విమానాలకు అంతరాయం కలిగించిన కుక్క, ఎలుక
అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులకు అసౌకర్యం కలిగించింది. రన్వే పైకి కుక్క రావడంతో ఓ విమానాన్ని తాత్కాలికంగా ఆపేయగా, మరో విమానంలో ఎలుక కనిపించడంతో మార్గమధ్యం నుంచి ఈ సర్వీసు వెనక్కు వచ్చింది. ఈ రెండు సంఘటనలు బుధవారం భారత్లో వేర్వేరు విమానాశ్రయాల్లో జరిగాయి.
పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయంలో దుబాయ్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానం సిద్ధమవుతుండగా రన్వేపై కుక్క కనిపించింది. దీంతో విమానాన్ని కాసేపు ఆపేశారు. రన్వే నుంచి కుక్కను పక్కకుతోలాక విమానం టేకాఫ్ తీసుకుంది. ఇక ముంబై నుంచి లండన్ వెళ్తున్న మరో ఎయిరిండియా విమానంలో ఎలుక ఉన్నట్టు మార్గమధ్యంలో గుర్తించారు. దీంతో ఈ విమానాన్ని వెనక్కిరప్పించి ముంబైలో ల్యాండ్ చేశారు.