Retailer
-
ఓఎన్డీసీతో ఆర్థిక సేవలు, తయారీకి దన్ను
న్యూఢిల్లీ: చిన్న రిటైలర్లకు కూడా ఈ–కామర్స్ ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో నాలుగు కీలక రంగాల వృద్ధికి ఊతం లభించగలదని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక నివేదికలో వెల్లడించింది. ఆర్థిక సేవలు, వ్యవసాయం, తయారీ, ఈ–కామర్స్ రిటైల్ వీటిలో ఉంటాయని పేర్కొంది. రుణ అవసరాల కోసం ప్రభుత్వ పథకాలు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఎక్కువగా ఆధారపడే చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఆర్థిక సేవల సంస్థలు చేరువయ్యేందుకు ఓఎన్డీసీ ఉపయోగపడగలదని వివరించింది. సాధారణంగా ఎంఎస్ఎంఈల ఆర్థిక గణాంకాల సరిగ్గా అందుబాటులో లేకపోవడం వల్ల వాటి రుణ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి. అయితే, ఓఎన్డీసీ ద్వారా అవి నిర్వహించే లావాదేవీల డేటా అంతా వ్యవస్థలో డిజిటల్‌గా నిక్షిప్తం కావడం వల్ల వాటికి అనువైన ఆర్థిక సాధనాలను రూపొందించడానికి ఫైనాన్షియల్ సంస్థలకు వీలవుతుందని నివేదిక పేర్కొంది. ‘పరిస్థితికి అనుగుణంగా మారగలిగే స్వభావం, భద్రత, లాభదాయకత.. ఏకకాలంలో ఈ మూడింటి మేళవింపుతో ఓఎన్డీసీ ఎంతో విశిష్టంగా రూపొందింది. ఇది సరఫరా, డిమాండ్ మధ్య వ్యత్యాసాలను భర్తీ చేయగలదు. నవకల్పనలకు తోడ్పాటునివ్వగలదు. తద్వారా కొత్త తరం వినూత్నంగా ఆలోచించేందుకు బాటలు వేయగలదు‘ అని డెలాయిట్ దక్షిణాసియా ప్రెసిడెంట్ (కన్సలి్టంగ్) సతీష్ గోపాలయ్య తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు ఓఎన్డీసీ ఒక గొప్ప అవకాశం కాగలదని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని వివరాలు.. ► కోవిడ్ మహమ్మారి అనంతరం భోగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా తయారీ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వాణిజ్య పరిస్థితులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, పరికరాల కొరత, కమోడిటీల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. తయారీ సంస్థలు ఈ సవాళ్లను వ్యాపార అవకాశాలుగా మల్చుకునేందుకు ఓఎన్డీసీ ఉపయోగపడవచ్చు. ఓఎన్డీసీలో లాజిస్టిక్స్ సేవలు అందించే సంస్థలు పుష్కలంగా ఉన్నందున.. లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గించుకునేందుకు, మరింత సమర్ధంగా డిమాండ్‌కి అనుగుణంగా స్పందించేందుకు వీలవుతుంది. ► ఆన్లైన్ అమ్మకాలకు ప్రాధాన్యం పెరుగుతున్నందున, రిటైల్ పరిశ్రమ భాగస్వాములు (బ్రాండ్లు, రిటైలర్లు, పంపిణీదారులు, సరఫరాదారులు) తమ వ్యవస్థలో అంతర్గతంగా మిగతా వర్గాలతో కలిసి పనిచేసేందుకు, అలాగే కస్టమర్లను చేరుకునేందుకు కూడా ఓఎన్డీసీ సహాయకరంగా ఉండనుంది. ► గత కొద్ది నెలలుగా నిత్యావసరాలు, ఫుడ్ డెలివరీ, గృహాలంకరణ, ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్, సౌందర్య.. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఫార్మా తదితర విభాగాల సంస్థలు ఓఎన్డీసీ నెట్‌వర్క్‌ను సమర్ధమంతంగా వినియోగించుకుంటున్నాయి. ► డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తక్కువ వ్యయాలతో పరిష్కరించుకోవడానికి బ్రాండ్స్/రిటైలర్లు/ఎంఎస్ఎంఈలకు ఓఎన్డీసీ ద్వారా అవకాశం లభిస్తుంది. బ్రాండ్లు నేరుగా రిటైలర్లను చేరుకోవడానికి, పంపిణీదారులు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవడానికి కూడా ఇది తోడ్పడగలదు. ఇందుకోసం ఆయా సంస్థలు ఇరవై నాలుగ్గంటలూ ఆర్డర్ చేసేందుకు వెసులుబాటు, మరుసటి రోజే డెలివరీ, ఆటో ఆర్డరింగ్ వంటి సదుపాయాలను కలి్పంచవచ్చు. ► బ్రాండ్స్/రిటైలర్లు తమ సరఫరాదారుల వ్యవస్థను విస్తరించుకునేందుకు, ముడి వనరులు లేదా తయారీ ఉత్పత్తుల సేకరణ వ్యయాలను తగ్గించుకునేందుకు ఓఎన్డీసీ ఉపయోగకరంగా ఉండగలదు. ► ఇటు కొనుగోలుదారులను, అటు విక్రేతలను ఒకే వేదికపైకి తెచ్చే అవకాశం ఉన్నందున దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు ఇది సహాయకరంగా ఉండగలదు. ప్రాచుర్యం పొందడంలో సవాళ్లు ఎదుర్కొంటున్న అగ్రిటెక్ అంకుర వ్యవస్థలకు ఈ నెట్వర్క్ ఒక వరంగా మారగలదు. కంపెనీలు, ప్రభుత్వ సంస్థల నుంచి రైతు ఉత్పత్తి సంస్థలకు (ఎఫ్‌పీవో) ముడి సరుకు, సాంకేతికత, పరికరాలు, సేవలు అందుబాటులోకి రాగలవు. -
ఐపీవోకు లగ్జరీ వాచీల కంపెనీ!
లగ్జరీ, ప్రీమియం వాచీల రిటైల్ కంపెనీ ఇథోస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 18న ప్రారంభంకానున్న ఇష్యూకి రూ. 836–878 ధరల శ్రేణి ప్రకటించింది. 20న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 375 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రస్తుత వాటాదారులు మరో 11 లక్షలకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 472 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2020–21లో కంపెనీ రూ. 386 కోట్లకుపైగా ఆదాయం సాధించగా, దాదాపు రూ. 6 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ దేశీయంగా ప్రీమియం, లగ్జరీ వాచీల భారీ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. 50 రకాల బ్రాండ్లను విక్రయిస్తోంది. జాబితాలో ఒమెగా, ఐడబ్ల్యూసీ స్కఫాసెన్, లాంగిన్స్, టిస్సట్, రేమండ్ వీల్, లూయిస్ మొయినెట్ తదితరాలున్నాయి. ప్రిస్టీన్ లాజిస్టిక్స్ ఐపీవో బాట లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీసుల కంపెనీ ప్రిస్టీన్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. -
గ్లోబల్ సంస్థను చేజిక్కించుకున్న రిలయన్స్
ప్రపంచంలోనే అతిపెద్దదైన, పురాతనమైన బ్రిటిష్ టోయ్ రీటైలర్ హామ్లీస్‌ను వ్యాపార దిగ్గజం, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సొంతం చేసుకున్నారు. చిన్న పిల్లల బొమ్మల మార్కెట్‌పై మంచి పట్టు ఉన్న గ్లోబల్ కంపెనీ హామ్లీస్పై ఎప్పటినుంచో కన్నేసిన రిలయన్స్ రీటైల్ ఎట్టకేలకు ఆ కంపెనీని చేజిక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్, హాంకాంగ్ లిస్టింగు కంపెనీ సి బ్యానర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్నుంచి హామ్లిస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో 100 శాతం షేర్లను కొనుగోలు చేసినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. 260 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ సంస్థ హామ్లీస్‌ను కొనుగోలు చేసినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇందుకోసం 67.96 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.620 కోట్లు) నగదు ఒప్పందం పూర్తి చేసినట్టు ప్రకటించింది. చైనాకు చెందిన సి బ్యానర్ ఇంటర్నేషనల్ నుంచి హమ్లీస్‌ను కొనుగోలు చేసే ఒప్పందంపై సంతకం చేసినట్టు రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ పేర్కొంది. అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన హమ్లీస్ సంస్థను ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకోవాలన్న తమ చిరకాల స్వప్నం నేడు నెరవేరిందని రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ సీఈఓ దర్శన్ మెహత్ పేర్కొన్నారు. 1760లో లండన్‌లో నోవాస్‌గా మొదలైన సంస్థ ఆ తర్వాత కాలక్రమంలో హామ్లీస్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలలో 167 దుకాణాలున్నాయి. అందులోనూ ఇండియాలో హామ్లీస్ 29 నగరాల్లో 88 స్టోర్లను కలిగి ఉంది. యూకె, చైనా, జర్మనీ, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా సహా మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఈ స్టోర్స్ ఉన్నాయి. వాటిల్లో అధిక శాతం ఫ్రాంచైజీ మోడల్. ఇక ఇప్పటికీ సుమారు 50 వేల బొమ్మలను ఆన్ లైన్లో విక్రయానికి పెట్టింది ఈ సంస్థ. లండన్‌లో ఇప్పటికీ హామ్లీస్ స్టోర్ ఓ సూపర్ టూరిస్ట్ అట్రాక్షన్. ఏటా సుమారు 50 లక్షల మంది ఈ స్టోర్‌ను సందర్శిస్తూ ఉంటారు. మరోవైపు బ్రెగ్జిట్, అంతర్జాతీయ తీవ్రవాదం కారణంగా గత సంవత్సరం హమ్లీస్ సుమారు రూ.84 కోట్ల నష్టాన్ని సంస్థ ప్రకటించడం గమనార్హం. -
హుండీలు నిండుతున్నాయి
• ఆలయాలకు పోటెత్తుతున్న పెద్ద నోట్లు • కానుకలుగా సమర్పించుకుంటున్న ‘పెద్ద భక్తులు’ • భక్తుల సంఖ్య తగ్గుతున్నా భారీ ఆదాయం! సాక్షి, హైదరాబాద్: కార్తీక సోమవారం. శివునికి రుద్రాభిషేకం చేయాలి. టికెట్ రూ.300. ఓ భక్తుడు రూ.500 నోటిచ్చాడు. రూ.200 తిరిగివ్వడానికి సిబ్బం దికి చిల్లర దొరకలేదు. చిల్లర బదులు 8 లడ్డూ ప్రసాదాలను భక్తుని చేతిలో పెట్టారు. అన్ని వద్దని, చిల్లరే ఇవ్వాలని కోరినా చేతులెత్తేశారు! మరో భక్తుడు అమ్మవారికి కుంకుమార్చన చేరుుంచాడు. టికెట్ రుసుము పోను మిగతా చిల్లర సిబ్బంది ఇవ్వలేకపోయారు. దాంతో సదరు భక్తుడు ఆ మొత్తాన్ని ఆలయానికే విరాళంగా ఇచ్చేశాడు!! ఇంకో ఆలయంలో మూడు హుండీలూ ఒక్కసారిగా నిండిపోయారుు. రూ.1,000, రూ.500 నోట్లు నిండుగా నిండి, చోటు చాలక బయటికి హుండీల్లోంచి బయటికే కనిపిస్తున్నారుు. దాంతో ఎప్పట్నుంచో మూలపడి ఉన్న పాత హుండీ దుమ్ముదులిపి తెచ్చిపెడితే అదీ నిండిపోరుుంది!! రాష్ట్రంలో భక్తి భావం ఉప్పొంగుతోంది. భగవంతునికి భక్తులు భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు. ఇష్టాలయాలకు బారులుతీరి మరీ హుండీలను నోట్లతో నింపేస్తున్నారు. చిన్న దేవాలయాల్లో కూడా హుండీలు ఇట్టే నిండిపోతున్నారుు! అంతా పెద్ద నోట్ల రద్దు ఫలితం!! రూ.1,000, 500 నోట్లను భారీగా పోగేసుకున్న ‘పెద్ద’భక్తులు వాటిని భారీగా ఆలయాలకు సమర్పిస్తున్నారు. విరాళంగా ఇస్తే పేర్లు వెల్లడించాల్సి వస్తుందని నోట్ల కట్టల రూపంలోనే హుండీల్లో వేసేస్తున్నారు. దాంతో హుండీలు చకచకా నిండిపోతున్నారుు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోన ప్రధాన దేవాలయమైన కాళేశ్వరంలో దాదాపు నాలుగు హుండీలూ పూర్తిగా నిండిపోయారుు. ఇక్కడ సాధారణంగా మూడు నెలలకోసారి హుండీలు తెరుస్తారు. ఉత్సవాలు, పండుగలప్పుడైనా నెలకోసారే తెరుస్తారు. ఇప్పుడు అంతకంటే ముందే హుండీలు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయంలోనూ హుం డీలు బరువెక్కారుు. వాటిని తెరిచి నాలుగు రోజులే కావడం విశేషం! రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నింట్లోనూ ఇదే పరిస్థితి! విచిత్రమేమిటంటే, చిల్లర సమస్యతో ప్రయాణాలు ఇబ్బందికరంగా మారి సాధారణ రోజుల కంటే అన్ని ఆలయాలకూ భక్తుల రద్దీ ఇప్పుడు కాస్త తగ్గింది. ఆ లెక్కన హుండీ ఆదాయం తగ్గాల్సింది పోరుు సీన్ రివర్సవుతోంది! రద్దరుున పెద్ద నోట్లు భారీగా ఉండి, బ్యాంకుల్లో మార్చుకునే వెసులుబాటు లేని ‘భక్తులు’అందులో వీలైనంత మొత్తాన్ని దేవుళ్లకు సమర్పించేస్తున్నారు. సాధారణంగా రోజుకు రూ.లక్షన్నర దాకా ఉండే భద్రాచలం రామాలయం హుండీయేతర ఆదాయం ఐదారు రోజులుగా రూ.ఐదున్నర లక్షలు దాటుతోం ది! అరుుతే, రద్దరుున పెద్ద నోట్లు ప్రస్తుతానికి చెల్లుతాయంటూ కేంద్రం ప్రకటించిన జాబి తాలో ఆలయాలు లేకపోవడంతో వాటికి ఇలా వచ్చిపడుతున్న నోట్ల చెల్లుబాటుపై అయోమయం నెలకొంది. వీటిని డిసెంబరు 31లోపు మార్చుకోవాల్సి ఉండటంతో ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో జమ చేయాల్సిందిగా ఆదేశిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ తాజాగా ఆలయాలన్నింటికీ సర్క్యులర్ ఇచ్చారు. తద్వారా బ్యాంకుల నుంచి అభ్యంతరాలేమైనా వస్తే తదుపరి కార్యాచరణకు సమయం చిక్కుతుందన్నది శాఖ ఆలోచన. చిల్లర చిక్కులు మరోవైపు ఆలయ సిబ్బందిని చిల్లర చిక్కులు వేధిస్తున్నారుు. సేవలు, పూజాదికాల కోసం భక్తులు రూ.1,000, 500 నోట్లే ఇస్తుండటంతో చిల్లర ఇవ్వడం వారి తరం కావడం లేదు. దాంతో చిల్లరకు బదులు ప్రసాదం ఇచ్చి సరిపెడుతున్నారు. మరికొందరికి భవిష్యత్తు సేవల కోసం అడ్వాన్సుగా పేర్లు రాసి రశీదులిస్తున్నారు. ఇంకొందరు భక్తులు ఆ మొత్తాన్ని విరాళంగా సమర్పిస్తున్నారు. ఇంకోవైపు రోజువారి ఆలయ ఖర్చులకు డబ్బులు సమకూర్చుకోవటం కూడా సిబ్బందికి సమస్యగానే మారింది. బ్యాంకు నుంచి రోజువారి నగదు విత్‌డ్రాకు పరిమితి ఉండటం, గంటల తరబడి లైన్లలో నుంచోవాల్సి రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నారుు. హైదరాబాద్ శివారులోని కీసరగుట్ట వంటి ఆలయాల్లో సాధారణంగా ఘనంగా జరిగే కార్తీక పౌర్ణమి వేడుకలు ఈసారి ఇలాంటి కారణాలతో వెలవెలబోయారుు. -
మందు నోట్లు!
రూ. 5 చిల్లర కొరత పేరుతో రాజధానిలో మద్యం వ్యాపారుల సరికొత్త దందా ప్లాస్టిక్ కార్డుపై ‘* 5’ అని ముద్రించి ఇస్తున్న నిర్వాహకులు అన్ని మద్యం షాపుల్లో చెల్లుబాటయ్యేలా ఒప్పందాలు హైదరాబాద్: చిల్లర మోత ఎందుకనో..! మరేమోగానీ..!? కిరాణా దుకాణం నుంచి బేకరీల దాకా ఎక్కడ చూసినా ‘చిల్లర’కు కొరతే. రూపాయో రెండు రూపాయలో ఇవ్వాలంటే ఏ చాక్లెట్లో చేతిలో పెడుతున్నారు. ఇంకా ఎక్కువైతే బిస్కట్ ప్యాకెట్లో.. మరో వస్తువో ఇస్తున్నారు. వీళ్లంతా ఒక ఎత్తయితే.. హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలవారు మరో ఎత్తు. వీళ్లయితే చిల్లర సమస్యను తీర్చుకోవడంతో పాటు మందుబాబులను మళ్లీ రప్పించేలా ఏకంగా ‘* 5’ ప్రైవేటు నోట్లనే తయారు చేసుకున్నారు. రిజర్వు బ్యాంకు గవర్నరే ఆశ్చర్యపోయేలా బార్ కోడ్లు,‘ఐ ప్రామిస్ టు పే’ హామీతో ‘ప్లాస్టిక్ కరెన్సీ’ని ము ద్రించి, వినియోగిస్తున్నారు. మద్యం దుకాణం పేరుతోపాటు నిర్వాహకుల సంతకాన్నీ వాటిపై ముద్రించి... అక్కడ కాకపోతే మరో మద్యం దుకాణంలోనైనా చెల్లుబాటయ్యేలా ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు అన్ని మద్యం దుకాణాల్లో చలామణి అవుతున్న ఈ ఐదు రూపాయల సొంత కరెన్సీ క థా కమామీషు..! విజిటింగ్ కార్డు సైజులో... ఒక వినియోగదారుడు సికింద్రాబాద్‌లోని ఓ పేరుమోసిన మద్యం దుకాణానికి వెళ్లి రూ. 100 నోటు ఇచ్చి రూ. 95 విలువైన మద్యం కొనుగోలు చేశాడనుకోండి. గతంలో అయితే ఏ పల్లీల ప్యాకెట్టో, మరేదైనా తినుబండారమో ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం విజిటింగ్ కార్డు పరిమాణంలో ఉన్న ఒక ‘ప్లాస్టిక్ నోటు’ను చేతిలో పెడుతున్నారు. ఇదేమిటంటే... ‘‘ఐదు రూపాయల చిల్లర లేదు! ఈ సారి వచ్చేటప్పుడు దీన్ని తీసుకొస్తే.. మీ డబ్బు సర్దుబాటు చేస్తాం..’’ అని చెబుతున్నారు. ‘నేను ఉండేది హిమాయత్‌నగర్‌లో మళ్లీ ఇక్కడికెందుకు వస్తాను..?’ అని కొనుగోలుదారుడు ప్రశ్నిస్తే... హైద ర్గూడలో మాకు షాపుంది. అక్కడైనా చెల్లుతుంది. సిటీలోని మా ఐదు బ్రాంచిల్లో ఎక్కడైనా ఇస్తారు..’ అని బదులిస్తున్నారు. ఇలా ఐదు రూపాయల చిల్లర కొరత తీర్చుకునే సాకుతో ఆయా బ్రాంచిలకు ఒక రెగ్యులర్ వినియోగదారుడిని తయారు చేసుకుంటున్నారు. ‘మందు’ నోట్లకు ఒప్పందాలు.. ఎక్కువ దుకాణాలున్న వారే కాదు.. ఆయా ప్రాంతాల్లో విడివిడిగా మద్యం దుకాణాలున్నవారు కూడా ఇదే తరహా ‘*5 ప్లాస్టిక్ కరెన్సీ’ని వినియోగిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలోని మరే మద్యం షాపులో దాన్ని ఇచ్చినా.. చెల్లుబాటయ్యేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఉదాహరణకు అంబర్‌పేట ప్రాంతంలో ఉన్న ఒక మద్యం షాపులో సరుకు కొనుగోలు చేసినప్పుడు నిర్వాహకులు ఇచ్చే ఈ నోట్ అంబర్‌పేట, నల్లకుంట, బర్కత్‌పురా మొదలైన ప్రాంతాల్లోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ఇచ్చి మద్యం కొనుగోలు చేసుకోవచ్చు. తర్వాత ఆయా షాపుల వాళ్లు ఈ నోట్లను ‘మార్పిడి’ చేసుకుంటారన్నమాట. భద్రత, హామీ కూడా..! విజిటింగ్ కార్డు పరిమాణంలో ఉండే ఈ ‘మందు’ నోట్ల మీద ఎడమవైపు ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన రూపాయి చిహ్నంతో ‘*5’ను, పైభాగంలో అసలైన కరెన్సీ నోట్లపై ఉన్నట్టుగా.. ‘ఐ ప్రామిస్ టు పే’ అనే ఆంగ్ల అక్షరాలను ముద్రించారు. వీటిని నకిలీవి ముద్రించకుండా బార్కోడ్లు ఉండడం విశేషం. ఈ బార్కోడ్ పక్క ముద్రించిన నెల, సంవత్సరం ఉంటాయి. అయితే ఇలాంటి నోట్లను తొలుత కాగితంపై ముద్రించినా.. అవి తొందరగా చిరిగిపోతుండడంతో విజిటింగ్ కార్డుకు ఉపయోగించే ‘ప్లాస్టిక్ పేపర్’ను వాడుతున్నారు.