గనుల తవ్వకాలపై వార్షిక కేలండర్ రూపొందించండి
అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: గనుల తవ్వకాలతో పాటు ఇసుకకు సంబంధించిన వార్షిక కేలండర్ రూపొందించి, వెంటనే టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో గనుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా గనుల శాఖలో ఆదాయాల తీరును ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సమీక్షించారు. గనుల శాఖ ద్వారా గణనీయంగా ఆదాయం పెంచే మార్గాలను అన్వేíÙంచాలని సూచించారు. మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల ప్రాజెక్టుల మరమ్మతుకు భూగర్భం నుంచి త్వరితగతిన ఇసుక తరలించాల్సిన అవసరం ఉందని సాగునీటి అధికారులు కోరినట్టుగా తనకు సమాచారం ఉందని చెప్పారు.
ఈ ప్రాజెక్టుల పరిధిలో మరమ్మతులకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో నది తీరాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉన్న రీచ్‌లు, టెండర్లు, ఆదాయానికి సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవాలని, ఈ అంశంలో సాగునీటి శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పలు గ్రానైట్ క్వారీలకు అపరాధ రుసుము విధించి వేసి మూసివేశారని, వాటిని పూర్తిస్థాయిలో సమీక్షించాలని ఆదేశించారు. పట్టా భూముల పేరిట గోదావరి నదీ తీరం వెంట ఇష్టారీతిగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, వీటిపై నిఘా పెట్టాలని సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క అధికారులను కోరారు.
ఇసుక రీచ్‌లను ఆయా ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు కేటాయించడం, వ్యాపారం నిర్వహించేందుకు వారికి శిక్షణ, బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడం.. తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం వంటి అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. ఇసుక ర్యాంపు నుంచి వినియోగదారునికి చేరేవరకు మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చడం, ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక ఉండాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా మాఫియా కార్యకలాపాలుగానీ, రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగే పని గానీ జరగకుండా చూడాలని తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ హరిత, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
నిబద్ధతతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలి
సాక్షి, హైదరాబాద్: నిబద్ధతతో పనిచేసి ప్రజల మన్ననలను పొందాలని శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హితబోధ చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో 2023 బ్యాచ్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు డిప్యూటీ సీఎం భట్టిని కలిశారు. ఐఏఎస్ అధికారి శశాంక్ గోయెల్ ట్రైనీ ఐఏఎస్ లను భట్టికి పరిచయం చేశారు. శిక్షణలో ఉన్న అధికారులకు కేటాయించిన జిల్లాలు, గత ఎన్నికల్లో వారు నిర్వహించిన విధుల గురించి వివరించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ...ప్రజలకు చేసేందుకు ఇచి్చన అవకాశాన్ని సది్వనియోగం చేసుకుంటూ ప్రజల హృదయా ల్లో సుస్థిరస్థానం సంపాదించుకోవాలన్నారు. శిక్షణ సమయంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. శిక్షణలో తెలుసుకున్న అంశాలను ప్రజాసమస్యల్ని పరిష్కరించడంలో అమలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్, కోర్సు డైరెక్టర్ ఉషారాణి, నోడల్ అధికారి శ్రీనివాస్ పెద్ద బోయిన ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment