50 కోట్ల ఏళ్ల క్రితమే హెచ్ఐవీ!
లండన్: హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యునోడిఫిసియెన్సీ వైరస్) సహా రెట్రోవైరస్లన్నీ 50 కోట్ల ఏళ్ల క్రితం నుంచే ఉన్నాయని ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనంలో తేలింది. జంతుజాతుల శరీరాలను ఆవాసాలుగా మార్చుకుని ఇవి మనుగడ సాగించాయని వారు పేర్కొంటున్నారు.
ఈ వైరస్లకు విరుగుడు మందులను కనిపెట్టడంలో తాజా అధ్యయనం కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ‘రెట్రోవైరస్లు సకశేరుకాల్లో బాగా విస్తరించి ఉన్నాయి. ఒక శరీరం నుంచి మరో శరీరానికి వ్యాప్తి చెంది కొత్త వ్యాధులను తీసుకురాగలవు’అని పరిశోధకుల్లో ఒకరైన కట్జౌరకిస్ తెలిపారు. రెట్రోవైరస్లు 10 కోట్ల ఏళ్ల క్రితం నుంచి ఉండేవని ఇప్పటిదాకా భావిస్తుండేవారు.