జిల్లాలో వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి సంబంధించి రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలను కలెక్టర్ నీతూప్రసాద్ ఆదివారం విడుదల చేశారు.
సాక్షి, కాకినాడ : జిల్లాలో వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి సంబంధించి రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలను కలెక్టర్ నీతూప్రసాద్ ఆదివారం విడుదల చేశారు. డివిజన్ల వారీగా వీఆర్‌ఏ పోస్టులు మొత్తం 357 కాగా కాకినాడ డివిజన్ నుంచి 49,పెద్దాపురం డివిజన్ నుంచి 41,రాజమండ్రి డివిజన్ నుంచి 43,అమలాపురం నుంచి 129,రంపచోడవరం డివిజన్ నుంచి 28,రామచంద్రపురం డివిజన్ నుంచి 67 ఉన్నాయి. అలాగే వీఆర్‌ఓ పోస్టులు 87 ఉండగా వీటిలో నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లోని 82 ఖాళీల్లో రిజర్వేషన్ల రోస్టర్ ఇలా ఉంది.
ఓసీ జనరల్‌కు 16,ఓసీ మహిళలకు 10,ఎస్సీ జనరల్‌కు 7,ఎస్టీ జనరల్‌కు 5,ఎస్టీ మహిళలకు 3,బీసీ ఎ జనరల్‌కు 4,బీసీ మహిళలకు 3,బీసీ బీ జనరల్‌కు 7,బీసీ బీ మహిళలకు 3, బీసీ సీ జనరల్‌కు 1,బీసీ డీ జనరల్‌కు 7,బీసీ డీ మహిళలకు 2,బీసీ ఈ జనరల్‌కు 4,బీసీ ఈ మహిళలకు 1,ఎక్సు సర్వీసు మెన్ జనరల్‌కు 2, రిజర్వు చేశారు. మిగిలిన అయిదు ఖాళీలు షెడ్యూల్ ప్రాంతాలలో ఎస్టీ జనరల్‌కు 4,ఎస్టీ మహిళలకు 1 రిజర్వు చేశారు.
వీఆర్‌ఏ పోస్టుల రిజర్వేషన్ల వివరాలు
ఇక 56 మండలాల్లోని 306 గ్రామాల్లో భర్తీ చేయనున్న 357 వీఆర్‌ఏ పోస్టులకు కేటగిరీల వారీగా ఓసీ జనరల్‌కు 84,ఓసీ మహిళలకు 46, ఎస్సీ జనరల్‌కు 38,ఎస్సీ మహిళలకు 8,ఎస్టీ జనరల్‌కు 25, ఎస్టీ మహిళలకు 29,బీసీ ఏ జనరల్‌కు 15,బీసీ ఏ మహిళలకు 8,బీసీ బీ జనరల్‌కు 6, బీసీ బీ మహిళలకు 14,బీసీ సీ జనరల్‌కు 17,బీసీ డీ మహిళలకు 18, బీసీ ఈ మహిళలకు 15,ఎక్సు సర్వీస్ మెన్ మహిళలకు 17,వికలాంగ(అంధులు)మహిళలకు 15,హెచ్ హెచ్ జనరల్‌కు 2 రిజర్వు చేశారు.