ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఎలుకలను పట్టేందుకు వినియోగించే గ్లూట్రాప్ (జిగురుతో కూడిన ఉచ్చు)ల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేదించింది. గ్లూట్రాప్స్‌తో ఎలుకలను పట్టడం అత్యంత క్రూరమైన విధానమని, ఎలుకలు వాటికి అతుక్కుపోయి తీవ్రనొప్పి, బాధను ఎదుర్కొంటాయని.. గ్లూట్రాప్‌ల వినియోగం జంతువులపై క్రూరత్వం నిషేధ చట్టం– 1960లోని సెక్షన్ 11 స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్థకశాఖ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. నిషేధాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఉచ్చుబిగించడం తోపాటు ఇతర సంప్రదాయ పద్ధతుల్లో ఎలు కల నియంత్రణకు చర్యలు తీసుకోవచ్చని ప్రజలకు సూచించింది. కాగా.. గ్లూట్రాప్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం చర్య తీసుకోవడంపై ‘పెటా’ హర్షం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment