‘మెక్సికన్’ విజేత హామిల్టన్
మెక్సికన్ సిటీ: ఫార్ములావన్ మెక్సికన్ గ్రాండ్ ప్రిలో లూరుుస్ హామిల్టన్ (మెర్సిడెస్)విజయం సాధించాడు. 71 ల్యాప్‌ల రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ 1 గంట 40 నిమిషాల 31.042 సెకన్లలో పూర్తి చేశాడు. మెర్సిడెస్‌కే చెందిన రోస్‌బర్గ్ రెండు, రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డో మూడో స్థానంలో రేసును పూర్తి చేశారు. హామిల్టన్‌కు ఇది ఈ సీజన్లో ఎనిమిదో విజయం కాగా... కెరీర్లో 51వ గెలుపు. రెడ్‌బుల్‌కే చెందిన వెర్స్టాపెన్, ఫెరారీ రేసర్ వెటెల్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ రేసులో అనేక వివాదాలు చోటు చేసుకున్నారుు. వెర్స్టాపెన్, వెటెల్ రేసు మధ్యలో ఢీకొట్టుకున్నారు. రేసు ముగిశాక వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచి పొడియం మీదకు వెళ్లాడు. అరుుతే తనకు ఐదు సెకండ్ల పెనాల్టీ విధించి వెటెల్ మూడోస్థానంలో నిలిచినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మూడు గంటలకు రేసు మొత్తాన్ని మరోసారి పరీక్షించాక మరో కొత్త సంఘటన బయటపడింది. రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డోను వెటెల్ ప్రమాదకరంగా అడ్డుకున్నట్లు భావించి తనపై పది సెకండ్లు పెనాల్టీ విధించారు. దీంతో తను మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోగా... రికియార్డో మూడు, వెర్స్టాపెన్ నాలుగో స్థానంలో నిలిచారు. ఫోర్స్ ఇండియా రేసర్లు హల్కెన్‌బర్గ్ ఏడో స్థానంలో, పెరెజ్ పదో స్థానంలో రేసును పూర్తి చేశారు.
డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం రోస్‌బర్గ్ 349 పారుుంట్లతో, హామిల్టన్ 330 పారుుంట్లతో ఉన్నారు. నవంబరు 13న జరిగే బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిలో రోస్‌బర్గ్ టైటిల్ గెలిస్తే ఈ ఏడాది ఫార్ములావన్ చాంపియన్‌గా నిలుస్తాడు. ఒకవేళ హామిల్టన్ అందులో గెలిస్తే సీజన్లో చివరి రేస్ (అబుదాబి, నవంబరు 27) వరకు ఫలితం కోసం ఎదురుచూడాలి. కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌ను ఇప్పటికే మెర్సిడెస్ (679) గెలుచుకుంది.