Ricky
-
తనకు తానే కాల్పులు జరుపుకున్న రిక్కీరై!
కర్ణాటక: పారిశ్రామికవేత్త రిక్కీరైపై జరిగిన కాల్పుల ఘటన మలుపు తిరిగింది. ఆయన తనంటత తానే కాల్పులు జరుపుకున్నారని కాల్పుల వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ గన్‌మెన్ మన్నప్ప విఠల్ వాంగ్మూలం ఇచ్చారు. కాల్పులకు పాల్పడ్డారనే అనుమానంతో మన్నప్పవిఠల్ను బిడది పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని రామనగర కోర్టులో హాజరుపరిచి 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు.తమదైనశైలిలో విచారణ చేపట్టగా రిక్కీరై తనంతటతానే కాల్పులు జరుపుకున్నట్లు మన్నప్ప విఠల్ వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో రిక్కీరై షూటౌట్ కాల్పుల ఘటనపై నాటకం ఆడినట్లు అనుమానం మరితం బలపడినట్లైంది. మాజీ డాన్ దివంగత ముత్తప్పరై చిన్నకుమారుడు పారిశ్రామికవేత్త రిక్కీ రైపై ఈనెల 18వ తేదీ రాత్రి 11.30 సమయంలో కారులో బెంగళూరుకు వెళ్తుండగా బిడది వద్ద ఆయనపై ఫైరింగ్ జరిగింది. రిక్కీరై ముక్కు, చేతులకు గాయాలయ్యాయి. అనంతరం అతడిని బెంగళూరు హెచ్ఏఎల్ రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులకు షూటౌట్ జరిగిన స్థలంలో లభించిన బుల్లెట్, విఠల్ వద్ద ఉన్న గన్లోనిదని తేలింది. పోలీసులు ఇతడి గన్ను స్వాదీనం చేసుకుని ఎప్ఎస్ఎల్ ల్యాబోరేటరీకి పంపించారు. ముత్తప్పరై వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న విఠల్.. రిక్కీ రై వద్దనే పనిచేసేవాడు. ఆరోగ్యం సరిగాలేనందున ఆ ఉద్యోగం వదిలిపెట్టి ఇంటివద్ద సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. ముత్తప్పరై చనిపోకముందు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ రిక్కీ రై సైట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ కారణంతో మన్నప్పవిఠల్ కోపంతో ఉండవచ్చని అనుమానం వ్యక్తమైంది. రిక్కీరై గన్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదులో ముగ్గురు పేర్లు ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసులో ఉన్న పాత్ర ధ్రువీకరించడానికి ఎలాంటి సాక్ష్యాలు కనబడకపోవడంతో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ముత్తప్పరై మాజీ సహచరుడు, మొదటి ఆరోపి రాకేశ్మల్లి, మూడో ఆరోపి నితీశ్శెట్టిని విచారణ చేపట్టి పోలీసులు వదిలిపెట్టారు. రెండో ఆరోపి ముత్తప్పరై రెండో భార్య అనురాధ విదేశాల్లో ఉన్నారు. -
హత్యాయత్నం నిజమా.. నాటకమా?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై పై కాల్పులు జరిగిన కేసులో బిడది పోలీసులు అతని గన్‌మ్యాన్ మన్నప్ప విఠల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిక్కీ రై తానే కాల్చుకుని హత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తాజాగా అనుమానిస్తున్నారు. రిక్కీ రైకి ఉన్న ముగ్గురు గన్ మ్యాన్లు ఒక్కొక్కరు ఒక్కో వాంగ్మూలం ఇస్తుండడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. తన పిన్ని అనురాధ, రాకేశ్ మల్లి, మరో ఇద్దరిపై ఆరోపణలు చేసి రిక్కీ కేసును పక్కదారి పట్టిస్తున్నారా అని సందేహిస్తున్నారు. కాల్పులు జరగడానికి ముందు కుక్కలు అరవడంతో గాల్లోకి కాల్పులు జరిపామని గన్ మ్యాన్లు చెప్పిన మాటల్లో నిజం లేదని గుర్తించారు. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ మల్లి తన లాయర్లతో కలిసి రామనగర ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఎస్పీ శ్రీనివాసగౌడ అతనిని విచారించారు. పిన్ని అనురాధకు ఊరట ఈ కేసులో ఏ2గా ఉన్న రిక్కి రై పిన్ని అనురాధకు హైకోర్టులో ఊరట దక్కింది. కేసులో నుంచి తన పేరు తొలగించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఆమెపై తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. అనురాధకు 14వ తేదీన యూరోప్‌కు వెళ్లిపోయిందని, 6 నెలల క్రితమే ఆస్తి గొడవలపై రాజీ చేసుకున్నారని ఆమె లాయర్ వాదించారు. నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..? -
రిక్కీ అంత సులభంగా గన్ షాట్‌కి ఎలా దొరికాడు?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రాష్ట్రంలో, అందులోనూ బెంగళూరు పరిసరాల్లో గత 48 గంటల్లో అనూహ్యమైన నేర సంఘటనలు దేశమంతటా చర్చనీయాంశమయ్యాయి. జాతీయ టీవీ చానెళ్లలో చాలా సమయాన్ని ఆక్రమించాయి. దీంతో బెంగళూరు హాట్ హాట్ చర్చల్లో భాగమైంది. సినిమా స్టైల్లో మాఫియా డాన్ కొడుకుపై తుపాకులతో హత్యాయత్నం, ఆ గొడవ సద్దుమణగకముందే ఏకంగా రిటైర్డు డీజీపీ ఇంట్లోనే హత్యకు గురికావడం, అందులోనూ ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అరెస్టు చేయడం హాలీవుడ్ క్రైం స్టోరీలను మించిపోయింది. రిక్కీ కేసులో ఎవరు సూత్రధారి? మాజీ మాఫియా డాన్, దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై మీద గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి కాల్పులు జరపడం సంచలనం కలిగిస్తోంది. రిక్కీని మట్టుబెట్టాలని ఫైరింగ్ చేయగా, తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు తెలిసింది. సిలికాన్ సిటీతో పాటు చుట్టుపక్కల జరుగుతున్న రియల్ ఎస్టేట్ గొడవలు, మాఫియా పోరాటాలు ఈ సంఘటనతో ఒక్కసారిగా తెర మీదకు వచ్చాయి. మొదట రియల్ ఎస్టేట్ నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందని అందరూ భావించినప్పటికీ సమయం గడిచేకొద్దీ ముత్తప్ప రై రెండవ భార్య అనురాధపై అనుమానాలు పెరుగుతున్నట్లు పోలీసు వర్గాల కథనం. ముత్తప్పరై ఇద్దరు కుమారులు, రెండవ భార్య అనురాధ పేరున తన ఆస్తులు వీలునామా రాశారు. అనురాధకు ఓ మోస్తరుగా బంగారు ఆభరణాలు, ఒక కారు, పెద్ద మొత్తంలో నగదు, హెచ్డీ కోటలో ఉన్న ఆస్తి, బెంగళూరు సహకార నగరలో ఉన్న ఒక భవంతి రాసిచ్చారు. అయితే ఆస్తిలో తనకు ఇంకా భాగం రావాలని ఆమె కోర్టుకు వెళ్లింది. రిక్కీ, అతని అన్న రాకీతో ఆమెకు గొడవలు కూడా జరిగాయి. అయితే తరువాత రిక్కీ సోదరులు రాజీ చేసుకున్నారు. వారు పరస్పరం హత్యలకు కుట్రలు చేసినట్లు కూడా వార్తలున్నాయి. ఇప్పుడీ హత్యాయత్నంతో అది బహిర్గతమైంది. రిక్కిరై సెక్యూరిటీ ఏమైంది రిక్కీ రై మీద హత్యాయత్నం తరువాత అందరిలో అనేక ప్రశ్నలు కలుగుతున్నాయి. వేల కోట్ల రూపాయల వారసుడు, విస్తృతంగా శత్రువులను కలిగిన రిక్కీ రై అంత సులభంగా గన్ షాట్‌కి ఎలా దొరికాడు? పటిష్టమైన ప్రైవేటు భద్రత ఏమైంది? అనే సందేహాలున్నాయి. రిక్కీ రై సొంతంగా వీవీఐపీకి ఉన్నంత సెక్యూరిటీని పెట్టుకున్నాడు. గన్లు పట్టుకుని చుట్టూ బాడీగార్డులు ఉంటారు. బాడీ గార్డులు షార్ప్ షూటర్స్ అయి ఉంటారు. రిక్కిరై పై కాల్పులు జరిపిన సమయంలో కారులో ఒకరే సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. మిగతా ఇద్దరు ఎందుకు లేరనేది సందేహాస్పదమైంది. కాల్పుల వెనుక బయటి శత్రుల కన్నా లోపలి శత్రువులే ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిక్కీకి డిప్యూటీ సీఎం పరామర్శ రిక్కీ రై బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదివారంనాడు ఆస్పత్రికి వెళ్లి అతనిని పరామర్శించారు. నిందితులు ఎంతటివారైనా పోలీసులు అరెస్టు చేస్తారని రిక్కీకి భరోసా ఇచ్చారు.రిటైర్డు డీజీపీ విషాదాంతం యశ్వంతపుర: రాష్ట్ర రిటైర్డు డీజీపీ ఓం ప్రకాశ్ బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని సొంత భవనంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం ఈ ఘోరం వెలుగుచూసింది. తానే హత్య చేసినట్లు భార్య పల్లవి పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం ఆమె పోలీసులకు కాల్ చేసినట్లు తెలిసింది. ఘటనా స్థలంలో ఉన్న పల్లవితో పాటు ఆమె కూతురిని పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణంగా భావిస్తున్నారు. వీరి కుటుంబంలో స్పర్థల గురించి చుట్టుపక్కలవారితో పాటు కొందరు విశ్రాంత పోలీసు అధికారులకు కూడా తెలుసని సమాచారం. తనకు ప్రాణభయం ఉందని ఓంప్రకాశ్ స్నేహితులకు చెప్పుకుని బాధపడినట్లు తెలుస్తోంది. ఓం ప్రకాశ్ హత్యతో ఆయన సహచర రిటైర్డు ఐపీఎస్‌లు విచారానికి లోనయ్యారు. -
మన్ మే దర్ద్ రికీతో ఖాళీ
జంతర్ మంతర్ జూమంతర్ ఖాళీ.. అందర్ దర్ద్ దెబ్బకు ఖాళీ.. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అసహనంలో, నిరాశలో కూరుకుపోయిన మనిషికి.. ఒక ఆత్మీయ ఆలింగనం ఆ బాధలన్నింటినీ మరచిపోయేలా చేస్తుంది. స్పర్శకు అంతటి మహత్తర గుణం ఉంది. తలపోటుతో బాధపడుతున్న భార్యామణి నుదుటిపై మునివేళ్లతో ముచ్చటగా జండూ బామ్ రాసి చూడండి.. వెంటనే ఇట్స్ గాన్ అనేస్తుంది. దంపతుల మధ్య స్పర్థలను తొలిగించే శక్తి కూడా స్పర్శకే ఉంది. అలాంటి స్పర్శను బేస్ చేసుకున్న వైద్య విధానం రికీ. జపాన్‌కు చెందిన ఈ ట్రీట్మెంట్పై అమెరికాకు చెందిన మానసిక వైద్య నిపుణురాలు పౌలా హోరన్ ఉరఫ్ లక్ష్మి ‘కర్మ కంప్లీషన్’ పేరుతో నగరంలో వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ సందర్భంగా సిటీప్లస్ ఆమెను పలకరించింది. ..:: ఎస్.శ్రావణ్‌జయ కాలుష్యం, కల్తీ ఆహారం, మానసిక సమస్యలతో రోజురోజుకూ కొత్త వ్యాధులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిని నయం చేయడానికి వైద్యుల పరిశోధనలూ కొనసాగుతున్నాయి. అన్ని రకాల శారీరక, మానసిక అనారోగ్య సమస్యలకు రికీతో చెక్ పెట్టేయొచ్చు అంటున్నారు పౌలీ హారన్. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ డాక్టరమ్మ.. ఇప్పుడు ఆధ్యాత్మికవేత్త కూడా. పేరు కూడా లక్ష్మిగా మార్చుకున్నారు. గత శుక్రవారం నుంచి ఆదివారం వరకూ బంజారాహిల్స్‌లో రికీ మాడ్యూల్స్‌పై ‘కర్మ కంప్లీషన్’ పేరిట వర్క్‌షాప్ నిర్వహించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఎందరికో ట్రీట్మెంట్ ఇచ్చారు. శాశ్వత పరిష్కారం కోసం.. హోరన్.. లక్ష్మిగా మారి ఆధ్యాత్మిక బాట పట్టడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తే..? ‘ఒక సైకాలజిస్ట్‌గా మానసిక రుగ్మత లతో బాధపడే చాలామందికి చికిత్స చేశాను. కానీ సమస్యల వలయం నుంచి శాశ్వతంగా బయటకు రావడానికి ఆ రోగులు తపిస్తున్నారని నాకు అనిపించేది. అదే సమయంలో నేను ఇండియాకు వచ్చాను. రమణ మహర్షి ప్రధాన శిష్యులలో ఒకరైన ెహ చ్డ బ్ల్యూఎల్ పుంజా గారి దగ్గర శిష్యరికం చేశాను. అప్పుడే నా పేరు లక్ష్మిగా మార్చుకున్నాను. ఆయన దగ్గరే కొత్త వైద్య విధానాలు తెలుసుకున్నాను. 20 ఏళ్లుగా రికీ వైద్య విధానంతో ఎందరికో సాంత్వన కలిగించగలిగాను. స్పర్శతో స్పాట్.. జపాన్‌కు చెందిన రికీ వైద్య విధానంలో కేవలం చేతి స్పర్శల ద్వారా మానసిక ప్రశాంతత కలిగించవచ్చని చెబుతారామె. ‘ఈ చికిత్సలో మొత్తం 8 మాడ్యూల్స్ ఉంటాయి. ప్రతి మాడ్యూల్లో కూడా చేతి స్పర్శలే కీలకం. రోగి మానసిక స్థితిని బట్టి చికిత్సా విధానం మారుతుంది. నాకు గతంలో క్యాన్సర్ వచ్చింది. రికీతోనే నేను అందులో నుంచి బయటపడ్డాను. ప్రస్తుతం మూడు రోజులు జరిగిన వర్క్‌షాప్‌లో 8 మ్యాడ్యుల్స్ ఉన్న ఈ ట్రీట్మెంట్లో మొదటి మాడ్యూల్‌కి సంబంధించిన శిక్షణ తరగతులు నిర్వహించాను. రికీ ట్రీట్మెంట్తో మానసిక సమస్యల నుంచి తొందరగా బయటపడొచ్చు. భార్యాభర్తల మధ్య ఇగో సమస్యలు, వ్యాపారంలో ఒత్తిళ్లు, నిద్రలేమి వంటి సమస్యలతో సతమతమయ్యే వారికి ఈ టచ్ ట్రీట్మెంట్ చక్కని పరిష్కారం’ అని ముగించారు లక్ష్మి.