ఎవరెస్టే ధ్యేయంగా...
భువనగిరి టౌన్ : చెట్టు ఎక్కగలవ ఓ నరహరి.. పుట్టలెక్కగలవా.. చెట్టు ఎక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా.. అని ప్రశ్నిస్తే చెట్టు ఎక్కగలను.. పుట్టలెక్కగలను.. చెట్టు కొమ్మన ఉన్న చిగురు కోయగలను అని బదులిస్తాడు.. సినీ హీరో. కానీ భువనగిరి ఖిలాపై రాక్క్లైం బింగ్‌లో శిక్షణ పొందుతున్న ఈ విద్యార్థులు చెట్టులు.. పుట్టలే కాదు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగలమని ఆత్మవిశ్వాసంతో పేర్కొం టున్నారు. ఏకశిల పర్వతంపై సాహస విన్యాసాలు చేస్తూ అబ్బుర పరుస్తున్నారు. రాష్ట్రం లోని 10 జిల్లాల్లో ఎంపిక చేసిన 30 మంది సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నాలుగు రోజులుగా ఖిలాపై రాక్‌క్లైంబింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ గురువారం ముగియనుంది. గతంలో భువనగిరి ఖిలాపై శిక్షణ పొందిన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పూర్ణ, ఆనంద్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన విషయం విధితమే. తాము కూడా వారి స్ఫూర్తితో శిక్షణ తీసుకుం టున్నామని, ఎప్పటికైనా ఎవరెస్ట్ శిఖరాన్ని అందుకోవడమే తమ ధ్యేయమని శిక్షణ పొందుతున్న విద్యార్థులు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తా
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే నా లక్ష్యం. మొదట్లో రాక్‌క్లైంబింగ్ చేయటం కష్టంగా అనిపించింది. కానీ ఈ శిక్షణతో భయం తొలిగిపోయింది. ఇప్పడు సుల భంగా రాక్‌క్లైంబింగ్ చేయగలుగుతున్నాను. పర్వాతారోహణ చేయాలంటే శిక్షణ తప్పని సరి.
- టి.సంగీత, 9వ తరగతి, కేజీబీవీ,
మెదక్ జిల్లా
పర్వతారోహణ అంటే ఇష్టం
నాకు చిన్నప్పటి నుంచి పర్వతారోహణ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే రాక్ క్లైంబింగ్ శిక్షణ కోసం ఫీజు చెల్లించాను. శిక్షణలో అనేక విషయాలు నేర్చుకున్నా. కోచ్‌లు ఎన్నో మెళకువలు నేర్పించారు. ఎప్పటికైనా హిమాలయాల్లోని ఏదేని పర్వతాన్ని అధిరోహించాలన్నది నా కోరిక.
- ఆర్.శాంతి, 9వ తరగతి, కమదానం, మహబూబ్‌నగర్ జిల్లా