సిరియాలో రష్యా ఎంబసీపై రాకెట్లతో దాడి | Rockets Hit Russian Embassy Compound in Damascus: Report | Sakshi
Sakshi News home page

సిరియాలో రష్యా ఎంబసీపై రాకెట్లతో దాడి

Published Tue, Oct 13 2015 3:25 PM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM

సిరియాలో రష్యా ఎంబసీపై రాకెట్లతో దాడి

సిరియాలో రష్యా ఎంబసీపై రాకెట్లతో దాడి

డమాస్కస్: సిరియాలో రష్యా రాయబార కార్యాలయంపై రాకెట్లతో దాడి చేశారు. మంగళవారం డమాస్కస్లోని ఈ కార్యాలయం ప్రహారీ గోడ లోపల రెండు రాకెట్లు పడ్డాయి. సిరియాలో రష్యా వైమానిక చర్యలకు మద్దతుగా దాదాపు 300 మంది ప్రజలు అక్కడ సమావేశమైన సమయంలో ఈ దాడి జరిగింది.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని రష్యా సీనియర్ దౌత్యవేత ఒకరు చెప్పారు. డమాస్కస్కు తూర్పు వైపున తిరుగుబాటుదారులు పాగా వేసిన ప్రాంతం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్టు సిరియాలో మానవ హక్కుల సంఘం ప్రతినిధులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement