Rockets Hit
-
ఇజ్రాయెల్‌పై 50 రాకెట్లతో హెజ్బొల్లా దాడి
జెరూసలేం: లెబనాన్ సరిహద్దులో హెజ్బొల్లా, ఇజ్రాయెల్ సైన్యం మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. తాజాగా హెజ్బొల్లా గ్రూప్ ఇజ్రాయెల్‌పై భారీగా రాకెట్ల దాడి చేసింది. బుధవారం ఉదయం ఉత్తర లెబనాన్ వైపు నుంచి సుమారు 50 రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి దూసుకోచ్చాయనా ఐడీఎఫ్ తెలిపింది.🚨#BREAKING: IDF say Hezbollah launched at least 50 rockets in the latest attack on the Upper Galilee in Northern Israel mostly aimed at the city of Safed. pic.twitter.com/ExAiBgKhHl— World Source News 24/7 (@Worldsource24) October 15, 2024 క్రెడిట్స్: World Source News 24/7 వెంటనే అప్రత్తమైన ఇజ్రాయెల్ ఆర్మీ.. 50 ప్రొజెక్టైల్స్‌ను మధ్యలోనే అడ్డుకొని నేల కూల్చామని వెల్లడించింది. ఇక.. వాటి వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఐడీఎఫ్ ప్రకటించింది. సఫెడ్ పట్టణంపైకి భారీ క్షిపణులను తామే ప్రయోగించామని హెజ్బొల్లా ఓ ప్రకటనలో తెలిపింది.చదవండి: కెనడా అడ్డగోలు ఆరోపణలు -
భూమిపైకి 23 టన్నుల రాకెట్ శకలాలు.. ఎక్కడ పడతాయో తెలియదు!
సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోన్న చైనా.. అందుకోసం రాకెట్లను పంపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అంతరిక్షంలోకి చేరుకున్న ఓ భారీ రాకెట్ శకలాలు భూమిపై పడనున్నాయి. ఈ వారాంతంలోనే భూమిని తాకనున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త తియాంగాంగ్ స్పేష్ స్టేషన్ కోసం మూడో మోడ్యూల్‌ను పంపించేందుకు 23 టన్నుల లాంగ్ మార్చ్ 5బీ రాకెట్‌ను అంతరిక్షంలోకి ఇటీవలే ప్రయోగంచింది చైనా. ఆ రాకెట్‌కు చెందిన 23 టన్నుల బరువుండే శకలాలు ఈ వారాంతంలోనే భూవాతావరణంలోకి ప్రవేశించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఈ శిథిలాల వల్ల మానవాళికి ఏర్పడే ప్రమాదంపై అంచనా వేస్తున్నారు. అవి ఎక్కడ పడనున్నాయనే విషయం స్పష్టంగా తెలియదని హెచ్చరిస్తున్నారు. ఈ రాకెట్ భూకక్ష్యను చేరుకున్న తర్వాత భూమిపైకి తిరిగి ప్రవేశిస్తుంది. ఇందుకు సంబంధించిన 28 గంటల రీఎంట్రీ విండో శుక్రవారం సాయంత్రం నుంచి మొదలై శనివారమంతా కొనసాగుతుంది. సుమారు 10 అంతస్తుల పెద్ద భవన అంత పెద్దగా ఉండే ఈ రాకెట్ భూవాతావరణంలోకి చేరుకున్న తర్వాత కొంతభాగం కాలిపోతుంది. మిగిలిన కొన్ని ప్రధాన భాగాలు అలాగే భూమిపై పడుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు.. దీని వల్ల కొంత ప్రమాదం ఉండొచ్చని ఏరోస్పేస్ కార్పొరేషన్ చెబుతోంది. 88శాతం ప్రపంచ జనాభా నివసించే ప్రాంతాల్లో ఇవి పడే అవకాశముందట. అయితే శకలాల్లో చాలా వరకు జనసాంద్రత తక్కువ ఉండే ప్రదేశాలు.. సముద్రాలు, ఖాళీ ప్రదేశాల్లో పడే అవకాశం ఉండటంతో ముప్పు కాస్త తగ్గొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ఉత్తర కొరియా కవ్వింపు చర్య.. తీవ్ర ఉద్రిక్తత, జపాన్, సౌత్ కొరియా అలర్ట్ -
ఇజ్రాయెల్ దాడుల్లో తల్లి, కూతురు మృతి
గాజా సిటీ: పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ నుంచి పదుల సంఖ్యలో రాకెట్ల ప్రయోగం, ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో తల్లి, ఆమె కూతురు మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. శనివారం మధ్యాహ్నం గాజాలోని హమాస్, ఇస్లామిక్ జిహాదీ సంస్థలకు చెందిన దళాలు సుమారు 150 రాకెట్లు తమ భూభాగంపైకి ప్రయోగించాయని ఇజ్రాయెల్ తెలిపింది. పదుల సంఖ్యలో రాకెట్లను రక్షణ వ్యవస్థలు మధ్యలోనే అడ్డుకోగా మరికొన్ని నిర్జన ప్రాంతంలో పడిపోయాయని పోలీసులు తెలిపారు. వీటి వల్ల ఇద్దరు గాయపడ్డారన్నారు. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ బలగాలు గాజాలోని మూడు ప్రాంతాల్లో 30 లక్ష్యాలపై ట్యాంకులు, యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఒక గర్భవతి(37), ఆమె ఏడాది కూతురు చనిపోగా 10 మంది వరకు గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైనికాధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. మరోవైపు, ఈజిప్టు కూడా ఏప్రిల్ 9వ తేదీన ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందం కొనసాగేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. -
సిరియాలో రష్యా ఎంబసీపై రాకెట్లతో దాడి
-
సిరియాలో రష్యా ఎంబసీపై రాకెట్లతో దాడి
డమాస్కస్: సిరియాలో రష్యా రాయబార కార్యాలయంపై రాకెట్లతో దాడి చేశారు. మంగళవారం డమాస్కస్‌లోని ఈ కార్యాలయం ప్రహారీ గోడ లోపల రెండు రాకెట్లు పడ్డాయి. సిరియాలో రష్యా వైమానిక చర్యలకు మద్దతుగా దాదాపు 300 మంది ప్రజలు అక్కడ సమావేశమైన సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని రష్యా సీనియర్ దౌత్యవేత ఒకరు చెప్పారు. డమాస్కస్‌కు తూర్పు వైపున తిరుగుబాటుదారులు పాగా వేసిన ప్రాంతం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్టు సిరియాలో మానవ హక్కుల సంఘం ప్రతినిధులు చెప్పారు.