Rice Bran Oil
-
అందుకే సన్‌రైజర్స్‌తో జట్టు కట్టాం.. ఇక ముందు ప్రత్యేక దృష్టి పెడతాం
సాక్షి, హైదరాబాద్: పామాయిల్ ఉత్పత్తుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నవభారత్ లిమిటెడ్ (ఎన్బీఎల్) కంపెనీ ఇకపై మరింత విస్తరణకు సిద్ధమైంది. ఇప్పటి వరకు దాదాపు పూర్తిగా హోల్‌సేల్ అమ్మకాలకే పరిమితమైన ఎన్బీఎల్ మున్ముందు రిటెయిలింగ్ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఐపీఎల్లో హైదరాబాద్ టీమ్ ‘సన్‌రైజర్స్’తో ఎన్బీఎల్ జత కట్టి తమ ప్రచార కార్యక్రమాలను వేదికగా మార్చుకుంది. తాజా సీజన్లో రైజర్స్‌కు ‘సింప్లిఫై పార్ట్నర్’గా ఎన్బీఎల్ వ్యవహరించింది. బుధవారం ఎన్బీఎల్ బృందంతో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రైజర్స్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌తో పాటు కోచ్‌లు డేల్ స్టెయిన్, ముత్తయ్య మురళీధరన్, హేమంగ్ బదానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్బీఎల్ సంస్థ పురోగతి గురించి సీఈఓ శ్రీనివాస ప్రసాద్ వెల్లడించారు. ‘రూ. 40 కోట్లతో మొదలైన మా టర్నోవర్ ప్రస్తుతం రూ. 1700 కోట్లకు చేరింది. ఎక్కువగా పామాయిల్ ఉత్పత్తులపైనే దృష్టి పెట్టాం. సూపర్మతి ఆయిల్‌కు మంచి గుర్తింపు ఉంది. రిఫైనరీ ద్వారా రోజుకు సుమారు 850 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు తయారు చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఆయిల్ రంగంలో ఇతర సంస్థలకు పోటీగా సన్‌ఫ్లవర్, రైస్‌బ్రాన్ ఆయిల్ల రంగంలో కూడా అడుగుపెడుతున్నాం. రిటైల్‌పై ఇక ముందు ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం ఆసక్తి చూపించే ఐపీఎల్ ఫ్రాంచైజీతో జత కట్టి ప్రచారం చేశాం’ అని వివరించారు. -
మీ గుండెకు ‘మంచి’ చేసే వంట నూనె
రోజు మీరు ఉపయోగించే వంటనూనె మీ ఆరోగ్యానికి మంచిదేనా? మీ గుండెకు ఎలాంటి మేలు చేస్తుందో తెలుసా ? ఆరోగ్యాన్ని కాపాడుతూ గుండెకు మేలు చేయడంలో రైస్‌బ్రాన్ వంట నూనెలు ముందున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. శరీరంలో కొలెస్ట్రాల్ సమతుల్యత సాధించడంలో రైస్‌బ్రాన్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో పాటు అమెరికా హర్ట్ అసోసియేషన్లు ఇప్పటికే సూచించాయి. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేస్తుంది చుడటానికి చక్కని రంగులో కనిపించే రైస్‌బ్రాన్ ఆయిల్ వంటకు ఎంతో బాగుంటుంది. ఇందులో నాచురల్ యాంటీఆక్సిడెంట్ అయిన ఒరిజనోల్ పుష్కలంగా లభిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. దేశీయంగా తయారయ్యే రైస్‌బ్రాన్ ఆయిల్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ వాడకం మాత్రం తక్కువగానే ఉంది. బియ్యపు పొట్టు నుంచి రైస్‌బ్రాన్ ఆయిల్ అంటే బియ్యంలోని పోషక పదార్థాల నుంచి నూనెను సేకరిస్తారనే అపోహ ఉంది. కానీ వాస్తవంలో అది నిజం కాదు. బియ్యం గింజ చుట్టూ ఉండే పొట్టు నుంచి ఆయిల్‌ని సేకరిస్తారు. ఈ బ్రౌన్ కలర్ పొట్టు వల్లనే బ్రౌన్ రైస్‌కు అనేక పోషక గుణాలు కలిగాయి. సాధారణ పాలిష్డ్ రైసుతో పోల్చితే బ్రౌన్ రైస్ ఎంతో మేలనే విషయం మనందరికీ తెలిసిందే. బియ్యపు పొట్టుకి ఉన్న ఔషధ గుణాలన్ని కలిసిన ఫ్రీడమ్ రైస్‌బ్రాన్ ఆయిల్‌ని మార్కెట్లో అందుబాటులో ఉంది. మ్యాజిక్ చేసే ఒరిజనోల్ గోధుమ రంగులో ఉండే బియ్యపు పొట్టు, ఒరిజనోల్ అనే సూక్ష్మమైన ఔషధ గుణాన్ని కలిగి ఉంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి ఒరిజనోల్ అవసరమని ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) సూచించింది. ఫ్రీడమ్ రిఫైన్డ్ రైస్‌బ్రాన్ ఆయిల్లో 10,000 ప్లస్ పీపీఎం ఆఫ్ ఓరిజనోల్ ఉంటుంది. ఇది సహాజమైన యాంటాక్సిడెంట్‌గా పని చేస్తూ శరీరంలోని కొలెస్ట్రాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. విటమిన్ల సమాహారం రైస్‌బ్రాన్ ఆయిల్లో మోనో ఆన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ముఫా), ఒమెగా-6 పాలి అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (పుఫా)లు ఉన్నాయి. వీటి వల్ల శరీరంలో ఫ్యాట్ ప్రొఫైల్, టోకోఫెరోల్స్, టోకోట్రైనోల్స్ వంటి యాంటియాక్సిడెంట్లన్లు బ్యాలెన్స్ చేస్తోంది. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని రక్షించడంలో తోడ్పడుతాయి. అంతేకాదు రైస్‌బ్రాన్ ఆయిల్లో విటమిన్ ఏ, డీలు కూడా ఉన్నాయి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి అవసరమైన అన్ని సుగుణాలతో ఫ్రీడమ్ రైస్‌బ్రాన్ ఆయిల్ మార్కెట్లో అందుబాటులో ఉంది, డీప్ ఫ్రైకి అనుకూలం భారతీయ వంటలకు అనువుగా దాదాపు 232 సెల్సియస్ డిగ్రీల దగ్గర కూడా రైస్‌బ్రాన్ అయిల్ వంటకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత దగ్గర డీప్ ఫ్రై సాధ్యమవుతుంది. దీనివల్ల అప్పుడప్పుడు వేపుళ్లు తింటూ జిహ్యా చాపల్యాన్ని సంతృప్తి పరుస్తూనే ఆరోగ్యాన్ని కాపడుకునేందుకు రైస్‌బ్రాన్ ఆయిల్ అనువుగా ఉంటుంది. అంతేకాదు వండినప్పుడు ఆహార పదార్థాలు రైస్‌బ్రాన్ ఆయిల్‌ను తక్కువగా శోచించుకుంటాయి. రైస్‌బ్రాన్ ఆయిల్‌కి ఉన్న మరో మంచి లక్షణం ఇది. కాస్మోటిక్స్ తయారీలో రైస్‌బ్రాన్ ఆయిల్‌కి ఇన్ని సుగుణాలు ఉండటం వల్లే సౌందర్య ఉత్పత్తుల తయారీలో రైస్‌బ్రాన్ ఆయిల్‌ని విరివిగా ఉపయోగిస్తుంటారు. మనం నిత్య జీవితంలో ఉపయోగించే సన్‌స్క్రీన్ లోషన్, డే క్రీముల్లో రైస్‌బ్రాన్ నుంచి తీసిన పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం రైస్‌బ్రాన్ ఆయిల్‌తో ఎన్నో ఉపయోగాలు ఉండటంతో ఎంతో మంది భారతీయులు ఇతర కుకింగ్ ఆయిల్స్‌కి బదులుగా రైస్‌బ్రాన్ ఆయిల్‌ని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆరోగ్యమే మహా భాగ్యం అని చెప్పినట్టు రైస్‌బ్రాన్ ఆయిల్ ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటే ఆస్పత్రుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుంది, వైద్య ఖర్చులు తప్పుతాయి. అన్నింటికీ మించి రోగాల బారిన పడకుండా ఉంటాం.(అడ్వర్టోరియల్) -
నేచురల్లే నుంచి రైస్ బ్రాన్ ఆయిల్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేచురల్లే బ్రాండ్ పేరుతో వంట నూనెల విక్రయంలో ఉన్న సరైవాలా అగ్రి రిఫైనరీస్ తాజాగా రైస్ బ్రాన్ ఆయిల్ విభాగంలోకి ప్రవేశించింది. అలాగే ఇదే బ్రాండ్‌లో సోనా మసూరీ రైస్‌ను సైతం సినీ నటి సంజనా గల్రానీ చేతుల మీదుగా సోమవారమిక్కడ ప్రవేశపెట్టింది. హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం వద్ద ఉన్న కంపెనీకి చెందిన ప్లాంటులో రైస్ బ్రాన్ ఆయిల్ (తవుడు నూనె) కోసం ప్రత్యేక యూనిట్‌ను రూ.25 కోట్లతో ఏర్పాటు చేసింది. రోజుకు 100 టన్నుల నూనె ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ యూనిట్‌కు ఉంది. ఇక వంట నూనెల పరిశ్రమ 7 శాతం వృద్ధి చెందుతోందని సరైవాలా డెరైక్టర్ అంజని కుమార్ గుప్తా ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. అయితే రైస్ బ్రాన్ విభాగం మాత్రం అత్యధికంగా 25-30 శాతం వృద్ధి నమోదు చేస్తోందని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కంపెనీలు నెలకు 4,000 టన్నుల రైస్ బ్రాన్ ఆయిల్ విక్రయిస్తున్నాయి. కాగా, సరైవాలా అగ్రి రిఫైనరీస్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వద్ద రూ.50 కోట్లతో రిఫైనరీ నెలకొల్పుతోంది. రోజుకు 550 టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంటులో జూన్‌లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. నేచురల్లే బ్రాండ్‌లో సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను సైతం కంపెనీ విక్రయిస్తోంది. -
రెండేళ్లలో దేశవ్యాప్తంగా ‘ఫ్రీడం’ ఆయిల్
సాక్షి ఇంటర్వ్యూ ⇒ జెమిని ఎడిబుల్స్ ఎండీ ప్రదీప్ చౌదరి ⇒ త్వరలో మార్కెట్లోకి రైస్ బ్రాన్ ఆయిల్ ⇒ ప్లాంట్ల ఆధునీకరణకు రూ. 35 కోట్లు ⇒ పశ్చిమ తీరంలో రూ. 250 కోట్లతో రిఫైనరీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రీడం బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా (జెఫ్) దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో తొలి స్థానం కైవసం చేసుకున్న ఈ సంస్థ.. ఇప్పుడుఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు మార్కెట్‌పై దృష్టిసారించింది. ఫ్రీడ ంను రెండేళ్లలో దేశవ్యాప్త బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని అంటున్నారు జెఫ్ వ్యవస్థాపకులు, ఎండీ ప్రదీప్ చౌదరి. జెఫ్‌లో అంతర్జాతీయ అగ్రి దిగ్గజం గోల్డెన్ అగ్రి రిసోర్సెస్ వాటా కైవసం చేసుకోవడం బూస్ట్‌నిచ్చిందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2016-17లో రూ.2,000 కోట్ల టర్నోవర్‌కు చేరతామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ విస్తరణ, మార్కెట్ తీరుతెన్నులపై ఆయనేమన్నారంటే.. మూడు నెలల్లో రైస్బ్రాన్లోకి.. ప్రస్తుతం ఫ్రీడం బ్రాండ్‌లో సన్‌ఫ్లవర్, సోయాబీన్ నూనెను, అలాగే ఫస్ట్ క్లాస్ బ్రాండ్‌లో పామోలిన్, వనస్పతి విక్రయిస్తున్నాం. ఆహార పదార్థాల తయారీ కంపెనీలకు వీటితోపాటు ఇతర నూనెలు, కొవ్వులను సరఫరా చేస్తున్నాం. మే నెలలో రైస్‌బ్రాన్ ఆయిల్‌ను ప్యాకేజ్డ్ విభాగంలోకి తీసుకొస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ నూనె నెలకు 25-30 వేల టన్నులు అమ్ముడవుతోంది. ఇందులో ఫ్రీడంకు 27 శాతం వాటా ఉంది. మూడేళ్లలో 35 శాతం లక్ష్యంగా చేసుకున్నాం. ఒడిశాలో 31 శాతం వాటా చేజిక్కించుకున్నాం. నెలకు 30 వేల టన్నులు అమ్ముడవుతున్న కర్ణాటకలో 2017కల్లా 20 శాతం వాటా దక్కించుకుంటాం. అంతర్జాతీయ సంస్థ.. జెఫ్‌లో రుచి సోయా ఇండస్ట్రీస్‌కు ఉన్న 50 శాతం, ప్రమోటర్ల నుంచి 25 శాతం వాటాను ఇండోనేసియాకు చెందిన గోల్డెన్ అగ్రి సుమారు రూ.140 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. పామాయిల్ తోటలు, రిఫైనరీలతో అంతర్జాతీయంగా పేరున్న గోల్డెన్ అగ్రి టర్నోవర్ రూ.60,000 కోట్లకుపైనే. వారి చేరికతో మార్కెట్ పరంగా, ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా జెఫ్‌కు బలం చేకూరింది. పెద్ద ఎత్తున వృద్ధి చెందాలన్న లక్ష్యంతో భారత్‌లో ఎంతైనా పెట్టుబడి పెట్టేందుకు గోల్డెన్ అగ్రి సుముఖంగా ఉంది. మరో రిఫైనరీ.. కంపెనీకి కృష్ణపట్నం, కాకినాడ వద్ద రిఫైనరీలు ఉన్నాయి. కృష్ణపట్నం ప్లాంటు సామర్థ్యం రోజుకు 900 టన్నులు, కాకినాడ ప్లాంటు 250 టన్నులుంది. రెండు రిఫైనరీలకు ఇప్పటికే రూ.155 కోట్లు ఖర్చు చేశాం. వీటిని ఆధునీకరించేందుకు రూ.35 కోట్లు వెచ్చిస్తున్నాం. పశ్చిమ తీరంలో రూ.250 కోట్లతో రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు మహారాష్ట్ర లేదా గుజరాత్‌ను పరిశీలిస్తున్నాం. ఆరు నెలల్లో స్పష్టత వస్తుంది. 2013-14లో జెఫ్ రూ.1,455 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్లు ఆశిస్తున్నాం. ఐదేళ్లలో 100 శాతం.. భారత్‌లో వంట నూనెల వినియోగం ఏటా 1.6 కోట్ల టన్నులుంది. ప్యాకేజ్డ్ విభాగం 20 శాతం వృద్ధితో 55-60 శాతానికి చేరింది. బ్రాండెడ్ నూనెలపట్ల కస్టమర్లలో అవగాహన పెరుగుతుండడంతో ఐదేళ్లలో ఈ విభాగం 100 శాతానికి చేరడం ఖాయం. ఇక నూనెల వినియోగం చూస్తే ప్రపంచ సగటు 21-22 కిలోలుంది. భారత్‌లో ఇది 15 కిలోలు మాత్రమే. 10 ఏళ్ల తర్వాత ప్రపంచ సగటును మించిపోవడం ఖాయం. ఆదాయాల పెరుగుదల, మారుతున్న ఆహారపుటలవాట్లు ఇందుకు కారణం.