breaking news
Retired out
-
రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ విన్నాం.. ఆబ్సెంట్ హర్ట్ అంటే?
క్రికెట్లో మనకు తెలియని పదాలు చాలానే ఉంటాయి. అయితే ఇందులో మనకు ముఖ్యంగా వినిపించే పదాలు క్యాచ్ అవుట్, రనౌట్, రిటైర్డ్ హర్ట్ అనేవి కామన్‌గా ఉంటాయి. తాజాగా టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్గన్ రెండో ఇన్నింగ్స్‌లో షరాఫుద్దీన్ అష్రఫ్ బ్యాటింగ్‌కు రాలేదు. కాలి గాయంతో బాధపడుతున్న అష్రఫ్ ఆబ్సెంట్ హర్ట్ (ఏబీఎస్ హర్ట్) అయినట్లు అంపైర్ ప్రకటించాడు. దీంతో అఫ్గానిస్తాన్ 9వ వికెట్ కోల్పోగానే ఆలౌట్ అయినట్లు బిగ్స్క్రీన్పై ప్రత్యక్షమయ్యింది. దీంతో ఆబ్సెంట్ హర్ట్ అనే పదం చర్చకు దారి తీసింది.ఆబ్సెంట్ హర్ట్ అంటే?ఒక ఆటగాడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకముందే, అతను అనారోగ్యంతో లేదా గాయంతో బరిలోకి దిగకపోతే దీనిని ఏబీఎస్ హర్ట్‌గా సూచిస్తారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని నిరూపిస్తూ కంకషన్ అని ప్రకటిస్తే తప్ప, అతడి స్థానంలో మరొక బ్యాటర్‌ను ఆడించేందుకు వీలుండదు. ఆ సమయంలో సదరు జట్టు ఒక బ్యాటర్ లేకుండానే ఆటను కొనసాగించాల్సి వస్తుంది. ఆఫ్గన్ బ్యాటర్ అష్రఫ్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో జట్టు మేనేజ్మెంట్ అతడిని బ్యాటింగ్‌కు పంపలేదు. దీంతో తొమ్మిదో వికెట్ కోల్పోయిన అనంతరం ఆఫ్గన్ ఆలౌటైన్లు ప్రకటించారు.రిటైర్డ్ హర్ట్ అంటే?ఇక రిటైర్డ్ హర్ట్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయానికి గురైతే మైదానం వీడడం, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తాను ఆడగలననుకుంటే మళ్లీ క్రీజులోకి రావడాన్ని రిటైర్డ్ హర్ట్ అని పిలుస్తారు. ఈ రూల్ క్రికెట్లో ఎప్పటినుంచో అమల్లో ఉంది.రిటైర్డ్ ఔట్ అంటే?మ్యాచ్‌లో ఒక ఆటగాడు గాయం లేదా అంపైర్ అనుమతి లేకుండా తనంతట తానుగా క్రీజు వీడడాన్ని రిటైర్డ్ ఔట్ అంటారు. ఇలా చేస్తే మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉండదు. జట్టు స్కోరు పెంచాలనుకునే క్రమంలో హిట్టర్‌కు అవకాశం ఇచ్చేందుకు ఈ మధ్యన రిటైర్డ్ ఔట్‌ను ఆయా జట్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.చదవండి: ఆఖర్లో గందరగోళం.. ఆలౌట్ కాని అఫ్గానిస్తాన్! -
ట్విస్ట్ అదుర్స్.. అరుదైన జాబితాలో ఆయుశ్ మాత్రే!
ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు ఆయుశ్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయుశ్ రిటైర్డ్ ఔట్ వెనుక సీఎస్కే మేనేజ్మెంట్ హస్తం ఉంది. మంచి ఈజ్‌తో బ్యాటింగ్ చేస్తున్న ఆయుశ్ మాత్రేను అర్థంతరంగా రిటైర్డ్ ఔట్‌గా వెళ్లిపోవడం వెనుక విమర్శలు వచ్చాయి. కానీ సీఎస్కే నిర్ణయం సరైనదే అని కాసేపటికే తెలిసొచ్చింది. ఆయుశ్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్డ్ హిట్టర్ శివమ్ దూబే తన పాత్రకు న్యాయం చేస్తూ వేగంగా పరుగులు రాబట్టాడు. ఫలితంగా సీఎస్కే భారీ స్కోరు సాధించింది. ఆయుశ్ మాత్రే రిటైర్డ్ ఔట్ వెనుక కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ పాత్ర కీలకం. అందుకే మాత్రే పెవిలియన్ చేరుకున్న సమయంలో అతడికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఈ నేపథ్యంలో ఆయుశ్ మాత్రే ఒక అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్లు చాలా తక్కువగా జరుగుతుంటాయి. గతంలో రవిచంద్రన్ అశ్విన్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, డెవాన్ కాన్వే వంటి క్రికెటర్లు రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగారు. తాజాగా ఈ జాబితాలో ఆయుశ్ మాత్రే కూడా చేరిపోయాడు. కాగా ఐపీఎల్ 2026 సీజన్లో ఆయుశ్ మాత్రేదే తొలి రిటైర్డ్ ఔట్.సాధారణంగా క్రికెట్లో రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ వేర్వేరు. రిటైర్డ్ హర్ట్' అంటే గాయం కారణంగా ఆటగాడు మైదానం విడిచిపెట్టడం. అదే రిటైర్డ్ ఔట్ అనేది జట్టు ప్రయోజనాల కోసం స్వచ్చందంగా మైదానం విడిచిపెట్టడం. రిటైర్డ్ హర్ట్ అయితే సదరు మ్యాచ్‌లో మళ్లీ మైదానంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రిటైర్డ్ ఔట్ అలా కాదు. ఒక్కసారి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగితే మళ్లీ క్రీజులోకి వచ్చేందుకు అవకాశం ఉండదు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. View this post on Instagram A post shared by IPL (@iplt20) చదవండి: అంపైర్‌తో వాదన.. కోపంతో ఊగిపోయిన స్టబ్స్! -
రెండు రోజుల్లో ఇద్దరు.. క్రికెట్లో ఈ 'రిటైర్డ్ ఔట్' అంటే ఏంటి..?
పొట్టి క్రికెట్లో ఇటీవలికాలంలో 'రిటైర్డ్ ఔట్' అనే పదం తరుచూ వినిపిస్తుంది. రిటైర్డ్ ఔట్ అంటే ఆటగాడు ఇన్నింగ్స్ మధ్యలో గాయం కాని, అనారోగ్యానికి కాని గురి కాకుండానే పెవిలియన్‌కు చేరడం. సాధారణంగా ఎవరైనా ఆటగాడు గాయం లేదా అనారోగ్యానికి గురైతే రిటైర్డ్ హర్ట్ లేదా రిటైర్డ్ నాటౌట్‌గా పెవిలియన్‌కు చేరతారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి కెప్టెన్ అనుమతిస్తే, ఆ ఆటగాడు తిరిగి బ్యాటింగ్ కొనసాగించవచ్చు.కానీ, రిటైర్డ్ ఔట్ విషయంలో అలా కాదు. ఒక్కసారి ఆటగాడు ఈ కారణంగా క్రీజ్ వదిలితే తిరిగి బ్యాటింగ్‌కు దిగటానికి వీలుండదు. పొట్టి ఫార్మాట్లో కీలక సమయాల్లో బ్యాటర్లు నిదానంగా ఆడుతున్నప్పుడు రిటైర్డ్ ఔట్ అస్త్రాన్ని ప్రయోగిస్తుంటారు. వూహ్యాల్లో భాగంగా ఇలా జరుగుతుంటుంది.అంతర్జాతీయ క్రికెట్లో రిటైర్డ్ ఔట్లు చాలా తక్కువగా నమోదైనప్పటికీ.. పొట్టి క్రికెట్లో, ముఖ్యంగా ఇటీవలికాలంలో ఈ తరహా ఔట్లు ఎక్కువుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మహిళల ఐపీఎల్ (WPL) 2026 ఎడిషన్‌లో రెండు రోజుల వ్యవధిలో ఇద్దర్లు బ్యాటర్లు రిటైర్డె్ ఔట్‌గా వెనుదిరిగారు.గుజరాత్ జెయింట్స్ తరఫున అరంగేట్రం ప్లేయర్ ఆయుశ్ సోని, యూపీ వారియర్జ్ తరఫున హర్లీన్ డియోల్ గంటల వ్యవధిలో రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరారు. ఈ ఇద్దరు నిదానంగా ఆడుతున్నారన్న కారణంగా వారి జట్టు మేనేజ్మెంట్ ఇలా చేసింది. రిటైర్డ్ ఔట్‌పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ.. పొట్టి క్రికెట్లో ఇది చాలా ఉపయోగపడుతుంది.ఎవరైనా బ్యాటర్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే ఈ అస్త్రాన్ని ప్రయోగించి అతన్ని తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వవచ్చు. మహిళల ఐపీఎల్లో రిటైర్డ్ ఔటైన తొలి ప్లేయర్ ఆయుశ్ సోని అయితే.. ఐపీఎల్లో ఈ తరహాలో ఔటైన తొలి ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల్లోకెక్కాడు.యాష్ 2022 ఎడిషన్‌లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో నిదానంగా ఆడుతున్నందుకు మేనేజ్మెంట్ అతన్ని రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు పిలిపించింది. ఇలాంటి ఉదంతాలే ఐపీఎల్లో మరో మూడు సందర్భాల్లో చోటు చేసుకున్నాయి.2023 ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్, అదే ఎడిషన్‌లో పంజాబ్ ఆటగాడు అథర్వ తైడే, 2025 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగారు. ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన ఆటగాళ్లు కేవలం నలుగురే అయినప్పటికీ.. ప్రపంచవాప్తంగా జరిగే వేర్వేరు లీగ్‌ల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.అంతర్జాతీయ క్రికెట్లోనూ పలువురు ఆటగాళ్లు ఈ తరహాలో ఔటయ్యారు. శ్రీలంకకు చెందిన మర్వన్ ఆటపట్టు, మహేళ జయవర్దనే (2001), భూటాన్‌కు చెందిన సోనం టోబ్గే (2019), నమీబియాకు చెందిన నికోలాస్ డావిన్ (2014) రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరారు. వీరిలో ఆటపట్టు, జయవర్దనే టెస్ట్ ఫార్మాట్లో, అదీ ఒకే మ్యాచ్‌లో (బంగ్లాదేశ్‌పై) రిటైర్డ్ ఔట్ కావడం విశేషం. ఆటపట్టు డబుల్ సెంచరీ పూర్తి చేశాక, జయర్దనే 150 పరుగులు పూర్తి చేశాక రిటైర్డ్ ఔటయ్యారు.అంతర్జాతీయ టీ20ల్లో రిటైర్డ్ ఔటైన తొలి ఆటగాడు టోబ్గే అయితే.. టీ20 ప్రపంచకప్‌లో ఈ తరహా ఔటైన తొలి ఆటగాడిగా నికోలాస్ డావిన్ రికార్డుల్లోకెక్కాడు.


