Richest party
-
దేశంలోనే ధనిక పార్టీ బీజేపీ
-
అత్యంత సంపన్న పార్టీ ఏదంటే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని 32 ప్రాంతీయ పార్టీల్లో రూ 82.72 కోట్ల ఆదాయంతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అత్యంత సంపన్న పార్టీగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఎస్పీ తర్వాత రూ 72.92 కోట్లతో టీడీపీ రెండో అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఇక ఏఐఏడీఎంకే రూ 48.88 కోట్లతో తర్వాతి స్ధానంలో ఉంది. మొత్తం 32 ప్రాంతీయ పార్టీల ఆదాయం 2016-17లో రూ 321.03 కోట్లుగా నమోదైంది. వీటిలో 14 పార్టీలు తమ ఆదాయం తగ్గిపోయిందని ప్రకటించగా 13 పార్టీలు రాబడి పెరిగిందని పేర్కొన్నాయి. ఐదు ప్రాంతీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు తమ ఆదాయ పన్ను రిటన్స్‌ను సమర్పించలేదు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, మహరాష్ట్రవాది గోమంతక్ పార్టీ, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్, కేరళ కాంగ్రెస్-మణి పార్టీలు ఆదాయ పన్ను రిటన్స్‌ను దాఖలు చేయలేదు. ఇక తమ ఆదాయంలో 87 శాతం పైగా ఇంకా ఖర్చు చేయలేదని ఎంఐఎం, జేడీఎస్‌లు పేర్కొనగా, తమ ఆదాయంలో 67 శాతం ఇంకా ఖర్చు చేయలేదని టీడీపీ స్పష్టం చేసింది. మరోవైపు తమ ఆదాయం కన్నా అధికంగా రూ 81,88 కోట్లు ఖర్చు చేసినట్టు డీఎంకే వెల్లడించింది. ఎస్పీ, ఏఐఏడీఎంకేలు వరుసగా రూ 64 కోట్లు, రూ 37 కోట్లు వెచ్చించాయి. -
అత్యంత ధనిక పార్టీ బీజేపీ
న్యూఢిల్లీ: 2016–17 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ ఏడాది బీజేపీకి మొత్తం రూ. 1,034.27 కోట్ల ఆదాయం లభించింది. 2016–17లో ఏడు జాతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.1,559.17 కోట్లు కాగా అందులో బీజేపీ వాటా 66.34%. అంతకుముందటి సంవత్సరంతో పోలిస్తే బీజేపీ ఆదాయం 2016–17లో ఏకంగా 81.18 శాతం పెరిగింది. 2015–16లో ఆ పార్టీకి వచ్చిన ఆదాయం రూ.570.86 కోట్లే. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీలు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్నుల వివరాలను విశ్లేషించిన అసోసియే షన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. పార్టీల ఆదాయాల్లో దాదాపు 75 శాతం నిధులు స్వచ్ఛంద విరాళాల ద్వారా వచ్చినవే. ఇక అతి తక్కువ ఆదాయం పొందిన పార్టీగా సీపీఐ నిలిచింది. సీపీఐకి 2016–17లో వచ్చిన ఆదాయం రూ. 2.08 కోట్లు. రూ. 225.36 కోట్ల ఆదాయం పొందిన కాంగ్రెస్ రెండో ధనిక పార్టీగా నిలిచింది. 2016–17లో ఏడు పార్టీలు కలిపి చేసిన మొత్తం వ్యయం రూ.1,228.26 కోట్లు కాగా, ఇందులో బీజేపీ వాటా రూ.710.05 కోట్లు. -
టీడీపీ సంపద గల పార్టీ.. వైఎస్ఆర్ సీపీ పేదల పార్టీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ సంపద గల పార్టీ అని, తమ పార్టీ పేదల పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇంకా బలపడాల్సివుందని అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమ శిక్షణతో మెలగాలని ధర్మాన సూచించారు.