roster released
-
సుప్రీంలో 4 నుంచి కొత్త రోస్టర్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సోమవారం కొత్త రోస్టర్‌ను ప్రకటించింది. వచ్చే సంవత్సరం జనవరి 4 నుంచి ఈ రోస్టర్ అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ కొత్త రోస్టర్ ప్రకారం.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్)ను, లెటర్ పిటిషన్లను, సామాజిక న్యాయ అంశాలను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే, మరో ఏడుగురు న్యాయమూర్తులు విచారణ జరుపుతారు. జస్టిస్ బాబ్డేతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సామాజిక న్యాయ వివాదాలను విచారిస్తారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆరు నుంచి ఏడు ధర్మాసనాలు వివిధ కేసులను విచారిస్తాయి. పిల్ కేసులతో పాటు కోర్టు ధిక్కరణ, హెబియస్ కార్పస్, ఎన్నికలు, రాజ్యాంగ పదవులు, ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించి కేసులను సీజేఐ విచారిస్తారు. ఆర్బిట్రేషన్, పరిహారం, మత విషయాలు, జ్యూడీషియల్ అధికారులకు సంబంధించిన కేసులను జస్టిస్ రమణ విచారిస్తారు. కంపెనీ లా, ఫ్యామిలీ లా, బ్యాంకింగ్ సంబంధిత కేసులను జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తుంది. -
‘సుప్రీం’ కొత్త రోస్టర్
న్యూఢిల్లీ: న్యాయమూర్తులకు కేసుల కేటాయింపు చేస్తూ సుప్రీంకోర్టు ఆదివారం కొత్త రోస్టర్‌ను విడుదల చేసింది. ఈ రోస్టర్ జూలై 2 నుంచి (వేసవి సెలవుల ముగిసి కోర్టు ప్రారంభం అయ్యాక) అమల్లోకి రానుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ రిటైరైన రెండ్రోజుల్లోనే ఈ జాబితా సిద్ధవమడం గమనార్హం. ఈ రోస్టర్ ప్రకారం.. సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ సామాజిక న్యాయం, ఎన్నికలు, హెబియస్ కార్పస్, కోర్టు ధిక్కరణతోపాటు అన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించనుంది. రెండో సీనియర్ జడ్జి అయిన జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్.. కార్మిక చట్టాలు, పరోక్ష పన్నులు, పర్సనల్ లా– కంపెనీ లా కేసులను విచారించనుంది. జస్టిస్ లోకుర్ నేతృత్వంలోని ధర్మాసనం పర్యావరణ అసమతుల్యత, అటవీ సంరక్షణ, జంతు సంరక్షణ, భూగర్భ జలాలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. మరో సీనియర్ జడ్జి జోసెఫ్ కురియన్ నేతృత్వంలోని బెంచ్.. కార్మిక చట్టాలతోపాటు అద్దె చట్టం, కుటుంబ వివాదాలు, కోర్టు ధిక్కరణ, పర్సనల్ లా కేసులను విచారిస్తుంది. ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల కొలీజియంలో కొత్తగా చేరిన జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం.. పరోక్ష పన్నులతోపాటు ఎన్నికలు, క్రిమినల్ కేసులు, ఆర్డినరీ సివిల్ కేసులు, న్యాయాధికారుల నియామకం తదితర అంశాలను విచారిస్తుంది. ఈ ఐదుగురితోపాటు.. మరో ఆరుగురు న్యాయమూర్తుల నేతృత్వంలోనూ ధర్మాసనాలు ఏర్పాటుచేసినట్లు కొత్త రోస్టర్ పేర్కొంది. ఎస్ఏ బాబ్డే, ఎన్వీ రమణ, అరుణ్ మిశ్రా, ఏకే గోయల్, ఆర్ఎఫ్ నారీమన్, ఏఎమ్ సప్రేల నేతృత్వంలోనూ పలు కేసుల కేటాయింపులతో ధర్మాసనాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. -
వీఆర్ఏ,వీఆర్వో పోస్టుల రిజర్వేషన్ రోస్టర్
సాక్షి, కాకినాడ : జిల్లాలో వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి సంబంధించి రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలను కలెక్టర్ నీతూప్రసాద్ ఆదివారం విడుదల చేశారు. డివిజన్ల వారీగా వీఆర్ఏ పోస్టులు మొత్తం 357 కాగా కాకినాడ డివిజన్ నుంచి 49,పెద్దాపురం డివిజన్ నుంచి 41,రాజమండ్రి డివిజన్ నుంచి 43,అమలాపురం నుంచి 129,రంపచోడవరం డివిజన్ నుంచి 28,రామచంద్రపురం డివిజన్ నుంచి 67 ఉన్నాయి. అలాగే వీఆర్ఓ పోస్టులు 87 ఉండగా వీటిలో నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లోని 82 ఖాళీల్లో రిజర్వేషన్ల రోస్టర్ ఇలా ఉంది. ఓసీ జనరల్‌కు 16,ఓసీ మహిళలకు 10,ఎస్సీ జనరల్‌కు 7,ఎస్టీ జనరల్‌కు 5,ఎస్టీ మహిళలకు 3,బీసీ ఎ జనరల్‌కు 4,బీసీ మహిళలకు 3,బీసీ బీ జనరల్‌కు 7,బీసీ బీ మహిళలకు 3, బీసీ సీ జనరల్‌కు 1,బీసీ డీ జనరల్‌కు 7,బీసీ డీ మహిళలకు 2,బీసీ ఈ జనరల్‌కు 4,బీసీ ఈ మహిళలకు 1,ఎక్సు సర్వీసు మెన్ జనరల్‌కు 2, రిజర్వు చేశారు. మిగిలిన అయిదు ఖాళీలు షెడ్యూల్ ప్రాంతాలలో ఎస్టీ జనరల్‌కు 4,ఎస్టీ మహిళలకు 1 రిజర్వు చేశారు. వీఆర్ఏ పోస్టుల రిజర్వేషన్ల వివరాలు ఇక 56 మండలాల్లోని 306 గ్రామాల్లో భర్తీ చేయనున్న 357 వీఆర్ఏ పోస్టులకు కేటగిరీల వారీగా ఓసీ జనరల్‌కు 84,ఓసీ మహిళలకు 46, ఎస్సీ జనరల్‌కు 38,ఎస్సీ మహిళలకు 8,ఎస్టీ జనరల్‌కు 25, ఎస్టీ మహిళలకు 29,బీసీ ఏ జనరల్‌కు 15,బీసీ ఏ మహిళలకు 8,బీసీ బీ జనరల్‌కు 6, బీసీ బీ మహిళలకు 14,బీసీ సీ జనరల్‌కు 17,బీసీ డీ మహిళలకు 18, బీసీ ఈ మహిళలకు 15,ఎక్సు సర్వీస్ మెన్ మహిళలకు 17,వికలాంగ(అంధులు)మహిళలకు 15,హెచ్ హెచ్ జనరల్‌కు 2 రిజర్వు చేశారు.