వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడిన లారీ
కొవ్వూరు : రాజమహేంద్రవరంలోని రోడ్డు కం రైలు వంతెనపై అప్రోచ్‌రోడ్డు వద్ద అదుపుతప్పిన ఓ లారీ బ్రిడ్జి గోడను ఢీకొని కింద ఉన్న రైల్వేట్రాక్‌పై పడింది. దీంతో రాజమండ్రి వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. లారీ నేరుగా రైల్వే విద్యుత్ తీగలపై పడడంతో అవి తెగిపోయాయి. ఫలితంగా రైల్వే లైన్లకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాయగడ్–విజయవాడ పాసింజర్ కొవ్వూరు రైల్వేస్టేçÙన్ సమీపంలో సిగ్నల్ క్రాసింగ్ వద్ద సుమారు నాలుగున్నరగంటలకుపైగా ఆగిపోయింది. తెల్లవారుజామున 5.40 గంటల నుంచి ఉదయం 9.20గంటల వరకు ఇది నిలిచిపోవడంతో పలురైళ్లు ఆలస్యంగా నడిచాయి. వేరొక డీజిల్ ఇంజిన్‌ను తీసుకువచ్చి ఆగి ఉన్న రైలును పక్కకు తీశారు. రోడ్డు కం రైలు వంతెన మీదుగా రాకపోకలు నిలిచిపోవడంతో మూడోవంతెన(ఆర్చ్వంతెన) మీదుగా గోదావరి స్టేషన్ నుంచి రైళ్లను మళ్లించారు. భీమవరం–రాజమం్రyì పాసింజర్ రైలు సిగ్నల్ లేకపోవడంతో కొవ్వూరు స్టేషన్లో సుమారు రెండుగంటలకుపైగా నిలిచింది. వాస్తవంగా ఈరైలు ఉదయం పది గంటల నుంచి 11గంటల మధ్యలో రాజమహేంద్రవరం చేరుకోవాల్సి ఉండగా, 12.30 గంటల వరకు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు గూడ్సు రైళ్లు కూడా ఆగాయి. రైల్వేశాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు విద్యుత్‌లైన్‌కు మరమ్మతులు చేశారు. మధ్యాహ్నం 12.35 గంటలకు నుంచి రైళ్లు యాథావిధిగా నడిచాయి. ముందుగా గూడ్సు రైళ్లను పంపి, అనంతరం ఇతర రైళ్లకు అనుమతిచ్చారు.