Rio 2016 Olympics
-
‘వేధింపులతోనే దేశం విడిచి వచ్చేశా..’
టెహ్రాన్ : ఇరాన్‌కు ఒలింపిక్ పతకాన్ని అందించిన మొదటి, ఏకైక మహిళా క్రీడాకారిణి కిమియా అలీజాడే తమ దేశంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్లో క్రీడాకారులపై.. ముఖ్యంగా మహిళా క్రీడాకారులపై జరుగుతున్న వేధింపుల పర్వాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. పతకాలు సాధించిన ఆటగాళ్లకు సైతం కనీస గౌరవం ఉండదని వాపోయారు. అందుకనే దేశాన్ని విడిచి యూరప్ వచ్చినట్టు స్పష్టం చేశారు. యూరప్‌నకు తననెవరూ ఆహ్వానించలేదని.. తానే వచ్చానని తెలిపారు. 2016 రియో ఒలింపిక్స్‌లో అలీజాడే తైక్వాండోలో కాంస్య పతకం సాధించారు. 57 కేజీల కేటగిరీలో ఆమె ఈ పతకం సాధించారు. (చదవండి : పొరపాటున కూల్చేశాం) ‘దేశం విడిచి వస్తున్నప్పుడు చాలా బాధపడ్డా. కానీ, వంచన, అన్యాయానికి గురవుతూ.. అబద్ధాలు, పొగడ్తలు ప్రకటిస్తూ బతకలేను. పతకం సాధించి దేశ గౌరవాన్ని పెంచితే.. దానిని రాజకీయాల కోసం కొందరు వాడుకుంటారు. వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన అధికారులు.. మహిళలు తైక్వాండో లాంటి ఆటలు ఆడరాదు అని నీచంగా మాట్లాడతారు. మా కష్టాన్ని గుర్తించకపోగా.. అవమానిస్తారు. వంచనకు గురవుతున్న ఎందరో క్రీడాకారిణుల్లో నేనొరిని. మేనేజ్మెంట్ నిర్ణయాలతో మాకు ఏమాత్రం స్వేచ్ఛ ఉండదు. మమ్మల్ని కేవలం వస్తువులుగానే చూస్తారు. అయినా, వారి ఆదేశాల్ని పాటించా. దేశంలో పీడనకు గురయ్యే వారికి హలో..! ‘ఉన్నత స్థానం’ లో ఉన్నవారికి గుడ్‌బై, తమవారిని కోల్పోయి శోకంలో ఉన్నవారికి సంతాపాన్ని తెలుపుతున్నా’అని అలీజాడే పేర్కొన్నారు. (చదవండి : ‘భారత్ ముందుకొస్తే స్వాగతిస్తాం’!) కాగా, అలీజాడే నిర్ణయంపై ఇరాన్ క్రీడాశాఖ సహాయ మంత్రి మహిన్ ఫర్హాదిజాడే మాట్లాడుతూ.. ‘అలీజాడే ఇన్స్టాగ్రామ్ పోస్టు చూడలేదు. అయితే, ఆమె విదేశాల్లో ఫిజియోథెరఫీ చదవాలనుకునేది. బహుశా అదే కారణం కావొచ్చు’అన్నారు. ఇక ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీ హత్యతో మొదలైన ఉద్రిక్తలు అంతకంతకూ తీవ్రమైన సంగతి తెలిసిందే. సులేమానీ అంత్యక్రియల్లో తొక్కిసలాట జరగడంతో 56 మంది మరణించగా.. ఉక్రెయిన్ విమానాన్ని ఇరాన్ మిలటరీ కూల్చడంతో మరో 176 మంది మరణించారు. ఇప్పటికే.. చెస్ ఆటగాడు అలీరెజా ఫిరౌజా ఇరాన్ తరపున ఆడనని చెప్పగా.. జూడో ఆటగాడు సయీద్ మొలాయి దేశ విడిచి వెళ్లడం గమనార్హం. (చదవండి : ట్రంప్‌నకు ఇరాన్ గట్టి కౌంటర్!) -
‘సూపర్’ టైటిల్‌పై సింధు గురి
ఒడెన్‌స (డెన్మార్క్): అందని ద్రాక్షగా ఉన్న ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో భారత స్టార్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో బరిలోకి దిగనుంది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీలో తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతోపాటు మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో చైనా ప్లేయర్ హీ బింగ్జియావోతో సింధు ఆడుతుంది. రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించిన తర్వాత సింధు ఆడనున్న తొలి టోర్నమెంట్ ఇదే కావడం విశేషం. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సింధు ఈసారి విజేతగా నిలిచి తన ఖాతాలో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్‌ను జమ చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ‘రియో ఒలింపిక్స్ ప్రదర్శనతో నాలో చాలా ఆత్మ విశ్వాసం పెరిగింది. అదే ఉత్సాహంతో ఈ టోర్నీలో మెరుగ్గా రాణిస్తానని ఆశిస్తున్నాను. ఇప్పటి నుంచి నాపై మరింత బాధ్యత పెరిగింది. అరుుతే ఇలాంటి విషయాలను ఆలోచిస్తూ అనవసరంగా ఒత్తిడి పెంచుకోదల్చుకోలేదు. విజయం సాధించేందుకు ఎప్పటిలాగే వందశాతం కృషి చేస్తాను’ అని హీ బింగ్జియావోతో ముఖాముఖి రికార్డులో 1-3తో వెనుకంజలో ఉన్న సింధు వ్యాఖ్యానించింది. ‘డ్రా’ రెండో పార్శ్వంలో ఉన్న సింధు తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో సయాకా సాటో (జపాన్)... క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)... సెమీస్‌లో నాలుగో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా) లేదా ఐదో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో ఆడే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి ప్రపంచ నంబర్‌వన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ (స్పెయిన్) ఫైనల్‌కు చేరే అవకాశముంది. క్వాలిఫయింగ్‌లో కశ్యప్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత మాజీ నంబర్‌వన్ పారుపల్లి కశ్యప్ క్వాలిఫయింగ్‌లో పోటీపడనున్నాడు. మంగళవారం జరిగే తొలి రౌండ్లో అతను రౌల్ మస్ట్ (ఎస్తోనియా)తో ఆడతాడు. ఈ మ్యాచ్ గెలిస్తే రెండో రౌండ్లో కశ్యప్‌కు ఎమిల్ హోస్ట్ (డెన్మార్క్) లేదా ఖోసిట్ (థాయ్‌లాండ్) ఎదురవుతారు. గాయం కారణంగా భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి సాయిప్రణీత్, అజయ్ జయరామ్, ప్రణయ్ పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా బరిలో ఉన్నారు. -
అడిగితే వద్దన్నారు... ఇప్పుడు పంపించారు!
దీపా కర్మాకర్ కోసం ఫిజియో రియో: ఒలింపిక్స్‌లో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఫైనల్స్‌కు క్వాలిఫై అయిన తర్వాత గానీ ఆమె విలువను భారత అధికారులు గుర్తించలేదు. ఈ పోటీలకు ముందు తనకు ఫిజియో కావాలని, కఠినమైన ఈవెంట్ల సాధన తర్వాత కోలుకునేందుకు ఎంతో అవసరం అవుతుందని దీపా మొత్తుకుంది. అయితే అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం హడావిడిగా దీపా కోసం ఫిజియో సజ్జాద్ మీర్‌ను పంపించింది. మంగళవారం సాయంత్రమే మీర్ రియోకు చేరుకున్నారు. -
రియో ఒలంపిక్స్ నేటి రాత్రి ప్రారంభం