Rodent
-
వర్షాలలో ఎలుకలతో వచ్చే జబ్బు!
చినుకు రాలే కాలమిది. వానలతో నేల తడిసే సమయమిది. దాంతో బొరియల్లోని ఎలుకలు బయటకు వస్తాయి. ఆహారం కోసం.. మెతుకుల్ని వెతుక్కుంటూ కిచెన్‌లో ప్రవేశిస్తాయి. వర్షాలు ఎక్కువగా ఉండి, కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై ఎలుక కనిపించిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఎందుకంటే. వాటి నుంచి వ్యాప్తిచెందే లెప్టోస్పైరా జాతికి చెందిన బ్యాక్టీరియాతో ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. చాలా సందర్భాల్లో పెద్దగా ప్రమాదం లేకపోయినా... కొన్నిసార్లు మాత్రం ప్రాణాంతకం అయ్యే ప్రమాదమూ ఉంది. మనం వర్షాకాలం ముంగిట్లో ఉన్న ప్రస్తుత సమయంలో ‘లెప్టోస్పైరోసిస్’ ఇన్ఫెక్షన్పై అవగాహన కోసం ఈ కథనం. లెప్టోస్పైరా ఇంటెరొగాన్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఆరోగ్య సమస్య కాబట్టి దీనికి ‘లెప్టోస్పైరోసిస్’ అని పేరు. ఇది ఎక్కువగా ఎలుకలు, కొన్ని పెంపుడు జంతువులైన కుక్కలూ, ఫామ్‌లలో పెంచే జంతువులతోనూ వ్యాపిస్తుంది. దీన్ని ‘వీల్స్/ వెయిల్స్ డిసీజ్’ అని కూడా అంటారు. వ్యాప్తి ఇలా.. ఎలుకలు, ఇతర రోడెంట్స్ల (ఎలుక జాతికి చెందిన జీవుల) మూత్రవిసర్జనతో పొలాల్లోని నీరు కలుషితమవుతుంది. ఆ నీరూ, మట్టీ కలిసిన బురదలో పనిచేసేవారి ఒంటిపై గాయాలుంటే.. వాటి ద్వారా ఈ బ్యాక్టీరియా. మనిషి దేహంలోకి ప్రవేశించి లెప్టోస్పైరోసిస్‌ను కలుగజేస్తుంది. అందుకే చేలలో పనిచేసే రైతులు, పశువుల డాక్టర్లు (వెటర్నేరియన్స్), అండర్‌గ్రౌండ్ సీవరేజ్ వర్కర్లు వంటి వాళ్లలో ఇది ఎక్కువ. కలుషితమైన చెరువులు, వాగులు, సరస్సుల్లో ఈదేవారిలోనూ కనిపిస్తుంది. నివారణ: ఆహారాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో (ఎలుకల వంటివి చేరలేని చోట్ల) సురక్షితంగా ఉంచాలి. రోడ్లపై మలమూత్రాలతో కలుషితమైన నీళ్లు (సీవరేజ్) ప్రవహించే చోట్ల నడవకపోవడం (కాళ్లకు పగుళ్లు, ఇతర గాయాలు ఉంటే వాటి ద్వారా బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది); వీలైనంతవరకు జంతుమూత్రాలతో కలుషితమైన బురదనీటిలో, బురదనేలల్లో తిరగకుండా ఉండటం; పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో దీన్ని చాలావరకు నివారించవచ్చు. చికిత్స: పెన్సిలిన్, డాక్సిసైక్లిన్ వంటి మామూలు యాంటిబయాటిక్స్‌తో చికిత్స అందించడం ద్వారా దీన్ని తేలిగ్గానే నయం చేయవచ్చు. కాకపోతే లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించాల్సి రావచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కిడ్నీ ఫెయిల్యూర్, మెదడువాపు కలిగించే మెనింజైటిస్, లంగ్ ఫెయిల్యూర్ వంటి కాంప్లికేషన్లకు దారితీసే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో గుండె కండరాలు, అంతర్గత రక్తస్రావం వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీసే అవకాశం ఉన్నప్పటికీ అది చాలా అరుదు. లక్షణాలు: బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించిన రెండువారాల్లో లక్షణాలు బయటపడవచ్చు. కొన్ని సందర్భాల్లో అసలు లక్షణాలే కనిపించకపోవచ్చు. తీవ్రమైన తలనొప్పి (కొన్నిసార్లు కొద్దిగా జ్వరంతో) ఛాతీ నొప్పి, కండరాల నొప్పి కొందరిలో కామెర్లు (కళ్లు, చర్మం పచ్చబడటం) వాంతులు, విరేచనాలు కొందరిలో చర్మంపై ర్యాష్‌తో. నిర్ధారణ: రక్తపరీక్షల్లో బ్యాక్టీరియా తాలూకు యాంటీబాడీస్‌తో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. మరింత ఖచ్చితమైన నిర్ధారణ కోసం డీఎన్ఏ పరీక్ష కూడా అవసరం పడవచ్చు. అయితే లక్షణాలు,ఆయా సీజన్లలో ఇది వచ్చే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ జబ్బును అనుమానించి చికిత్స అందిస్తారు. డాక్టర్ గురుప్రసాద్, సీనియర్ ఫిజీషియన్ అండ్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ (నిర్థారణ: బీట్రూట్ జ్యూస్ తాగే అలవాటుందా? ఇందులోని నైట్రేట్ వల్ల..) -
వైరల్ వీడియో: తన బిడ్డ కోసం పాముతో పోరాడిన ఎలుక
-
Telangana: ఎలుకలను పట్టే గ్లూట్రాప్‌లపై నిషేధం!
సాక్షి, హైదరాబాద్: ఎలుకలను పట్టేందుకు వినియోగించే గ్లూట్రాప్ (జిగురుతో కూడిన ఉచ్చు)ల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేదించింది. గ్లూట్రాప్స్‌తో ఎలుకలను పట్టడం అత్యంత క్రూరమైన విధానమని, ఎలుకలు వాటికి అతుక్కుపోయి తీవ్రనొప్పి, బాధను ఎదుర్కొంటాయని.. గ్లూట్రాప్‌ల వినియోగం జంతువులపై క్రూరత్వం నిషేధ చట్టం– 1960లోని సెక్షన్ 11 స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్థకశాఖ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. నిషేధాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఉచ్చుబిగించడం తోపాటు ఇతర సంప్రదాయ పద్ధతుల్లో ఎలు కల నియంత్రణకు చర్యలు తీసుకోవచ్చని ప్రజలకు సూచించింది. కాగా.. గ్లూట్రాప్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం చర్య తీసుకోవడంపై ‘పెటా’ హర్షం వ్యక్తం చేసింది. -
చైనాలో బయటపడిన మరో వైరస్!
బీజింగ్: మహమ్మారి కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కోలేక, వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియక ప్రపంచ మానవాళి బెంబేలెత్తుతోంది. ఈ తరుణంలో చైనాలో మరో ప్రాణాంతక వైరస్ బయటపడినట్టు ఓ మీడియా రిపోర్టు వెల్లడించింది. హంటా వైరస్‌గా పిలవబడే ఈ వైరస్ బారిన పడి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడని గ్లోబల్ టైమ్స్ మీడియా సంస్థ పేర్కొంది. హంటా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే అతను చనిపోవడం కలకలం రేపుతోంది. (చదవండి: చైనాపై అమెరికన్ లాయర్ కేసు) గ్లోబల్ టైమ్స్ ప్రకారం.. ఓ వ్యక్తికి హంటా వైరస్ లక్షణాలు బయటపడటంతో నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అతనికి హంటా వైరస్ పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ అయింది. అయితే, అతడు పని నిమిత్తం షాండాంగ్ ప్రావిన్స్‌కు చార్టర్డ్ బస్సులో పయమవ్వగా దారిలోనే ప్రాణాలు విడిచాడు. ఇంకో షాకింగ్ విషయమేంటంటే.. మరో 32 మంది కూడా ఇదే వైరస్ బారిన పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అయితే, వారి రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వార్త ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ‘వ్యాధుల నియంత్రణ, నివారణ సెంటర్’ హంటా వైరస్‌కు సంబంధించిన పలు వివరాలు తెలిపింది. ‘హంటా వైరస్ ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపించే వ్యాధి. ఇంట్లో, పరిసరాల్లో ఎలుకలు లేకుండా చూసుకుంటే మంచిది. ఆరోగ్యవంతులకు కూడా ఈ వైరస్ సోకితే ప్రమాదమే. అయితే, ఇది అంటువ్యాధి కాదు. మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదు. కేవలం ఎలుకల లాలాజలం, వాటి గూళ్లు, ఎలుకల వ్యర్థాలు తాకినపుపడు వైరస్ మన చేతుల్లోకి చేరుతుంది. క్రిములు చేరిన చేతులతో సదరు వ్యక్తి కళ్లు, ముక్కు నోటిని తాకితే వైరస్ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కూడా కోవిడ్-19 మాదిరిగానే ఉంటాయి. జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, కండరాల నొప్పి, వాంతులు, డయేరియా.. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది.’ (చదవండి: జీవభౌతిక శాస్త్రవేత్త మైఖేల్ లెవిట్ అంచనా) -
విమానాలకు అంతరాయం కలిగించిన కుక్క, ఎలుక
అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులకు అసౌకర్యం కలిగించింది. రన్‌వే పైకి కుక్క రావడంతో ఓ విమానాన్ని తాత్కాలికంగా ఆపేయగా, మరో విమానంలో ఎలుక కనిపించడంతో మార్గమధ్యం నుంచి ఈ సర్వీసు వెనక్కు వచ్చింది. ఈ రెండు సంఘటనలు బుధవారం భారత్‌లో వేర్వేరు విమానాశ్రయాల్లో జరిగాయి. పంజాబ్‌లోని అమృత్సర్ విమానాశ్రయంలో దుబాయ్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానం సిద్ధమవుతుండగా రన్‌వేపై కుక్క కనిపించింది. దీంతో విమానాన్ని కాసేపు ఆపేశారు. రన్‌వే నుంచి కుక్కను పక్కకుతోలాక విమానం టేకాఫ్ తీసుకుంది. ఇక ముంబై నుంచి లండన్ వెళ్తున్న మరో ఎయిరిండియా విమానంలో ఎలుక ఉన్నట్టు మార్గమధ్యంలో గుర్తించారు. దీంతో ఈ విమానాన్ని వెనక్కిరప్పించి ముంబైలో ల్యాండ్ చేశారు. -
‘గజ’ మూషికం
లండన్: భీకరంగా అరుస్తున్న మృగంలా ఉన్న ఇది ఏదో అడవి జంతువు అయి ఉంటుందని అనుకుంటున్నారు కదూ? కానీ కాదు.. ఇది ఓ ఎలుక! అవును.. గేదె సైజు శరీరం, వెయ్యి కిలోల బరువుతో ఉన్న ఈ ఎలుక జాతి జంతువు 30 లక్షల ఏళ్ల క్రితం దక్షిణ అమెరికాలో సంచరించిందట. ఇప్పటిదాకా కనుగొన్న అన్ని ఎలుక జాతి జంతువుల్లోనూ ఇదే అతిపెద్దదట. గతంలో దొరికిన దీని పుర్రె ఎముకలపై బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ యార్క్, హల్ యార్క్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు కంప్యూటర్ సాయంతో జరిపిన తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. గీనియా పందులకు కాస్త దగ్గరి పోలికలతో ఉన్న ఈ ఎలుక జంతువు పేరు ‘జోసెఫోఆర్టిగాసియా మోనెసీ’. దీని కత్తెర పళ్లు(ముందరి దంతాలకు) పులి దంతాలంత బలం ఉండేదట. అయితే ఎలుక మాదిరిగా పైన, కింద రెండు చొప్పున ఉన్న ఈ దంతాలను, ఏనుగు తన దంతాలు ఉపయోగించినట్లుగా వాడుకునేదట. నేలను తవ్వేందుకు, ఇతర జంతువులతో పోరాడేందుకు, ఆహారం తీసుకునేందుకూ ఈ దంతాలను ఉపయోగించేదట. -
సింహం.. చిట్టెలుక..
సింహం, చిట్టెలుక కథ మనందరికీ తెలిసిందే.. చివర్లో సింహాన్ని ఎలుక ప్రమాదం నుంచి కాపాడటం.. తర్వాత వారు ఫ్రెండ్స్ అయిపోవడంతో కథ కంచికి చేరుతుంది. అది కథ. అయితే, వాస్తవంలోనూ దాదాపు అలాంటి సీన్‌నే తలపిస్తోంది ఈ చిత్రం. సింహం అభయహస్తం ఇస్తుంటే.. దాని కింద చిట్టెలుక ప్రశాంతంగా సిటింగ్ వేసింది చూశారా? స్పెయిన్‌కు చెందిన జువాన్ కార్లోస్ తీసిన ఈ చిత్రం బీబీసీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్-2014 తుది జాబితాకు ఎంపికైంది.