Revenue - Expenses
-
ఆదాయం పెంచే మార్గాలను చూడండి
సాక్షి, హైదరాబాద్: గనుల తవ్వకాలతో పాటు ఇసుకకు సంబంధించిన వార్షిక కేలండర్ రూపొందించి, వెంటనే టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో గనుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా గనుల శాఖలో ఆదాయాల తీరును ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సమీక్షించారు. గనుల శాఖ ద్వారా గణనీయంగా ఆదాయం పెంచే మార్గాలను అన్వేíÙంచాలని సూచించారు. మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల ప్రాజెక్టుల మరమ్మతుకు భూగర్భం నుంచి త్వరితగతిన ఇసుక తరలించాల్సిన అవసరం ఉందని సాగునీటి అధికారులు కోరినట్టుగా తనకు సమాచారం ఉందని చెప్పారు.ఈ ప్రాజెక్టుల పరిధిలో మరమ్మతులకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో నది తీరాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉన్న రీచ్‌లు, టెండర్లు, ఆదాయానికి సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవాలని, ఈ అంశంలో సాగునీటి శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పలు గ్రానైట్ క్వారీలకు అపరాధ రుసుము విధించి వేసి మూసివేశారని, వాటిని పూర్తిస్థాయిలో సమీక్షించాలని ఆదేశించారు. పట్టా భూముల పేరిట గోదావరి నదీ తీరం వెంట ఇష్టారీతిగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, వీటిపై నిఘా పెట్టాలని సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క అధికారులను కోరారు.ఇసుక రీచ్‌లను ఆయా ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు కేటాయించడం, వ్యాపారం నిర్వహించేందుకు వారికి శిక్షణ, బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడం.. తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం వంటి అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. ఇసుక ర్యాంపు నుంచి వినియోగదారునికి చేరేవరకు మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చడం, ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక ఉండాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా మాఫియా కార్యకలాపాలుగానీ, రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగే పని గానీ జరగకుండా చూడాలని తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ హరిత, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నిబద్ధతతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలిసాక్షి, హైదరాబాద్: నిబద్ధతతో పనిచేసి ప్రజల మన్ననలను పొందాలని శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హితబోధ చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో 2023 బ్యాచ్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు డిప్యూటీ సీఎం భట్టిని కలిశారు. ఐఏఎస్ అధికారి శశాంక్ గోయెల్ ట్రైనీ ఐఏఎస్ లను భట్టికి పరిచయం చేశారు. శిక్షణలో ఉన్న అధికారులకు కేటాయించిన జిల్లాలు, గత ఎన్నికల్లో వారు నిర్వహించిన విధుల గురించి వివరించారు.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ...ప్రజలకు చేసేందుకు ఇచి్చన అవకాశాన్ని సది్వనియోగం చేసుకుంటూ ప్రజల హృదయా ల్లో సుస్థిరస్థానం సంపాదించుకోవాలన్నారు. శిక్షణ సమయంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. శిక్షణలో తెలుసుకున్న అంశాలను ప్రజాసమస్యల్ని పరిష్కరించడంలో అమలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్, కోర్సు డైరెక్టర్ ఉషారాణి, నోడల్ అధికారి శ్రీనివాస్ పెద్ద బోయిన ఉన్నారు. -
లక్ష్యంలో 37.3 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి ఆరు నెలలూ ముగిసే నాటికి (సెప్టెంబర్) లక్ష్యంలో 37.3 శాతానికి చేరింది. మరిన్ని వివరాల్లో వెళితే, 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. అయితే సెప్టెంబర్ ముగిసే నాటికి ద్రవ్యలోటు రూ.6,19,849 కోట్లకు చేరినట్లు సోమవారం వెలువడిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాలు ప్రకారం.. ► సెప్టెంబర్ నాటికి పన్నులుసహా ప్రభుత్వ మొత్తం ఆదాయాలు రూ.12.03 లక్షల కోట్లు. 2022–23 బడ్జెట్ అంచనాల్లో ఇది 52.7 శాతం. ఇందులో ఒక్క పన్ను వసూళ్లు రూ.10.11 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాల్లో ఈ మొత్తం 52.3 శాతం. ► ఇక ఇదే కాలంలో ప్రభుత్వ వ్యయాలు రూ.18.23 లక్షల కోట్లు. ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ అంచనాల్లో 46.2 శాతం. ► వెరసి ద్రవ్యలోటు 6.20 లక్షల కోట్లుగా నమోదయ్యింది. -
నిమ్స్ ఆసుపత్రికి లోకాయుక్త నోటీసులు
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రికి తెలంగాణ లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. వార్షిక ఆదాయ వ్యయాలపై లెక్కలు సరిగా లేవని, ఆడిటింగ్‌కు సహకరించడం లేదని ఆడిట్ శాఖ ఈమేరకు లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. దీంతో నిమ్స్ లెక్కలపై డొల్లతనం బయటపడుతోంది. ♦ నిమ్స్‌లో ఆదాయం-వ్యయాలపై యాజ మాన్యం ఆజమాయిషీ ఉండడం లేదు. దీంతో చెల్లింపులు అడ్డగోలుగా జరుగుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ మేరకు ఒక అధికారికి ఒకే నెలలో రెండుమార్లు వేతనం జమ అయినట్లు తెలుస్తోంది. ♦ లాగే ఓ కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన రూ.5 లక్షలు రెండుమార్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ♦ మ్యాన్‌పవర్ ఏజెన్సీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా సరిగా ఉండడం లేదు. ఇప్పటికి నాలుగుసారు ఈ–టెండర్లు పిలవడం..రద్దు చేయడం ద్వారా వృథా ఖర్చులు పెంచుతున్నారు. ♦ ఇక వార్షిక గణాంకాలను సక్రమంగా నిర్వహించని కారణంగా టీడీఎస్ రూపంలో నిమ్స్ ఖజానాకు గండి పడుతోంది. సరైన లెక్కలు చూపిస్తే.. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో 10 శాతం నిధులు టీడీఎస్ రూపంలో మిగిలే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ♦ ఆస్పత్రికి ఏటా రూ.250 నుంచి 280 కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. ఈ నిధుల ఖర్చుపై నియంత్రణ లేదు. ఆజమాయిషీ..రోజు వారి లెక్కలు చూసే నాథుడే లేడు. ♦ క్రమం తప్పకుండా లెక్కలు చూపితే.. టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం ఉండదని, వాస్తవానికి ఆస్పత్రులకు టీడీఎస్ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని, నిమ్స్‌లో మాత్రం టీడీఎస్ చెల్లిస్తున్నారని ఓ సీనియర్ అధికారి వాపోయారు. ♦ ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్ శాఖ లెక్కల విషయంలో నిమ్స్ అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా పరిగణించింది. ఆడిట్ నిర్వహణకు అధికారులు సహకరించడం లేదని ఆడిట్ అధికారిగా వ్యవహరిస్తున్న పి.కోటేశ్వరరావు యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. దానిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన (ఫిర్యాదు నెం.1771/14/బి1) లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో వచ్చే నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు జమాఖర్చుల నివేదికతో హాజరు కావాల్సిందిగా నిమ్స్ యాజమాన్యానికి లోకాయుక్త నోటీసు(నెం.1771/2014/బి1/లోక్/5571/2021) జారీ చేసింది. ఆడిట్ అధికారుల వైఫల్యమా? ఇదిలా ఉండగా ఆడిట్ అధికారుల వైఫల్యం కారణంగానే నిమ్స్ లెక్కల వ్యవహారం అస్తవ్యస్థంగా తయారైందని ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన ఓ అధికారి ఆరోపించారు. ఆడిట్ చేసేందుకు ముందుకు రాకుండా నిమ్స్ లెక్కలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, ఇది ఎంత వరకు న్యాయమని ఆ అధికారి నిలదీయడం గమనార్హం. -
‘మహా’జాగ్రత్తలు !
సాక్షి, హైదరాబాద్: రేపో, మాపో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో గతంలో తీసుకున్న కీలక నిర్ణయాలను పక్కకుపెడుతూ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎం డీఏ) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల విక్రయాలు, భూ వినియోగ మార్పిడి , భూములు, కాంప్లెక్స్‌ల లీజులు, ఆదాయ-వ్యయాలపై కొత్త ప్రభుత్వం పునఃసమీక్షించే అవకాశం ఉండటంతో ఎక్కడా దొరక్కుండా ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వెలువడ్డాక గత ప్రభుత్వమిచ్చిన జీవోలపై లోతుగా పునఃపరిశీలన జరుపుతామని టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో గతంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల అమలును హెచ్ఎండీఏ తాత్కాలికంగా నిలిపేసింది. వీటికి సంబంధించిన ఫైళ్లను మరోసారి లోతుగా పరిశీలించి ఏవైనా తప్పిదాలుంటే సరిదిద్దుకొనే పనిలోపడ్డారు. గతంలో నందగిరిహిల్స్, చందానగర్, నల్లగండ్ల, జవహర్‌నగర్ తదితర ప్రాంతాల్లో వేలం ద్వారా విక్రయించిన విలువైన భూముల వ్యవహా రాన్ని మళ్లీ తిరగదోడే అవకాశముండడంతో వాటికి సంబంధించిన ఫైళ్లను పక్కాగా సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ‘ల్యాండ్ పూలింగ్ స్కీం’కు ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో దీన్ని పూర్తిగా పక్కకు పెట్టేశారు. ఈ స్కీంను కొనసాగిస్తారా..? లేక సమూలంగా మార్పుచేసి మరో పద్ధతిలో ప్రవేశపెడ్తారా..? అన్నది కొత్త ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది. అక్రమాల పుట్ట : చూసేందుకు పైకి ‘మహా’ గొప్పగా కనిపిస్తున్న హెచ్ఎండీఏ అక్రమాలకు నిలయం. ఇందులో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై కొత్త సర్కారు దృష్టిసారిస్తే.. సగంమంది ఉద్యోగులకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. ఇప్పటికే ప్రారంభించిన ఔటర్‌రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టు, ఉప్పల్ భగత్ లేఅవుట్ డెవలప్మెంట్, కొత్వాలగూడ ఎకో పార్కు తదితర ప్రాజెక్టుల్లో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి.. కీసర మార్గంలో సుమారు 13 కి.మీ.మేర ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణం ఇప్పటివరకు జరగలేదు. సదరు కాంట్రాక్టు సంస్థకు ఉద్వాసన పలుకుతూ హెచ్ఎండీఏ ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో సంస్థపై రూ.100 కోట్లు అదనపు భారం పడింది. సాగర్ ప్రక్షాళనకు ఉద్వాసన పలుకుతారా..? లేక కొనసాగిస్తారా..? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. సాగర్‌ను పూర్తిగా కలుషితం చేస్తున్న కూకట్పల్లి నాలా మళ్లింపునకు పక్కా చర్యలు తీసుకోకుండా ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలకు సుమారు రూ.200 కోట్ల వరకు వెచ్చించారు. హెచ్ఎండీఏకు కామధేను లాంటి ఎల్ఆర్ఎస్, బీపీఎస్‌లను కొత్త ప్రభుత్వం రద్దు చేస్తుందా..? లేక కొనసాగిస్తూ గడువును మరింత పెంచుతుందా..? అన్నది వేచిచూడాలి.