విద్యార్థులకు రూ. 20కోట్లు నగదు బహుమతి.. వైరల్ అవుతున్న వీడియో
Robert Hale: అమెరికాకు చెందిన బిలినియర్ 'రాబర్ట్ హేల్స్' 2500 మంది విద్యార్థులకు వారి గ్రాడ్యుయేషన్ రోజున ఒక్కరికి 1000 డాలర్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 20 కోట్లకంటే ఎక్కువే. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.
'రాబర్ట్ హేల్స్' అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరు మాత్రమే కాదు, గ్రానైట్ టెలీకమ్యూనికేషన్స్ కో-ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఐదు బిలియన్ డాలర్స్ సంపద కలిగి ఉన్న ఈయన రూ. 20 కోట్లు ఇవ్వడం పెద్ద గొప్ప కాకపోవచ్చు, కానీ 2500 మంది విద్యార్థులకు ఇవ్వడం చాలా గొప్ప విషయం అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
రాబర్ట్ హేల్స్ యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో విద్యార్థులకు ఈ నగదు బహుమతి అందించారు. 2023 యూమాస్ బోస్టన్ అండర్ గ్రాడ్యుయేట్ క్లాస్ విద్యార్థులు ఆయన పంపిణీ చేసిన గిఫ్ట్స్ క్యూలైన్లో నిలబడి తీసుకున్నారు. అయితే వారికి రెండు ఎన్వలప్ కవర్లను అందించారు. ఒక కవర్ మీద గిఫ్ట్ అని 500 డాలర్స్ ఉన్నాయి. మరో కవర్ మీద గివ్ అని 500 డాలర్స్ ఉంచారు. అంటే తీసుకోవడంలో కంటే ఇవ్వడంలో ఎక్కువ ఆనందం పొందండని తెలిపారు. ఈ కార్యక్రమం షేరింగ్, కేరింగ్, గివింగ్ ప్రాముఖ్యతలను గురించి తెలియజేస్తుంది.
(ఇదీ చదవండి: అవమానానికి గుణపాఠం.. తలపాగా రంగుకు తగ్గ రోల్స్ రాయిస్ కొన్న 'రూబిన్ సింగ్')
ఈ విధంగా డబ్బులు పంచడం ఇదే మొదటి సారి కాదు, గతంలో కూడా ఇలాంటివి చాలానే చేశారు. 2022లో రాక్స్బరీ కమ్యూనిటీ కళాశాలలో విద్యార్థులకు ఇలాంటి నగదు బహుమతి ఇచ్చారు. ఎదుటి వారికి ఇచ్చే గుణాన్ని విద్యార్ధి దశ నుంచి అలవాటు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల విద్యార్థులకు నగదు బహుమతి అందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
At @UMassBoston commencement, billionaire commencement speaker Robert Hale just told 2,500 stunned graduates he is giving them each $1,000 — half to keep, he said, and half to give. pic.twitter.com/oCq3XThdoE
— sonel cutler (@cutler_sonel) May 25, 2023