‌రామ్ నిర్మిస్తారు. ఇంకా అంతా కొత్తవాళ్లతో ఓ సినిమాకి దర్శకత్వం వహించాలనుకుంటున్నా. దీన్ని ‘ఠాగూర్' మధు నిర్మిస్తారు. హిందీ ‘కిక్'కి అవకాశం వస్తే ఎందుకు చేయలేదు? అప్పుడు ‘ఊసరవెల్లి'తో బిజీగా ఉన్నాను. మరి.. భవిష్యత్తులో హిందీ సినిమాలు చేసే ఆలోచన ఉందా? ఉంది. ‘ఊసరవెల్లి'ని హిందీలో రీమేక్ చేయాలని ఉంది. ఆ సినిమా ఇక్కడ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడానికి కారణం? నేనిప్పటివరకు చేసిన అన్ని కథల్లోకల్లా అత్యుత్తమం ‘ఊసరవెల్లి’. ఆ సినిమా విజయం విషయంలో నా అంచనా నిజం కాలేదు. స్క్రీన్‌ప్లే ఇంకా పకడ్బందీగా ఉండాలేమో అనిపిస్తోంది. హిందీ వెర్షన్ విషయంలో ఇంకా కేర్ తీసుకుంటున్నా. ఎన్టీఆర్‌తో చేసిన రెండు (అశోక్, ఊసరవెల్లి) సినిమాలూ ప్రేక్షకాదరణ పొందకపోవడంపట్ల మీ ఫీలింగ్? అసంతృప్తిగా ఉంది. అతనితో ఓ హిట్ సినిమా చేయాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా చేస్తాను. మహేశ్‌బాబుతో మళ్లీ ఎప్పుడు సినిమా? మహేశ్‌లాంటి హీరోతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనే ఉంటుంది. అన్నీ కుదిరితే తనతో కూడా తప్పకుండా సినిమా చేస్తా. -
రేసుగుర్రం మూవీ పోస్టర్స్
-
రేసుగుర్రం మూవీ స్టిల్స్
-
ఎన్నికలలో... ఎన్ని కలలో!
ువేసవి వచ్చేస్తోంది. ‘వేసవి’ అంటే సినిమా టైటిల్ కాదు. సినిమా వాళ్లకు అతి పెద్ద సీజన్ ఇది. స్టార్ హీరోలతో పాటు చిన్నా పెద్దా అంతా ఈ సీజన్లో తమ సినిమాలు విడుదల చేసి బాక్సాఫీస్‌ని కొల్లగొడదామని ప్రయత్నిస్తుంటారు. ఇది ప్రతి ఏటా జరిగేదే. అయితే... ఈ సమ్మర్ సీజన్ మాత్రం తెలుగు సినిమాకు చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే.. 2014 ఎంటరై ఇప్పటికి 71 రోజులైంది. బాక్సాఫీస్ దాహార్తిని తీర్చే సరైన బ్లాక్‌బస్టర్ రాలేదు. సంక్రాంతి సీజన్ కూడా మునుపటి స్థాయిలో పెద్ద ఊపు తేలేదు. అందుకే అందరూ ఆశలన్నీ సమ్మర్ సీజన్‌పైనే పెట్టుకున్నారు. ఈ సమ్మర్లో వచ్చే సినిమాల ఫలితాలు ఈ ఏడాది మొత్తం మీద ప్రభావం చూపిస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఓ వైపు టెన్త్, ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. మరో వైపు క్రికెట్ హంగామా. ఈ నెల 16 నుంచి టి-20 వరల్డ్ కప్ మొదలవుతోంది. ఈ హడావిడి సద్దుమణిగేలోపే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల రూపంలో ఏప్రిల్‌లో మరో హంగామా. ఇది నెల పై చిలుకే సాగుతుంది. అసలు ఈ రెండూ కాకుండా అసలైన పెద్ద ఉపద్రవం ఏంటంటే... ఎలక్షన్ హడావిడి. ఈ రెండు నెలలూ రాష్ట్రమంతటా ఎన్నికలే ఎన్నికలు. తొలుత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు. వీటి పుణ్యమా అని పల్లెటూళ్లు బిజీ బిజీ. ఆ వెంటనే... ‘మునిసిపల్ ఎలక్షన్స్’. ఇక మునిసిపాలిటీల కోలాహలం అలాఇలా ఉండదు. చివరాఖరుగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్. వీటి గురించి సరేసరి. ఇవన్నీ అయ్యాక... ఇక కౌంటింగ్. సినిమాలను మించిన ఉత్కంఠ. ఇక థియేటర్లకు జనాలు ఎప్పుడొచ్చేట్లు? ఈ ఉపద్రవాలన్నింటినీ తెలుగు సినిమా ఎలా తట్టుకునేట్లు? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. బాలకృష్ణ, మోహన్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య వంటి స్టార్ హీరోలు ఈ సమ్మర్లోనే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సమ్మర్ హడావిడికి ‘లెజెండ్’తో శ్రీకారం చుట్టనున్నారు బాలకృష్ణ. ‘సింహా’ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు అమితంగా ఉన్నాయి. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ‘లెజెండ్’తో పాటే రాబోతున్న మరో స్టార్ హీరో సినిమా ‘రౌడీ’. మోహన్‌బాబు, రామ్‌గోపాల్‌వర్మ తొలిసారి కలిసి పనిచేసిన సినిమా ఇది. ఇటీవల విడుదల చేసిన ‘రౌడీ’ ఫస్ట్ లుక్‌కి విపరీతమైన అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు కూడా ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ కూడా ఈ సమ్మర్లోనే దుమ్మురేపనుంది. ఏప్రిల్ ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) కె.వెంకటేశ్వరరావు సన్నాహాలు చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. విజయవాడ నేపథ్యంలో, నాగచైతన్య హీరోగా దేవ కట్టా తెరకెక్కించిన ‘ఆటోనగర్ సూర్య’ సమ్మర్లో విడుదల కావడం ఖాయం అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’ కూడా తెరపైకొచ్చేది సమ్మర్లోనే. స్వర్గీయ మహానటుడు అక్కినేని నటించిన చివరి సినిమా ఇదే కావడంతో... అన్ని వర్గాలవారూ, అన్నీ వయసులవారూ ఆ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ‘ఇష్క్’ఫేం విక్రమ్‌కుమార్ ఫీల్‌గుడ్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. సమ్మర్లో రాబోతున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రభస’. ‘ఆది’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టు పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. ఇక స్ట్రయిట్ చిత్రాలకు సవాల్ విసురుతూ... సూపర్‌స్టార్ రజనీకాంత్ రూపం ‘విక్రమసింహ’గా ఈ సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ ‘అవతార్’ చిత్రాన్ని తెరకెక్కిన త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రంలో రజనీ వీరుడుగా కనిపించబోతున్నారు. ఆయనకు జోడీ దీపికా పదుకొనే. ఏఆర్ రెహమాన్ సంగీతం. రజనీ తనయ ఐశ్వర్య దర్శకురాలు. ఏప్రిల్‌లో సినిమా ఉంటుందని వినికిడి. ఈ సినిమాలు కాక, నాని ‘జెండాపై కపిరాజు’, శేఖర్‌కమ్ముల ‘అనామిక’, మారుతీ ‘కొత్తజంట’, అల్లరి నరేష్ ‘జంప్ జిలాని’, ప్రకాశ్‌రాజ్ ‘ఉలవచారు బిర్యాని’, సాయి ధరమ్‌తేజ్ తొలి సినిమా ‘రేయ్’, మలి సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’, ఎమ్మెస్ రాజు ‘జపం’తో పాటు మరికొన్ని చిత్రాలు కూడా సమ్మర్ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.