Neetu Prasad
-
‘రైతుబంధు’ బావుందా..?
కొణిజర్ల : ‘ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఎలా ఉంది.. రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయా.. పెట్టుబడి చెక్కులు బ్యాంకు నుంచి మార్చుకున్నారా.. ఆ డబ్బులు ఏం చేస్తున్నారు..’ అంటూ రైతుబంధు పథకం జిల్లా ప్రత్యేకాధికారి, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ రైతులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం తీరుతెన్నులను మండలంలోని అమ్మపాలెం గ్రామంలో మంగళవారం ఆమె పరిశీలించారు. గ్రామంలో ఎంత మంది రైతులు ఉన్నారు.. ఎన్ని పట్టాలు.. చెక్కులు ఎన్ని ఇచ్చారని రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొందరికి చెక్కులు ఇవ్వనట్లుగా రికార్డుల్లో నమోదు చేయగా.. దానిపై కారణాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎన్ఆర్ఐ రైతుల వివరాలపై ఆరా తీశారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు వారికి పట్టాలు పంపిణీ చేయాలన్నారు. అనంతరం ఆమె రైతులతో మాట్లాడారు. గ్రామంలో అసైన్డ్ భూమి కొనుగోలు చేసి అనుభవదారులుగా ఉంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని పలువురు రైతులు కోరారు. జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వకూడదని నిర్ణయించామని కలెక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ భూములను అలాగే ఉంచామన్నారు. ఆ భూములకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం ఆమె ఉపాధిహామీ పథకం గురించి రైతులకు వివరించారు. పొలాల్లో నీటి గుంటలు తీసుకోవాలని, పాడైపోయిన బోర్లు బాగు చేయించుకోవడానికి ఈజీఎస్‌లో రూ.20వేల వరకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఉపాధిహామీ పథకం కింద బావి పూడిక కూడా తీయించుకోవచ్చన్నారు. అయితే దీని గురించి ఈజీఎస్ సిబ్బంది తమకు చెప్పలేదని రైతులు ఆమె దృష్టికి తెచ్చారు. ఆవులు, మేకలు, గొర్రెలు ఉన్న వారికి షెడ్ల నిర్మాణానికి రూ.55వేలు ఇస్తామన్నారు. శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.10లక్షలు ఇస్తామన్నారు. మూడున్నర ఎకరాల గ్రామకంఠం భూమి గ్రామంలో ఉందని, దానిని శ్మశాన వాటిక కోసం కేటాయించాలని స్థానికులు కోరగా.. పరిశీలిస్తానని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ టి.పూర్ణచంద్ర, డీపీఓ శ్రీనివాసరెడ్డి, డీఆర్డీఓ ఇందుమతి, తహసీల్దార్ ఎం.శైలజ, ఎంపీడీఓ పి.శ్రీనివాసరావు, సర్పంచ్ జ్యోతి, జెడ్పీటీసీ సభ్యుడు సోమ్లా, ఈఓపీఆర్డీ కె.జమలారెడ్డి, ఏఓ టి.అరుణజ్యోతి, ఏపీఓ సరిత, ఆర్ఐ కొండలరావు, వీఆర్ఓ ఎస్.రామారావు, ఏఈఓ జగదీష్ పాల్గొన్నారు. ‘పెట్టుబడి’కే వినియోగించాలి.. చింతకాని : రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందజేసిన పెట్టుబడి సాయాన్ని ఇతర ఖర్చులకు కాకుండా వ్యవసాయానికే వినియోగించుకోవాలని నీతూ ప్రసాద్ తెలిపారు. చినమండవ, లచ్చగూడెం గ్రామాల్లో రైతుబంధు పథకం అమలు తీరును పరిశీలించారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో ఫొటోలు, పేర్లు, విస్తీర్ణాలు, ఆధార్ నంబర్లు, కులం పేర్లు తప్పుగా నమోదయ్యాయని కొంతమంది రైతులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. తమకు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదని మరికొందరు చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని, ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు. పాసుపుస్తకాల్లో దొర్లిన తప్పులను వెంటనే సరిచేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం చినమండవ, లచ్చగూడెం గ్రామాల్లో ఉపాధి కూలీలతో మాట్లాడి పనులపై ఆరా తీశారు. పనిచేసినా వేతనాలు రావటం లేదని కొంతమంది కూలీలు తెలిపారు. వేతనాలు రాని కూలీల వివరాలను పంపిస్తే వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఇందుమతి, స్థానిక తహసీల్దార్ కారుమంచి శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎండీ నవాబ్‌పాషా, ఏఓ కాసర అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు పేదల దరిచేరేలా చూస్తా
-పీఆర్అండ్ఆర్డీ నూతన డెరైక్టర్ - బాధ్యతలు స్వీకరించిన నీతూకుమారి ప్రసాద్ సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను చిట్టచివరి లబ్దిదారునికి కూడా సకాలంలో అందించేందుకు కృషి చేస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డెరైక్టర్ నీతూకుమారి ప్రసాద్ అన్నారు. పీఆర్అండ్ఆర్డీ విభాగానికి నూతన డెరైక్టర్‌గా సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. పీఆర్అండ్ఆర్డీతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ(టీసీపార్డ్)లకు సీఈవోగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం నీతూప్రసాద్ కే అప్పగించింది. నూతన బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ఆమెసాక్షి’తో మాట్లాడుతూ.. సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమన్వయంగా ముందుకు తీసికెళ్లేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను మంచి అవకాశంగా భావిస్తున్నానన్నారు. ప్రధానంగా.. ఇటీవల జిల్లాల పునర్విభజన ప్రక్రియతో ఏర్పడిన కొత్త జిల్లాల్లో శాఖాపరమైన సమస్యలున్నాయని, వాటి పరిష్కారంపై ముందుగా దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ సరిపడినంత సిబ్బంది లేకపోవడం, డీఆర్డీఏలో డ్వామా సంస్థను విలీనం చేసి ఆయా జిల్లాల ప్రాజెక్ట్ డెరైక్టర్లను డీఆర్డీవోలుగా నియమించడం, వారికి వేతనాలు ఏ పద్దు నుంచి చెల్లించాలనే అంశంపై స్పష్టత లేకపోవడం.. వంటి సమస్యలు ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే ఆయా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అలాగే, సెర్ప్‌లో పనిచేస్తున్న సుమారు 4వేల మంది ఉద్యోగులకు రెండు నెలలుగా వేతన సవరణ బకాయిలు అందలేదని, రెండు మూడ్రోజుల్లో వారి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఉపాధిహామీ పనులు మెరుగ్గా జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి కేటాయించిన మొత్తం పనిదినాలు డిసెంబరులోగానే ఖర్చుకానున్నాయన్నారు. అదనపు పనిదినాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయని, వీలైనన్ని ఎక్కువ పనిదినాలు మంజూరయ్యేలా కృషిచేస్తానని నీతూ ప్రసాద్ చెప్పారు. దాదాపు 36లక్షలమంది ఆసరా పథకం లబ్దిదారులకు సకాలంలో పింఛన్ అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతానన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఇతర విభాగాలు కూడా తనవద్దే ఉన్నందున అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సమన్వయం లేమికి అవకాశం ఉండదన్నారు. మొత్తంగా గ్రామ పంచాయతీ వ్యవస్థలన్నింటినీ బలోపేతం చేసేందుకు కృషిచేస్తానన్నారు. నిస్తేజంగా ఉన్నచోట దూకుడుగా వ్యవహరిస్తానని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. -
సాక్షరభారత్ అవార్డుకు వీర్నపల్లి
కలెక్టర్ నీతూప్రసాద్ కరీంనగర్/ఎల్లారెడ్డిపేట: వందశాతం అక్షరాస్యత సాధించిన ఎంపీ వినోద్‌కుమార్ దత్తత గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి సాక్షరభారత్ అవార్డుకు ఎంపికైందని కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అవార్డును ఈనెల 8న న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో భారత రాష్ట్రపతి అందజేస్తారని వివరించారు. వీర్నపల్లిలో 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు కృషిచేసిన వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు, గ్రామప్రత్యేకాధికారి, డిప్యూటీ సీఈవో, సంబంధిత జిల్లా అధికారులు, సిరిసిల్ల రెవెన్యూ డివిజనల్ అధికారి, గ్రామ, మండల అధికారులు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. సాక్షరభారత్ అవార్డు రావడం జిల్లాకు గర్వకారణం అని, దీనిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని ఇతర అన్ని గ్రామాలు 100 శాతం అక్షరాస్యత సాధించుటకు పోటీతత్వంతో కషి చేయాలని పిలుపునిచ్చారు. అవార్డు రావడంపై ఎంపీడీవో చిరంజీవి, జెడ్పీటీసీ తోట ఆగయ్య, ఎంపీపీ ఎలుసాని సుజాత, ఏఎంసీ చైర్మన్ అందె సుభాష్, సర్పంచ్ మాడ్గుల సంజీవలక్ష్మి, ఎంసీవో మాడ్గుల రాజంయాదవ్ హర్షం వ్యక్తంచేశారు. -
జియోట్యాంగింగ్ చేయాలి
ముకరంపుర : హరితహారంలో భాగంగా వివిధ శాఖల ద్వారా జిల్లావ్యాప్తంగా నాటిన మొక్కలన్నింటికీ వెంటనే జియోట్యాగింగ్ చేయాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో హరితహారంపై సమీక్షించారు. నాటిన మొక్కలన్నింటికీ రిజిస్టర్ చేయాలని, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. మొక్కలను స్మార్ట్‌ఫోన్ ద్వారా ఫొటో తీసి జియోట్యాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్ విధానంపై బుధవారం సాయంత్రం 4 గంటలకు శిక్షణ ఏర్పాటు చేస్తున్నామని, అన్ని శాఖల అధికారులు తమ కంప్యూటర్ ఆపరేటర్‌ను శిక్షణకు పంపించాలని ఆదేశించారు. -
140 గ్రామాల్లో వందశాతం హరితహారం
కలెక్టర్ నీతూ ప్రసాద్ ముకరంపుర: జిల్లాలో 1207 గ్రామ పంచాయతీలకు గాను 140 గ్రామ పంచాయతీలలో వంద శాతం మొక్కలు నాటినట్లు కలెక్టర్ నీతూప్రసాద్ వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలంగాణకు హరితహారం ప్రగతిపై కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో వంద శాతం మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 2.86 కోట్ల మొక్కలను నాటామని, వాటి సంరక్షణకు ఫెన్సింగ్, వాటరింగ్ వంటివి సమకూర్చి మొక్కల పెంపుదలకు పటిష్ట ప్రణాళికలు చేపడుతామన్నారు. 2 లక్షల మొక్కలు గ్యాప్ ఫిల్లింగ్ నాటినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో మండల, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు 17 లక్షల మొక్కలు ఆకస్మికంగా తనిఖీ చేసారని వివరించారు. నాటిన మొక్కల వివరాలను అటవీశాఖ వెబ్సైట్లో పొందుపరుస్తున్నామన్నారు. 1.45 కోట్ల పండ్లు, యూకలిప్టస్ తదితర మొక్కల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వగా ఇప్పటివరకు 17 లక్షల మొక్కలు పంపిణీ చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది 5.20 కోట్ల మొక్కలను నర్సరీల్లో పెంచుటకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్పీ జోయెల్ డేవిస్, ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్ తదితరులున్నారు. హరితహారం, వంద శాతం, కలెక్టర్ నీతూ ప్రసాద్, harithaharm, 100% in 140 villages, collector neetu prasad -
థాంక్యూ మేడమ్
చదువు ఒక ఒడ్డున... ఉద్యోగం ఇంకో ఒడ్డున... యువతకు నిరుద్యోగమన్న భవసాగరాన్ని దాటించే ప్రయత్నమే నీతూ ప్రసాద్ ఐఏఎస్ కట్టిన వారధి. కలెక్టర్‌గా బాధ్యతలను, విధులను నెరవేరిస్తే మంచి కలెక్టర్ అనిపించుకునేవారు. అంతకుమించి చేస్తున్నారు కాబట్టే మంచి మనిషి అనిపించుకుంటున్నారు. కరీంనగర్ యువత ప్రతిరోజూ ఆమెను మనస్ఫూర్తిగా థాంక్యూ మేడమ్ అని తలచుకుంటున్నారు. ఐఏఎస్ కావాలనేది నీతూ చిన్నప్పటి కల. తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీర్, ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఎంత క్రేజో బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐఏఎస్‌కు అంత మోజు. స్కూల్లో ఎవరైనా బాగా చదివితే కలెక్టర్ అవుతావని ప్రోత్సహిస్తారు. అలాగే పాఠశాల విద్య నుంచే చాలా చురుకుగా ఉన్న నీతూను టీచర్లు, బంధువులు కలెక్టర్ అవుతావు అనేవాళ్లట. ఆ మాటను నిజం చేసుకోవడానికి కష్టపడుతూ వచ్చింది. టెన్త్ వరకు ఒక ఎత్తయితే ఇంటర్ నుంచి మరో ఎత్తు. ఇంటర్లో ఉన్నప్పుడే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. నీతూను మైగ్రేన్ తీవ్రంగా బాధించింది. ఒక దశలో పుస్తకం తెరవడం కూడా దుర్భరమై ఐఏఎస్ అనే తన లక్ష్యాన్ని చేరుకోలేనేమోనని కలత చెందింది.ఆ పరిస్థితుల్లో మహాభారతంలోని అర్జునుడు స్ఫూర్తిగా నిలిస్తే తండ్రి పోత్సాహాన్నిచ్చాడు. అలా 2001లో సివిల్స్‌కి ఎంపికై శిక్షణ పూర్తిచేసుకొని భద్రాచలం సబ్‌కలెక్టర్‌గా తొలి పోస్టింగ్‌తో తెలుగురాష్ట్రాల్లో బాధ్యతలు చేపట్టింది. ఏ పోస్టులో ఉన్నా ఆ పోస్టులో ఒదిగిపోయి అంకితభావంతో పనిచేయడం నేర్చుకుంది. ఏ పోస్ట్‌లో ఉన్నా దానికి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడమే ఆమెకు ప్రధానం. సేవకు కొత్తమార్గాలు.. సాధారణంగా ఏ ఐఏఎస్ అయినా తొలుత జిల్లా కలెక్టర్లుగా చేసి ఆ తర్వాత వివిధ శాఖల్లోకి వెళ్లాలనుకుంటారు. కానీ నీతూప్రసాద్ మాత్రం అందుకు భిన్నం. ఆమె మొదట వివిధ శాఖల్లో పనిచేశాక కలెక్టర్‌గా వెళ్లింది. ‘అలా ఆయా శాఖల్లో పని చేయడం వల్ల ఆ పాలనా అనుభవం కలెక్టర్ అయ్యాక చాలా హెల్ప్ అయింది’ అంటారామె. ఆ అనుభవం ఆమెకు ఒకటి అర్థం చేయించింది. అదేమిటంటే చాలా మందికి ప్రభుత్వ ఉపాధి అందటం లేదు. ఉద్యోగికీ ఉపాధికీ మధ్య చాలా అడ్డంకులున్నాయి. వాటిని తీసి వేసి నేరుగా ఉపాధి అందించాలి అని అనుకున్నారామె. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యత తీసుకోగానే అలా వికాస్ సొసైటీకి నాంది పలికారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా వారధి అనే సొసైటీకి ప్రాణం పోశారు. ఇది ప్రస్తుతం ఎందరో నిరుద్యోగులకు ఉపాధి మార్గాలను చూపుతోంది. ఈ రెండు సొసైటీలు ఆమె బ్రెయిన్ చిల్డ్రన్! ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు చెక్ ఔట్‌సోర్సింగ్‌లో ప్రైవేట్ ఏజెన్సీలకు చెక్‌పెట్టాలనే సదుద్దేశంతో కరీంనగర్ జిల్లాలో ‘వారధి’ అనే సొసైటీని ప్రారంభించింది నీతూ ప్రసాద్. ఇది ఆమె వ్యక్తిగత శ్రద్ధకు ప్రతిరూపం. తొమ్మిదినెలల కిందట మొదలైన వారధి దాదాపు 4 వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. మరోమూడు వేల మంది యువతకు వివిధ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణనిచ్చింది. ఇప్పటి వరకు సుమారు 25 వేల మంది నిరుద్యోగులు వారధిలో దరఖాస్తు చేసుకున్నారంటే ఈ సొసైటీ పట్ల యువతకున్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రతియేటా ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వహణ కోసం ప్రభుత్వం విడుదల చేసే 3 శాతం కమీషన్ సొమ్ముతోనే వారధి సొసైటీలోని ఉద్యోగులకు జీతాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కల్పించే ఉద్యోగాలన్నింటినీ వారధి ద్వారానే చేపడుతుండడంతో అర్హులైన వారికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఈ ఏడాది సెస్టెంబర్ 10న వారధి ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో జాబ్‌మేళాలో 30 కంపెనీలు 2801 మంది నిరుద్యోగులకు వివిధ ఉద్యోగాలను కల్పించాయి. గ్రూప్-1, 2, 3తోపాటు బ్యాంకింగ్ రంగంలోని ఉద్యోగాల కోసం యువతకు ఈ సొసైటీ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఇప్పటికే సుమారు రెండువేల మంది ఈ సొసైటీ ద్వారా ఆయా ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ పొందారు. వారధి సొసైటీ వద్ద దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ మొదలు ఐటీఐ, పీజీ కోర్సులు, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చేసినవారూ ఉన్నారు. వీరి అర్హతలకు తగినట్లుగా ప్రభుత్వ, ప్రై వేటు కొలువులు సాధించేందుకు వీలుగా నిష్ణాతులైన ఫ్యాకల్టీలచే ఉచిత బోధనను అందిస్తున్నారు. మెట్రో నగరాల్లో పేరుగాంచిన ప్రై వేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా వారధి ఉండడం విశేషమే కాదు నీతూప్రసాద్ కృషికి తార్కాణం కూడా! - పసునూరు మధు, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ కలెక్టర్ పోస్టు అనేది చాలా బాధ్యాతాయుతమైంది. ఎన్ని విపత్తులు ఎదురైనా అధిగమించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయడమే నా ప్రధాన బాధ్యత. ఆరోగ్యం, విద్య అనేవి ఏ కలెక్టర్‌కైనా పునాదులే. ఈ రెండింటినీ వృత్తికి అతీతంగా కూడా నిర్వహించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాకు ఎన్నో పథకాలు, ప్రాజెక్టులు మంజూరు చేసింది. రోడ్లకు వందల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇవిగాక ఎన్నో ప్రాజెక్టు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ నిర్ణీత సమయంలోగా పూర్తి చేయడం నా ముందున్న లక్ష్యం. సకాలంలో పనులు పూర్తయితేనే మంచి ఫలితాలు వస్తాయి. - నీతూప్రసాద్ వారధిలో మొదటి ఉద్యోగి వారధి కండక్ట్ చేసిన ఫస్ట్ ఇంటర్వ్యూలో ఫస్ట్ ఉద్యోగిని నేనే. వారధి మేనేజర్‌గా నాకు జాబ్ దొరికింది. అంకితభావంతో పనిచేస్తున్నానని కలెక్టరమ్మ మెచ్చుకున్నారు. - విష్ణువర్ధన్ కొండంత ధైర్యం .. మేం ముగ్గురం ఆడపిల్లలమే. నేను మూడో అమ్మాయిని. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది. ప్రజావాణి ద్వారా కలెక్టర్‌ను కలిసి ఉద్యోగం కోసం రిక్వెస్ట్ చేస్తే వెంటనే స్పందించి వారధి ద్వారా కేజీబీవీలో అటెండర్ ఉద్యోగం ఇప్పించారు. ఈ ఉద్యోగం నాకు జీతాన్నే కాదు కొండంత ధైర్యాన్నీ ఇచ్చింది. - నిరోష ఆధారం చూపారు.. నాకు భర్త లేడు. ముగ్గురు పిల్లలు. అమ్మాన్నా, అత్తామామా ఎవరూ పట్టించుకోరు. కలెక్టరమ్మను వేడుకుంటే దారి చూపింది. వారధి ద్వారా నాకు ఉద్యోగమిప్పించింది. ఎస్టీ స్టడీ సర్కిల్లో అటెండర్పోస్టులో పెట్టించింది. కలెక్టరమ్మను మరువను. - గాలిపెల్లి స్వరూప కూతుర్ని చదివించుకుంటా నా భర్త విడాకులిచ్చాడు. ఒక కూతురు, కష్టపడి చదివించే సమయంలో భర్త దూరమవడంతో పోషణే భారమయ్యింది. బీటెక్ చదువుతున్న కూతురు చదువును మధ్యలోనే ఆపించేయాల్సిన పరిస్థితి వచ్చింది. కలెక్టరమ్మను కలుసుకుని నా గోడు చెప్పుకున్న. వారధి ద్వారా కేజీబీవీ మల్లారంలో కొలువునిచ్చి దేవతగా నిలిచింది. - భూక్య సమ్మక్క -
కోల్డ్‌వార్
సాంబమూర్తినగర్ (కాకినాడ) :ప్రభుత్వ శాఖల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు పర్యవేక్షకులుగా తహశీల్దార్లు, ఎంపీడీఓలను నియమిస్తూ ఇటీవల కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులను వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఉత్తర్వులను నిరసిస్తూ విధులు బహిష్కరించారు. రవిచంద్ర కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో కొంతమంది వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారని, నీతూ ప్రసాద్ ఏ శాఖలోనూ అమలు చేయని బయోమెట్రిక్ విధానాన్ని వైద్య శాఖలోనే అమలు చేశారని ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఎవరు కలెక్టర్‌గా పనిచేసినా వైద్య ఉద్యోగులను దొంగలుగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పవర్ మొత్తాన్ని ఐటీడీఏ పీఓకు బదలాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కూడా వారు తప్పుబడుతున్నారు. ఒక పక్క సొంత శాఖ లోని అధికారుల ఒత్తిడి, మరో పక్క ఇతర శాఖల అధికారుల పెత్తనం వల్ల తాము మానసిక వేదనకు గురవుతున్నామని పేర్కొంటున్నారు. అయితే రెవెన్యూ శాఖ వాదన మరోలా ఉంది. వైద్య, ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విపత్కర పరిణామాలు సంభవిస్తున్నాయని, అయితే వైద్య, ఆరోగ్య శాఖ మరో భాగమేమీ కాదని ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు అన్ని శాఖలూ కలిసే ఉండేవని, ఆయన వచ్చిన తర్వాత మెరుగైన వైద్య సేవల నిమిత్తం వైద్య శాఖను వేరుచేశారని చెబుతున్నారు. తాము వైద్య ఉద్యోగులపై పెత్తనం చలాయించేదేమీ లేదని, వారి పనితీరు మెరుగుపరిచేందుకు పర్యవేక్షకులుగా మాత్రమే వ్యవహరిస్తున్నామని పేర్కొంటున్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలు, ఇతర వ్యాధులు ప్రబలి అత్యవసర పరిస్థితులు ఏర్పడడానికి క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, కలెక్టర్ వారిపై పర్యవేక్షకులుగా రెవెన్యూ అధికారులను నియమించారని చెబుతున్నారు. అయితే దీనిని వైద్య ఉద్యోగులు వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సావిత్రమ్మకు వినతిపత్రం అందజేశారు. పది రోజుల్లోగా తమ డిమాండ్లపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని, లేకుంటే విధులు బహిష్కరించి వివిధ రూపాల్లో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఆరోగ్యశాఖ ప్రధాన డిమాండ్లివే... ఇతర శాఖల పెత్తనంతో కూడిన ప్రత్యేకాధికారి నియామక ఉత్తర్వులు రద్దు చేయాలి. పర్యవేక్షణకు వైద్య శాఖ అధికారులను మాత్రమే నియమించాలి. బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలి. వైద్య సిబ్బందిని బహిరంగంగా విమర్శించే విధానాన్ని విడనాడాలి. సిబ్బంది గౌరవం పెంచేలా చర్యలు చేపట్టాలి. అనవసరపు మీటింగ్‌లు, కాన్ఫరెన్స్‌లకు స్వస్తి పలకాలి. జాబ్‌చార్ట్ విధానాన్ని మాత్రమే కొనసాగించాలి. ఆధార్ సీడింగ్ నిమిత్తం వైద్య సిబ్బందిని బ్యాంకుల చుట్టూ తిప్పే విధానాన్ని విడనాడాలి. ఏజెన్సీలో అడిషనల్ డీఎంహెచ్‌ఓకే అధికారాలు కల్పించాలి. -
‘ఆదర్శం’వైపు అడుగులు
సంసద్ ఆదర్శ యోజన పథకం కింద ఎంపికైన ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి గ్రామం ఆదర్శం వైపు అడుగులు వేస్తోంది. ఈ గ్రామాన్ని ప్రధానంగా పట్టి పీడిస్తున్న మద్యం మహమ్మారిని పారద్రోలే పనిలో పడ్డారు. ఇప్పటికే సారా తయారీకి స్వస్తి చెప్పిన గ్రామస్తులు, ఊర్లో ఉన్న రెండు బెల్టు దుకాణాలనూ మూసేశారు. ప్రభుత్వ నిధులు విడుదల చేసినంత మాత్రానే అభివృద్ధి సాధ్యం కాదని, చేయీ చేయీ కలిపితేనే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలమనే భావనకు వచ్చి పారిశుధ్యం, అక్షరాస్యత, మద్యనిషేధం, తాగునీటి వసతి కార్యక్రమాల అమలుకోసం ఏకమై ముందుకు సాగుతున్నారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి స్ఫూర్తిగా ఎనిమిది కమిటీలుగా ఏర్పడి ఆయా అంశాల అమలుకు కృషి చేస్తున్నారు. తన కోటా నిధులతో ఎంపీ బి.వినోద్‌కుమార్ పర్యవేక్షణ, కలెక్టర్ నీతూప్రసాద్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం కలిసి ఈ గ్రామ రూపురేఖలు మార్చే పనిలో పడ్డారు. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ /ఎల్లారెడ్డిపేట -
కొత్తకొత్తగా..!
‘తూర్పు’న నూతన సంవత్సరం పొద్దు పొడిచిన తరువాత.. జిల్లాలో పాలన కొత్తకొత్తగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్ల అధికార యంత్రాంగంలో కీలకమైన నలుగురు అధికారులు కొత్త సంవత్సరంలో బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తుండడమే ఇందుకు కారణం. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదనపు జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులుగా ప్రస్తుతం పనిచేస్తున్న నలుగురు అధికారులూ త్వరలో బదిలీ అవడం ఖాయమని అధికారవర్గాలు చెప్పుకొంటున్నాయి. వీరి స్థానంలో కొత్తవారు వస్తే.. పాలన కూడా కాస్త కొత్తగా సాగవచ్చని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :కొత్త సంవత్సరంలో కొత్తగా వచ్చే అధికారులకోసం జిల్లా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రాష్ర్ట విభజన నేపథ్యంలో అఖిల భారత సర్వీసుల అధికారుల కేటాయింపులో భాగంగా జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలంగాణకు బదిలీ కావడం అనివార్యమైంది. అధికారుల సహాయ సహకారాలతో విజయవంతంగా పని చేయగలిగానని కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌సెల్‌లో అధికారులను కృతజ్ఞతలు తెలిపిన ఆమె.. తెలంగాణకు వెళ్లిపోతున్న విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. రెండున్నరేళ్లు పైగా ఇక్కడ పని చేసిన ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ బుధ, గురువారాల్లో గెజిట్ వెలువడే అవకాశం ఉంది. ఆ వెంటనే ఆమె నీతూప్రసాద్ రిలీవ్ అవుతారని అధికార వర్గాల సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. ఆమె తరువాత కలెక్టర్‌గా ఎవరు వస్తారనేది జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ముమ్మరంగా ఆశావహుల యత్నాలు పెద్ద జిల్లా కావడం, భౌగోళికంగా మెట్ట, మైదానం, డెల్టా, ఏజెన్సీ.. ఇలా అన్ని ప్రాంతాలూ కలిసి ఉండటంతో ఐఏఎస్ అధికారులు తమ పదవీ కాలంలో ఒక్కసారైనా ఇక్కడ కలెక్టర్‌గా పని చేయడానికి ఆసక్తి చూపిస్తారు. నీతూప్రసాద్ బదిలీ అవుతారన్న వార్తలు వస్తున్న క్రమంలోనే ఇక్కడకు వచ్చేందుకు ఆశావహులు ప్రయత్నాలను వేగవంతం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్ బదిలీలప్పుడు నీతూ ప్రసాద్ స్థానంలో టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు వస్తారనే ప్రచారం జరిగింది. ఆయనది చిత్తూరు జిల్లా కావడంతో అదే జిల్లాకు చెందిన అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులు ఆయనకు ఉంటాయని బలమైన ప్రచారం నడిచింది. ఇప్పుడు కూడా కలెక్టర్ రేసులో ఆయన ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మరో ఏడు నెలల్లో రానున్న గోదావరి పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వివాదరహితుడనే పేరున్న శ్రీనివాసరాజువైపే ప్రభుత్వం మొగ్గు చూపుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.అయితే శ్రీనివాసరాజుతో పాటు మరో ముగ్గురి పేర్లు కూడా తాజాగా తెరపైకి వచ్చాయి. వారిలో సెర్ప్ సీఈఓ అరుణ్‌కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఆయన కాకినాడ ఆర్డీఓ, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, రాజమండ్రి కమిషనర్‌గా పని చేశారు. ఈ పూర్వ అనుభవం పుష్కరాలకు ఉపయోగపడుతుందనే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఆయన విజయనగరంలో పని చేసిన సమయంలో అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్ కోన శశిధర్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అరుణ్‌కుమార్ రావాల్సి ఉంది. అయితే ఆయనది, అప్పటి కలెక్టర్ రవిచంద్రది శ్రీకాకుళం జిల్లాయే కావడంతో అరుణ్‌కుమార్ రాకకు బ్రేకులు పడ్డాయి. రిటైర్డ్ డీజీపీ హెచ్‌జే దొరకు బంధువు కావడంతో ఈసారి అరుణ్‌కుమార్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. వీరితోపాటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన రోనాల్డ్ రాజ్ పేరు కూడా ప్రచారంలో ఉంది. ఆయన గతంలో ఇక్కడ ఐటీడీఏ పీఓగా పని చేశారు. సామాజిక సమతూకాల్లో ఎంతవరకూ ఆయనకు కలిసిస్తుందనేది వేచి చూడాల్సిందే. మరో ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఆయనది జిల్లాలోని దుగ్గుదూరు కావడంతో ఆ అవకాశం లేదని కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద కలెక్టర్‌గా ఎవరు వస్తారనేది అస్పష్టంగానే ఉన్నా, ఒకింత మొగ్గు శ్రీనివాసరాజువైపే కనిపిస్తోంది. జేసీ బదిలీపైనా ప్రచారం.. మరోపక్క జాయింట్ కలెక్టర్ రేవు ముత్యాలరాజు కూడా బదిలీ కానున్నారన్న ప్రచారం జోరందుకుంది. ముత్యాలరాజు 2013 జూలైలో జేసీగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ముక్కుసూటి అధికారిగా పేరున్న ఆయన.. బదిలీ అంటూ జరిగితే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వైపు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఆయన స్థానంలో కన్ఫర్డ్ ఐఏఎస్ జె.సత్యనారాయణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సత్యనారాయణయ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దాపురం ఆర్డీఓ, జెడ్పీ సీఈఓ.. ఇలా పలు హోదాల్లో ఇక్కడ పని చేశారు. ఈ క్రమంలో జిల్లాలో అధికార పార్టీ కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల తరువాత జిల్లా రెవెన్యూ అధికారి యాదగిరి కూడా బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా డీఆర్ఓ ఉంటారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈయనే ఏఆర్‌ఓగా పని చేశారు. దీంతో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలనాటికి యాదగిరి బదిలీ అనివార్యమంటున్నారు. బదిలీ అవుతారని ప్రచారం ఉన్న మరో అధికారి జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు. ఆయన రాజధాని భూ సేకరణ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కమిటీలో భూ సేకరణ అధికారిగా వెళతారనే ప్రచారం ఉంది. ఇప్పటికే ఆయన రాజధాని భూ సేకరణపై హైదరాబాద్‌లో జరుగుతున్న శిక్షణలో ఉన్నారు. శిక్షణ అనంతరం భూ సేకరణ విభాగానికి బదిలీ చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఈ విధంగా జిల్లా పాలనలో కీలకమైన నలుగురు అధికారుల బదిలీ, ఆ పోస్టింగ్‌లలో కొత్తవారి రాకపై జిల్లాలో ఆసక్తి రేగుతోంది. -
నీతూప్రసాద్ రూటెటు?
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అఖిలభారత సర్వీసు అధికారుల విభజనకు ప్రధాని బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఇక్కడ కొనసాగుతారా లేదా అనే విషయమై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం నుంచి గురు, శుక్రవారాల్లో వచ్చే సీల్డ్కవర్పైనే దీనిపై స్పష్టత వస్తుందని కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గురువారం సీల్డ్‌కవర్ వచ్చినా క్రిస్మస్ సెలవు కావడంతో శుక్రవారమే విషయం వెల్లడి కానుంది. విభజన అనంతర పరిణామాల్లో కలెక్టర్ నీతూప్రసాద్ తెలంగాణ ప్రాంతానికి ఆప్షన్ ఇచ్చారు. ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఏపీఎస్పీ కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్న ఆమె భర్త రాజేష్‌కుమార్ గుంటూరు అర్బన్ ఎస్పీగా బదిలీ అయ్యారు. అఖిలభారత సర్వీసు అధికారుల విషయం కేంద్రప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో ఆరు నెలలుగా కలెక్టర్ బదిలీ విషయం తేలలేదు. ఇపుడు అఖిలభారత సర్వీసు అధికారుల విభజనకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో నీతూప్రసాద్ జిల్లాలో కొనసాగేది లేనిదీ మరో 24 గంటల్లోపు తేలిపోనుంది. తెలంగాణాకు మొదట్లో ఆప్షన్ ఇచ్చినప్పటికీ, భర్త గుంటూరులో పనిచేస్తుండటం, ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలు దగ్గరపడడం వంటి పరిణామాల నేపథ్యంలో నీతూప్రసాద్ తెలంగాణకు వెళ్లే విషయమై పునరాలోచనలో పడ్డారని చెప్పుకుంటున్నారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి యనమల ఆమెను ఇక్కడే కొనసాగాలని ఇప్పటికే కోరారు. అయితే ఇప్పుడు కేంద్రం విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆమె అటా, ఇటా అనే దానిపై ఒక నిర్ణయం వెలువడే సమయం ఆసన్నమైంది. 2012 ఫిబ్రవరి 25న జిల్లా కలెక్టర్‌గా నీతూప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత కొద్దిరోజులకే ఆమె భర్త రాజేష్‌కుమార్ కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ గా వచ్చారు. విజయవాడ- గుంటూరు మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేయనున్న తరుణంలో కీలకమైన గుంటూరు అర్బన్ ఎస్పీ పోస్టుకి ఆయన బదిలీ అయ్యారు. దీంతో ఆయన ఆంధ్రాలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలియవచ్చింది. మరోవైపు పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో కొత్త అధికారులను తీసుకువస్తే వారు అలవాటు పడేందుకు చాలా సమయం పడుతుందని..ఈలోగా పుణ్యకాలం గడిచిపోతుందని ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు ఉన్నారంటున్నారు. అందుకే నీతూప్రసాద్నే పుష్కరాల వరకూ కలెక్టర్‌గా కొనసాగిస్తారని ప్రచారం జరిగింది. కానీ తెలంగాణకు వెళ్లేందుకు ఎంచుకున్న ఆప్షన్‌ను కేంద్రం యథాతథంగా ఆమోదిస్తే పరిస్థితి ఏమిటనే విషయమై ఆసక్తి నెలకొంది. ఆమెకు వెంటనే కలెక్టర్‌గా అక్కడ అవకాశం దక్కుతుందా లేదా? అక్కడకు వెళితే పదోన్నతులు త్వరగా వస్తాయా...ఇత్యాది విషయాలపై తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. కనీసం పుష్కరాల వరకు ఆమె కొనసాగుతారా? ఈలోపే జిల్లా నుంచి బదిలీ అవుతారా అనే ఆసక్తి నేపథ్యంలో అసలు సీల్డ్కవర్లో ఏముందనే అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. -
ఘాట్లు చూడకుండా కళ్లు మూసుకున్నారా..
సాక్షి, రాజమండ్రి : ‘పుష్కరాలకు సంబంధించి ఆరేడు సమావేశాలయ్యాయి. ఇంతవరకూ ఘాట్లు చూడకుండా కళ్లు మూసుకున్నారా?’.. ఇరిగేషన్ అధికారులపై కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆగ్రహం ఇది. పుష్కర సన్నాహాలపై వివిధ శాఖల సవరించిన ప్రతిపాదనలను స్వీకరించేందుకు శుక్రవారం ఆమె రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రతిపాదనలు ఇచ్చేందుకు మరో వారం గడువు కావాలని ఇరిగేషన్ అధికారులు కోరడంతో కలెక్టర్ మండిపడ్డారు. ‘మీ ఎస్ఈ ఎక్కడ? ముఖ్యమైన సమావేశమన్నా వేరే క్యాంపులేంటి?’ అని అసహనం వ్యక్తం చేశారు. వరదల కారణంగా ఘాట్లు పరిశీలించలేక పోయామనడంతో ‘వరదలు ఇప్పుడొచ్చాయి. అంతకు ముందు ఏం చేస్తున్నారు?’ అని నిలదీశారు. వారి అలసత్వం వల్ల ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు సంజాయిషీ చెప్పుకోవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతోందన్నారు. రాత్రింబవళ్లు పనిచేసైనా సోమవారంలోగా నివేదికలు అందించాలని ఆదేశించారు. -
‘ముంపు’ పాలనకు కార్యాచరణ
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాలపై పూర్తిస్థాయిలో పాలన సాగించేందుకు ఉభయ గోదావరి జిల్లాల అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగానే తూర్పుగోదావరిలో కలిపిన నెల్లిపాక (భద్రాచలం రూరల్), కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు చెందిన అన్ని శాఖల అధికారులతో గురువారం ఆ జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి తగిన నివేదికలతో రావాల్సిందిగా నాలుగు మండలాల అధికారులకు ఉత్తర్వులు పంపారు. భద్రాచలం సబ్ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవమున్న నీతూప్రసాద్‌కు ఈ ప్రాంత సమస్యలు, గిరిజనుల ఇబ్బందులపై అవగాహన ఉంది. అక్టోబర్ 2 నుంచి ముంపు మండలాల్లో పూర్తి స్థాయిలో పాలన సాగించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలోనే ఉభయ గోదావరి జిల్లాల అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పర్యటించారు. అధికారులు లేకుండా పాలన ఎలా..?! తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో పాలనాపరంగా ఇబ్బంది లేకన్నా, నెల్లిపాక మండలంపై ఇంకా స్పష్టత రాలేదు. భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మిగతా మండలమంతా బదలాయించి, దీనికి నెల్లిపాక మండల కేంద్రంగా ప్రకటించారు. కానీ, ఇంతవరకూ అక్కడ కార్యాలయాలు తెరవలేదు. మండల అధికారులు కూడా లేరు. భద్రాచలం పట్టణంలోని మండల అధికారులంతా నెల్లిపాక మండలంతో తమకు సంబంధం లేదని, తాము తెలంగాణ రాష్ట్రం పరిధికి చెందినవారమని చెబుతున్నారు. కూనవరం మండలంలో ఉన్న అధికారులకు నెల్లిపాకను కూడా పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగించేందుకు తూ.గో. అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు ఇన్చార్జిలను అప్పగిస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. దీనిపై కలెక్టర్ నీతూ ప్రసాద్ దృష్టి సారించాల్సుంది. ముంపులో నిలిచిన అభివృద్ధి ముంపు మండలాల్లో అభివృద్ధి పనులను ఉన్నఫలంగా అప్పగించేందుకు ఖమ్మం జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ మండలాల్లో కొత్తగా పనులు చేసేందుకు ప్రతిపాదనలు కూడా చేయలేదు. చివరకు ఎల్‌డబ్ల్యూఈఏ పథకంక్రింద వివిధ కారణాలతో చేయలేకపోయిన పనులను రద్దు చేసిన ఇంజనీరింగ్ శాఖ అధికారులు.. వాటిని ముంపు మండలాల్లో కాకుండా జిల్లాలోని ఇతర మండలాలకు కేటాయించారు. ఫలితంగా తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన నాలుగు మండలాల్లో అభివృద్ధి నిలిపోయింది. సమస్యలపై దృష్టి సారించకపోతే కష్టమే భద్రాచలం డివిజన్లోని నాలుగు మండలాలకు చెందిన 277 రెవెన్యూ గ్రామాలు తూర్పుగోదావరి జిల్లాలో కలిసాయి. ఇందులో 38,096 ఇండ్లు వీటిలో 1,31,528 మంది జనాభా ఉంది. 1,99,825.60 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలోని భూభాగం తూ.గో. జిల్లాలో కలుస్తుంది. నాలుగు మండలాల్లో అత్యధికంగా గిరిజనులే ఉన్నారు. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో అత్యంత వెనుకబడిన గిరిజన తెగకు చెందిన కొండరెడ్లు గుట్టలపై, కొండలపై నివసిస్తున్నారు. వీరికి సరైన పౌష్టికాహారం అందటం లేదు. వైద్య సేవలు కూడా అంతంత మాత్రమే. ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితుల్లో పలువురు గర్భిణీలు ఇంకా ఇండ్ల వద్దనే ప్రసవాలు జరుగుతున్నాయి. గిరిజన గ్రామాలకు సరైన రహదారులు లేవు. వీటి పరిష్కరించేలా అధికార యంత్రాంగానికి కలెక్టర్ దిశానిర్దేశం చేయాల్సిన అవసరముంది. ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలేవీ... ముంపు మండలాల్లోని దాదాపు 80శాతం మంది తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చారు. వారంతా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ మరికొన్ని నెలలపాటు ఎక్కడి వారక్కడనే పనిచేయాలనే సంకేతాలు వస్తున్నప్పటికీ ఉభయ గోదావరి జిల్లా అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవు. ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు సాధ్యం కాదనేది వాస్తవం. ఈ విషయంపై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. -
విలీనం సంపూర్ణం
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ముంపు మండలాల విలీన ప్రక్రియ పూర్తయింది. పాల్వంచ డివిజన్లోని వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు మండలంలోని ఆరు రెవెన్యూ గ్రామాల విలీనానికి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఫైనల్ గెజిట్ జారీ చేశారు. కాగా భద్రాచలం డివిజన్లోని చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, భద్రాచలం(భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాల స్వాధీనంపై తూ.గో. కలెక్టర్ నీతూప్రసాద్ గెజిట్ జారీ చేశారు. ఈ నెల 15న జారీ చేసిన గెజిట్ ప్రతులను విలీన మండలాల తహశీల్దార్లకు బుధవారం స్వయంగా అందజేశారు. దీంతో ఇక రికార్డుల అప్పగింతల ప్రక్రియ మినహా ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలు ఇక నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లోకి సంపూర్ణంగా విలీనమైనట్లే. ఇదిలా ఉండగా విలీన మండలాల్ల్లో పాలనా వ్యవహారాలు తీసుకునేందుకు ఆయా జిల్లాల ఉన్నత స్థాయి అధికారులు పర్యటనలకు సిద్ధమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు గురువారం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పర్యటనకు వస్తున్నారు. ఆయా మండలాల్లో పర్యటించి, స్థానిక అధికారులు, ప్రజలతో మాట్లాడుతారు. కాగా, తూ.గో. జిల్లాకు చెందిన పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా గురువారం చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం రూరల్ మండలాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. అయితే మావోయిస్టు ప్రభావిత మండలాలు కావటంతో పోలీస్ అధికారుల పర్యటన వివరాలను చెప్పేందుకు అధికారులు నిరాకరించారు. కాకినాడ సమీక్షకు వెళ్లిన తహశీల్దార్లు... తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన భద్రాచలం డివిజన్లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం తహశీల్దార్లు బుధవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగిన సమీక్షకు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముంపు మండలాల సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. తూ.గో. జిల్లాలో కలిసినందుకు ఇక్కడి ప్రజలు ఎలా భావిస్తున్నారు.. మండలాల్లో చేపట్టాల్సిన ప్రాధాన్యత గల పనులు ఏమిటి.. అని ఆ జిల్లా అధికారులు తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. కాగా మరో రెండు మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ముంపు మండలాల పర్యటనకు వస్తారని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కూడా వారికి సూచించినట్లు తెలిసింది. రికార్డుల అప్పగింతకు ఆదేశం... ముంపు మండలాల్లో రెవెన్యూ రికార్డుల అప్పగింతకు సిద్ధం కావాలని తహశీల్దార్లకు తూ.గో. జిల్లా అధికారులు సూచించారు. అడంగల్, పహణీలు, ఇతర రెవెన్యూ రికార్డులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప రికార్డులను అప్పగించలేమని ముంపు మండలాల అధికారులు చెపుతున్నారు. -
వైభవంగా ‘గురు’ సంబరం
కల్చరల్(కాకినాడ) : మాజీ రాష్ట్రపతి దివంగత సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లాలో గురుపూజోత్స వాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో 224 మందికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నీతూ ప్రసాద్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, డీఈఓ కేవీ శ్రీనివాసులురెడ్డి తదితరులు సర్వేపల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 126వ జయంతిని విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి అధ్యక్షత వహించారు. పుట్టగొడుగుల్లా ప్రైవేట్ స్కూళ్లు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలల్లో సరైన ఉపాధ్యాయులు లేరని వ్యాఖ్యానించారు. రాజీవ్ విద్యామిషన్, రాజీవ్ మాధ్యమిక విద్యా అభియాన్ వంటి పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినట్టు వివరించారు. వాటికనుగుణంగా విద్యా ప్రమాణాలు కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణతలో ఈ ఏడాది రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ స్థానం రావడంపై ఆమె సంతోషం వెలిబుచ్చారు. ఉపాధ్యాయుల కృషితోనే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే ప్రాపంచిక విజ్ఞానాన్ని అందించాలని సూచించారు. విలువలతో కూడిన విద్యను అందించినపుడే విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని, తద్వారా దేశ మానవ వనరులు వృద్ధి చెందుతాయన్నారు. రానున్న రోజుల్లో కూడా విద్యాపరంగా జిల్లాను అగ్ర స్థానంలో ఉండేటట్టు ఉపాధ్యాయులు కృషి చేయాలని జెడ్పీ చైర్మన్ రాంబాబు అన్నారు. ఏజేసీ డి.మార్కండేయులు మాట్లాడుతూ మెరుగైన సమాజ నిర్మాణం, సమాజంలోని పరిస్థితులను మార్చగలిగే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు. ఆర్జేడీ ఎంఆర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ అత్యున్నత స్థాయికి చేరుకున్న సర్వేపల్లి ప్రత్యేక వ్యక్తిత్వానికి, ఆలోచన ధోరణికి ప్రతీకగా నిలిచారన్నారు. 307 మంది ఐఐఐటీకి ఎంపిక డీఈఓ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 5,600 పాఠశాలల్లో 7.60 లక్షల మంది విద్యార్థులకు సుమారు 20 వేల మంది ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారని వివరించారు. ఈ ఏడాది టెన్త్ ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం నిలిచేందుకు ఉపాధ్యాయుల కృషే కారణమని అభినందించారు. ఈ ఏడాది జిల్లా నుంచి 307 మంది విద్యార్థులు ఐఐఐటీకి ఎంపికయ్యారని తెలిపారు. రానున్న డీఎస్సీలో 2100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశిష్ట అతిథులుగా ఏజేసీ, ఆర్జేడీలతో పాటు, డీవైఈఓలు వెంకటనర్సమ్మ, ఆర్ఎస్ గంగాభవాని, పీఆర్ఓ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 224 మంది ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. తొలుత వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులను ఆకట్టుకున్నారు. సెయింట్ ఆన్స్ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య రూపకం ఆహూతులను అలరించింది. సంప్రదాయ వేషధారణలో గురువు ఔన్నత్యాన్ని తెలిపే పాటలకు, నృత్యాన్ని జోడించి ప్రదర్శించారు. -
రుణ వసూలుకు నోటీసులివ్వద్దు
బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశం సాక్షి, కాకినాడ : మాఫీ వర్తించే రుణాల వసూలు కోసం రైతులను ఒత్తిడి చేయొద్దని, వారికి నోటీసులు జారీ చేయొద్దని కలెక్టర్ నీతూప్రసాద్ బ్యాంకర్లను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సంపూర్ణ విత్తీయ సమావేశన్ (టోటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), ప్రధానమంత్రి జనధన్ యోజన అమలుపై కలెక్టరేట్ కోర్టు హాలులో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెలాఖరులోగా ఎంతమంది రైతులు రుణమాఫీ పరిధిలోకి వస్తున్నారు.. వారికి రుణాల్లో ఎంత మేర మాఫీ కాబోతున్నాయి.. ఇంకా వారు ఎంత చెల్లించాల్సి ఉంటుంది అనే వివరాల సేకరణ వేగవంతం చేయాలని సూచించారు. రుణాలు చెల్లించినప్పటికీ రుణమాఫీ ఆగబోదని రైతులకు అవగాహన కల్పించాలే తప్ప వారిపై ఒత్తిడి తీసుకురావడం తగదని కలెక్టర్ పేర్కొన్నారు. తమ రుణాలను రెన్యూవల్ చేయించుకుంటే కొత్త రుణాలు పొందవచ్చునని రైతులకు సూచించాలని ఆమె చెప్పారు. అక్టోబర్ 2లోగా అందరికీ బ్యాంకు ఖాతాలు అక్టోబర్ 2లోగా ప్రధానమంత్రి జనధన్‌యోజన ద్వారా జిల్లాలో ప్రతి కుటుంబానికీ సున్నా నిలవతో బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్ర మాన్ని ఈనెల 28వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రిలోని చెరుకూరి ఫంక్షన్ హాలులో ప్రారంభించనున్నారని చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో ప్రధాన బ్యాంకులు ఆర్థిక అక్షరాస్యత, జన్‌ధన్ యోజన, ప్రత్యక్ష లబ్ధి బదిలీ అంశాలపై ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి స్టాళ్లను ప్రదర్శించాలని కలెక్టర్ సూచించారు. వివిధ సంక్షేమ పథకాల అమలు చేస్తున్న ప్రభుత్వ శాఖలు కూడా స్టాళ్లు ఏర్పాటు చేయాలని, ఆధార్ సీడింగ్ విధానంపైనా స్టాల్ ఉండేలా చూడాలని చెప్పారు. ప్రారంభోత్సవ వీక్షణకు భారీ ఎల్సీడీ ప్రొజెక్టర్లు, లైవ్‌టెలికాస్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతికుటుంబానికీ రెండు ఖాతాలు తెరిపించేందుకు ప్రత్యేక శిబిరాలు, బల్క్ అకౌంట్ ఓపెనింగ్ క్యాంపెయిన్ జిల్లా అంతటా ఈ నెల29న ప్రారంభించి సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలకు ఖాతాలు ఉన్నాయి. ఇంకా ఎంతమంది ఖాతాలు పొందాల్సి ఉందనే వివరాలను సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జేసీ ముత్యాలరాజు, ఐటీడీఎ పీఒ గంధం చంద్రుడు, ఎల్డీఎం ఎస్.జగన్నాధస్వామి, వివిధ బ్యాంకుల కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ సేవా పురస్కారాలు
కాకినాడ సిటీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 646 మంది అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉత్తమ సేవా పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్సలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ నీతూప్రసాద్, జేసీ ముత్యాలరాజు, ఎస్పీ రవిప్రకాష్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు పాల్గొన్నారు. పురస్కారాలు అందుకున్న వారు వీరే.. జిల్లా అధికారులు : ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎ.సిరి, డీఈఓ కేవీ శ్రీనివాసులురెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ డి.సెల్వరాజ్, ఏపీఎంఐపీ పీడీ బి.పద్మావతమ్మ, ఆత్మ పీడీ కె.సీతారామరాజు, రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావు. రెవెన్యూ శాఖ : కలెక్టరేట్ : ఎస్ఏలు ఎన్.ఎస్.రాజ్‌కుమారి, సీహెచ్ ఇంద్రాణి, కె.నాయమీ, డి.సాయిరామ్, ఎం.సుబ్బారావు, జీఎం రామ్‌కుమార్, జేఏలు పి.జనార్దనరావు, కె.లక్ష్మణసురేష్కుమార్, వీపీ అలగ్జాండర్, కె.తులసి, ఆఫీస్ సబార్డినేట్లు వై.వీర్రాజు, ఎండీ అజమతుల్లాఖాన్, కె.లక్ష్మి, కె.వెంకటేశ్వర్లు, ఎస్.సత్యనారాయణ. కాకినాడ డివిజన్ : యు.కొత్తపల్లి తహశీల్దార్ పి.సత్యనారాయణ, డీటీ బీవీ భాస్కర్, ఎస్ఏకేకే వర్మ, ఎంఆర్ఐ జి.శ్రీనివాస్, ఎలక్షన్ డీటీ మురార్జీ, జేఏ విశ్వనాథ్, హెచ్‌హెచ్‌పీ వి.దుర్గాప్రసాద్, వీఆర్వోలు టి.శేషుకుమార్, పీవీవీ శ్రీనివాస్, ఎల్.శ్రీనివాస్, డ్రైవర్ కె.మరిడయ్య, ఓఎస్ బి.సుబ్బారావు, టి.సత్యనారాయణ, వీఆర్ఏ టి.శ్రీనుబాబు. రాజమండ్రి డివిజన్ : అర్బన్ తహశీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ, డీటీ పీవీఎస్ఆర్ కృష్ణమూర్తి, ఎంఆర్ఐ జీడీ మల్లేశ్వరి, జేఏలు సంధ్య, అనంతలక్ష్మి, వీఆర్వోలు కె.మోహన్‌రావు, ఆర్.శేషు, ఓఎస్‌లు డి.సత్యనారాయణ, వి.పీటర్. అమలాపురం డివిజన్ : తహశీల్దార్ ఎన్.చిట్టిబాబు, టీడీ ఎ.సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ కుమారిదేవి, ఎంఆర్ఐ భాస్కరరావు, జేఏ ఎం.కార్తీక్, ఓఎస్ ఎండీ బాషా, టైపిస్టు సర్వేశ్వరరావు, చైన్‌మెన్ సాంబశివరావు, వీఆర్వోలు గంగాధరరావు, రమణ, వీఆర్ఏలు వెంకటేష్, రమేష్. రామచంద్రపురం డివిజన్ : తహశీల్దార్ ఎం.వెంకటేశ్వరరావు, టీడీ ఎంజే బాషా, ఎంఎస్ఓ ఎన్.గోవిందరావు, ఎంఆర్ఐ రవీంద్రకృష్ణ, ఎస్ఏ యామిని, జేఏ గౌతమి, ఓఎస్ ఎం.సూర్యనారాయణాచార్యులు, వీఆర్వోలు పీఎంవీ ప్రసాద్‌శర్మ, బి.బాలాజీ, వీఆర్ఏలు వీరభద్రరావు, డీఎస్ఏ రాజు. పెద్దాపురం డివిజన్ : తహశీల్దార్ బి.రామారావు, డీటీ బి.సూర్యనారాయణ, ఎలక్షన్ టీడీ టీఏ కృష్ణారావు, ఎస్ఏ ఎన్.దొరకయ్య, ఆర్ఐ జీఆర్కేవీ ప్రసాద్, జేఏ వి.వీరాస్వామి, సర్వేయర్ ఎంపీ దేవుడు, వీఆర్వోలు వీరభద్రరావు, తిరుమలరావు, ఓఎస్‌లు సీహెచ్ భద్రరావు, ఎన్వీవీ సత్యనారాయణ, వీఆర్ఏలు ఆర్.శ్రీనివాస్, ఎ.చంద్రరావు. రంపచోడవరం డివిజన్ : తహశీల్దార్ టీవీ రాజు, డీటీ సీఎస్ రాజు, ఎలక్షన్ డీటీ జి.శ్రీనివాస్, ఆర్ఐ ఎస్.నాగబాబు, ఎస్ఏ పి.వెంకటేశ్వరరావు, జేఏ కె.భానుప్రకాష్, ఓఎస్‌లు బాబురావు, ఎన్వీ రాఘవులు, వీఆర్వోలు జి.అప్పారావు, సీహెచ్ నిర్మలాకుమారి. వ్యవసాయ శాఖ : ఏడీలు ఎంపీ ఆదరణకుమార్, కె.నాగేశ్వరరావు. ఎంఏఓలు విజయ్‌కుమార్, మణిదీప్, సూపరింటెండెంట్ ఎంవీ శేషగిరిరావు, ఎస్ఏలు ఎన్వీఎస్కె రాజు, ఏబీ సరోజిని, జేఏలు హిమబిందు, అబ్బాయి, ఏఈఓలు డీవీవీ మాధవరావు, జి.జానకిదేవి, డ్రైవర్ శ్రీనివాసరావు, ఓఎస్ ఆదినారాయణ. హార్టికల్చర్ : హెచ్ఓ శ్రీనివాసరావు, సబ్-అసిస్టెంట్ పి.శ్రీనివాసరావు, డీఈఓ ఎస్.రాంబాబు. పశు సంవర్థక శాఖ : డీడీ ఎస్కే అహ్మద్షరీఫ్, డాక్టర్లు పీవీ వరప్రసాద్, కె.శ్రీధర్, వీఎల్ఎస్ ఆఫీసర్ వెంకట్రావు, జేవీఓలు వీర్రాజు, భగవాన్‌దాస్, ఎల్ఎస్ఏలు శ్రీనివాసరాజు, సుజాత, వీఏలు వెంకటేశ్వరరావు, విజయబాబు, విజయకుమార్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఓఎస్ రాజ్‌కుమార్, జయలక్ష్మి, జేఏ ఎంఎస్వీ రమణ. విద్యుత్ శాఖ : డీఈ చలపతిరావు, ఏడీఈలు నారాయణ అప్పారావు, విజయనాథ్, పీఓ పీవీ శ్రీనివాసరావు, ఏఏఈ జీవీ సత్యనారాయణ, ఏఈలు కె.వి.నాగేశ్వరరావు, డీఎస్డీ ప్రసాద్, ఏఏఓ కె.శ్రీనివాస్, జేఏఓ ఎం.శంకరరావు, సబ్ ఇంజనీర్ ఎల్.ప్రసాదరావు, ఎస్ఏలు పి.మూర్తి, జీఆర్ కుమార్, లైన్ ఎల్.ధర్మసింగ్, ఎల్ఎం పి.ఏసురత్నం, ఏఎల్ఎం ఎల్వీ మాధవరావు, ఏపీఈడబ్ల్యూఐడీసీ విభాగం ఏఈలు కె.వెంకటరాజు, పి.రామారావు, ఎస్.రామ్మోహన్, జేఏ కామేశ్వరరావు, ఏపీ ఎంఐపీ విభాగంలో ఓఎస్ సీహెచ్ శ్రీనివాస్, ఎంఐ ఇంజనీర్ కె.ఎన్.సత్యవాణి. ఆత్మ : డీపీడీ ఎస్.ఏజెంలి, బీటీఎం పి.రాంబాబు. బ్యాంక్స్ (లీడ్‌బ్యాంక్) : ఎల్డీఎం ఎస్.జగన్నాథస్వామి, ఏజీఎం ఎ.సురేష్‌కుమార్, సీఈఓ ఎ.హేమసుందర్, డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ శతపథి. బీసీ వెల్ఫేర్ శాఖ : సూపరింటెండెంట్ ఆర్.యుగంధర్, ఎస్ఏ బి.చిట్టిబాబు, ఏపీసీడబ్ల్యూఓ సత్యరమేష్, హెచ్‌డబ్ల్యూఓలు వై.అప్పారావు, నారాయణపాల్, కుక్‌లు జి.పాల్, డి.కుమారి. స్కౌట్స్ అండ్ గైడ్స్ : ఏఎల్టీ కె.జగన్నాథరావు, హెచ్ఎం జేఎస్ మహాలక్ష్మి, స్కౌట్ మాస్టర్ సాంబశివరావు. పౌర సరఫరాల శాఖ : ఏఎస్ఓ బీఎస్ వీవీ కృష్ణప్రసాద్, ఏఏఎం వి.మోహన్‌రావు, డీటీ ఎస్.రామ్మోహన్, గ్రేడ్-2 అసిస్టెంట్ కె.యమున, గ్రేడ్-3 టెక్నికల్ అసిస్టెంట్ టీవీ కుమారి. కమర్షియల్ ట్యాక్స్ : సీటీఓ పి.సూర్యనారాయణరాజు, డీసీటీఓ బీపీ నాయుడు, ఏసీటీఓ శ్రీవిద్య, ఎస్ఏ ఎ.రాంబాబు, డ్రైవర్ ఎ.సత్యనారాయణ, ఓఎస్ డి.మోహన్. సమాచార శాఖ : పబ్లిసిటీ అసిస్టెంట్ హెచ్వీ రమేష్, ఓఎస్‌లు ఎస్.సత్యనారాయణ, వి.త్యాగరాజు. కో-ఆపరేటివ్ శాఖ : డివిజనల్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ ఏడీవీ ప్రసాద్, సూపరింటెండెంట్ డి.రాజారత్నం, ఎస్ఐలు ఎన్.సరస్వతి, సీహెచ్ స్వరూపారాణి, ఏఆర్ ఎన్.రాఘవేంద్ర, జేఏ ఐఎస్‌వీ కుమార్, ఆఫీస్ సబార్డినేట్ ఎ.మహ్మద్. కో-ఆపరేటివ్ బ్యాంక్ ఈడీ ఎ.వీరభద్రం, అసిస్టెంట్ మేనేజర్ జి.గోపీనాధ్. ప్రణాళిక శాఖ : డిప్యూటీ డెరైక్టర్ ఎ.కూర్మారావు, డిప్యూటీ ఎస్ఓ ఎస్.భీమరాజు,. సూపరింటెండెంట్ వి.ఎస్.ఆర్.రాంబాబు, ఏఎస్ఓలు ప్రభాకరరావు, మాధురి. పంచాయతీ : డీపీఓ జి.శ్రీరాములు, ఎస్ఏ ఎంఎస్ఆర్ ఆంజనేయులు, జేఏలు సూర్యనారాయణమూర్తి, సీహెచ్ దొరబాబు, ఎన్.సాయిరామ్, జి.సత్యనారాయణ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కె.వెంకటేశ్వరరావు, కార్యదర్శులు సీహెచ్‌ఎన్‌ఎం ప్రకాష్, బి.గోవిందరాజులు, ఎం.రాజేశ్వరరావు, పీఎస్డీకే మణికుమార్, పీవీఎల్ ప్రసాద్, బి.శ్రీహరి, జేవీ రమణ, జీవీవీ సత్యనారాయణ, బిల్లు కలెక్టర్లు జి.కృష్ణమూర్తి, ఎన్.నాగశ్రీనివాస్, కె.సూర్యకళ, ఆఫీస్సబార్డినేట్లు ఎస్.ఉష, బి.శేషాచార్యులు. డీఆర్డీఏ ఐకేపీ : ఎస్ఏబీఎస్ఎస్బీ పురుషోత్తమరావు, డీపీఎం బి.విశాలాక్షి, ఏరియా కో-ఆర్డినేటర్ డి.భాస్కరం, డీఆర్పీ ఐటీ అనంతశాస్త్రి, ఏపీఎంలు డీవీ బాబు, ఎంఎస్ఎస్బీ దేవి, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు ఆర్ఎండీ గంగాధర్, ఎన్.బుల్లియ్య, పారాలీగల్ ఎస్పీ నాయుడు, డీఎంజీ తిలక్, సీడీడబ్ల్యూ అప్పలకొండ, బీమా మిత్ర కేఎం కుమారి, కమ్యూనిటీ యాక్టివిస్ట్ జి.సుభాషిణి. డ్వామా : ఎఫ్ఎం కేఎస్ ప్రసాద్‌మూర్తి, ఏపీడీ సీహెచ్ సోమేశ్వరరావు, ఎంపీడీఓ జేఏ ఝాన్సీ, ఏపీఓలు కొండలరావు, వెంకటేశ్వర్లు, ఈసీ నారాయణసాగర్, జేఈ సివిల్ మంగా లక్ష్మి, టీఏలు కాజా మొహిద్దీన్, వి.వెంకటేష్, జీఓలు వీర్రాజు, శ్రీలక్ష్మి. ఎఫ్‌ఏలు వెంకటసురేష్, సత్తిబాబు. విద్యా శాఖ : డీవైఈఓ ఆర్ఎస్ గంగాభవాని, ఎంఈఓలు సత్యనారాయణ, సోమిరెడ్డి, వీరభద్రరావు, స్కూల్ అసిస్టెంట్ కేవీఎస్ఎస్ ప్రసాద్, ఎస్ఏ బి.శ్రీనివాసరావు, జేఏ రాజ్‌కుమారి, నాగలక్ష్మి, రికార్డు అసిస్టెంట్ వి.మస్కర్రావు, ఆఫీస్ సబార్డినేట్ ఎండీ ప్రవీణ్, నైట్ వాచ్మెన్ ఎన్.శ్రీనివాసరావు. సర్వశిక్షా అభియాన్ : డీఈఈ అచ్యుతరామారెడ్డి, ఏఎస్ఓ శ్రీనివాస్, ఎస్ఏ బాబురావుదొర, స్కూల్ అసిస్టెంట్ రామానుజస్వామి, సీఆర్పీ డీజే డానియేలు, ఆర్జేడీ ఎడ్యుకేషన్ డీడీ జీవీఎస్పీ పూర్ణానందరావు, సూపరింటెండెంట్ కె.వాసుదేవరావు, జేఏ వరప్రసాద్, ఓఎస్ పాదుకాంబ. దేవాదాయ శాఖ : సూపరింటెండెంట్ ఎల్.సత్యవతి, ఎస్ఏ అపర్ణ, జేఏ కిరణ్, టైపిస్ట్ సతీష్‌కుమార్, ఆర్ఏ గంగరాజు, అటెండర్ ఎస్తేరురాణి. ఆర్జేవై ఐఓ వెంకటేశ్వరరావు, జేఏ శ్రీనివాస్, స్టోర్‌కీపర్ అమృతవల్లి. అగ్నిమాపక శాఖ : ఎల్‌ఎఫ్‌లు బాలకృష్ణ, రాజ్‌కుమార్, ఎఫ్ఎంలు రాధాకృష్ణ, వీరబాబు, రమణ, సీహెచ్ రాంబాబు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, వెంకన్న, రామచంద్రరావు, ఎస్.రాంబాబు, డీఓపీలు ఎస్.గణపతి, టి.సముద్రరాజు. అటవీ శాఖ : ఫారెస్ట్ ఆఫీసర్లు టి.రాజా, ఎన్.శివశంకర్, ఎస్.సత్తిబాబు, జేఏ ఆర్ఎస్ఆర్ హరీష్. వైద్య, ఆరోగ్య శాఖ : డీపీఎం ఎం.మల్లికార్జున్, ఎస్పీహెచ్ఓలు వి.వెంకట్రావు, డి.మహేశ్వరరావు, ఎంఓలు శ్రీనివాస్, సుమలత, సీహెచ్‌ఓలు సంజీవరావు, సత్యనారాయణ, పీఎంఓఓలు యోగేశ్వరి, పి.వెంకట్రావు, డీపీఎంఓ కేఎస్‌ఆర్‌సీ మూర్తి, ఏపీఎంఓ ఆర్.ఈశ్వరరావు, డీఐఎస్ బుజ్జిబాబు, హెల్త్ ఎడ్యుకేటర్లు సుధాకర్, ప్రభాకరరెడ్డి, ఎంపీహెచ్‌ఈవోలు నాగబాబు, ఏలియా, పీహెచ్ఎన్ మీనాక్షి, స్టాఫ్‌నర్సులు మహాలక్ష్మి, శైలజ, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్లు ప్రభాకరరావు, చంద్రకుమార్, ఫార్మసిస్ట్ జగదీశ్వరరావు. జీజీహెచ్ కాకినాడ : డిప్యూటీ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కెఎస్ సత్యవేణి, హెడ్‌నర్సు సత్యశ్రీ, స్టాఫ్ నర్సు ఎం.పద్మ, ఎస్ఏలు ఎస్ఏవీ రమణ, బీవీవీ సత్యనారాయణ, ఫార్మసిస్ట్ బీవీ ప్రసాద్, జేఏ బీఎస్ఎల్ఎన్ మూర్తి, రికార్డు అసిస్టెంట్ వీరబాబు, ఎంఎన్ఓలు కెఎస్ఎన్ పాత్రుడు, వి.సత్యనారాయణ, ఆఫీస్ సబార్డినేట్లు బాల రమణమూర్తి, చిన్నబ్బాయి, తోటి బి.లక్ష్మి, సీహెచ్ ఆదిలక్ష్మి. హోమియో మెడికల్ కళాశాల : అసిస్టెంట్ ప్రొఫెసర్లు జీఎస్ సాయిప్రసాద్, వీటి వెంకటేశ్వరరావు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ : సీడీపీఓలు సత్యకల్యాణి, సీహెచ్ ఇందిర, సూపర్వైజర్లు పి.అరుణ, ఎ.జ్యోతి, ఎస్ఏ ఏజే దొర, జేఏ రమణమూర్తి, ఆఫీస్ సబార్డినేట్ మరిడి, అంగన్వాడీ వర్కర్లు ఎన్.సత్యవతి, వీరవేణి. ఇరిగేషన్ శాఖ : డీఈఈ ఎన్. మన్మధరావు, ఏటీఓ రమేష్‌కుమార్, ఏఈఈ ఆనందకిషోర్, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, ఈఈ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈఈ నాగేంద్రకుమార్, ఏఈఈ ఎంవీవీ కిషోర్, ఏఈ కేవీ మంగేశ్వరరావు, ఐటీడీఏ ఈఈ పి.కె.నాగేశ్వరరావు, ఎం.కృష్ణమూర్తి, పీఓ సీహెచ్ శ్రీనివాసులు, ఏడీ మల్లికార్జునరావు, ఎస్ఓ చినబాబు, ఎస్ఏ ఇమ్మానుయేలు, పీజీటీ కేటీవీఎస్ఎన్ మూర్తి, ఏఈఈ కె.వేణుగోపాల్. జైళ్ల శాఖ : ఏఓ బీడీ తిరుమలరావు, జైలర్ శివకుమార్, ఎస్ఏ నూకరాజు, డిప్యూటీ జైలర్లు శ్రీనివాసరావు, మధు, జేఏలు వైవీఎస్పీ రాయల్, వినోద్‌కుమార్, హెడ్‌వార్డర్ బి.రాంబాబు, చీఫ్ హెడ్‌వార్డర్ సుబ్రహ్మణ్యం. వార్డర్లు శ్రీనివాసరావు, సత్యస్వామి, శేఖర్‌బాబు, సబ్‌జైలు సూపరింటెండెంట్ జనార్దన్. కార్మిక శాఖ : ఏఎల్ఓ జి.రాజు, ఎస్ఏ ఎస్.గోవిందు, జేఏ టీడీ ప్రసన్న, ఆఫీస్ సబార్డినేట్ గంగరాజు. గ్రంథాలయ శాఖ : గ్రేడ్-1 లైబ్రేరియన్ పి.పాపారావు, గ్రేడ్-2 లైబ్రేరియన్ స్వర్ణకుమారి. మార్కెటింగ్ శాఖ : అసిస్టెంట్ మార్కెట్ సూపర్వైజర్ వెంకటశ్రీధర్, సూపర్వైజర్లు గిరిబాబు, విజయ్‌కుమార్. పురపాలక శాఖ : కాకినాడ కార్పొరేషన్ : ఆర్ఓ ఎ.శామ్యూల్, ఏఈ టి.రామారావు, ఎస్ఏ దుర్గారావు, జేఏరవిశంకర్, ఫైర్‌మెన్ వెంకటేశ్వరరావు, వాటర్ సప్లయి హెల్పర్ హుస్సేన్, టైం కీపర్ అప్పారావు, శానిటరీ మేస్త్రి దుర్గారావు, అటెండర్ యాకోబ్, శానిటరీ వర్కర్ బి.గణేష్. మండపేట : డీఈఈ శ్రీనివాసప్రసాద్, ఆర్వో ఎంవీ సూర్యనారాయణమూర్తి, ఎస్ఏ వి.రవికుమార్. రామచంద్రపురం : ఏఈ నాగేశ్వరరావు, ఎస్ఏ కె.ఈశ్వరరావు, సీనియర్ అకౌంటెంట్ కె.రామకృష్ణ. తుని : డీఈఈ కనకారావు, ఎస్ఏ పీఏ కుమార్, హెల్త్ అసిస్టెంట్ జీవీఆర్ శేఖర్. పిఠాపురం : కమిషనర్ డి.రాము. పంచాయతీరాజ్ శాఖ : డీఈఈలు ఎ.రవి, ఏఈలు ఆర్వీ పద్మావతి, సీహెచ్ అబ్బాయిదొర, ఏఈఈలు బీవీ చలం, వి.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ టీవీఎస్ కృష్ణ, ఎస్ఏలు మల్లికార్జునరావు, ఎస్.త్రినాథ్. జిల్లా పరిషత్ : ఎంపీడీవోలు పి.నారాయణమూర్తి, జేఏ ఝాన్సీ, సూపరింటెండెంట్లు చక్రధరరావు, రమణరావు, ఎస్ఏలు ఎం.గోవిందు, పి.జయంతి, జేఏలు జి.రామకృష్ణ, కేఎస్వీ రాజేష్, ఆఫీస్ సబార్డినేట్లు పీసీహెచ్ అప్పారావు, వి.నాగేశ్వరరావు, ట్రెజరీ శాఖ ఏడీ టీఎస్ సూర్యప్రకాశరావు, సీనియర్ అకౌంటెంట్లు వి.శ్రీనివాస్, భీమేశ్వరరావు. రవాణా శాఖ : ఎంవీఐలు వైవీఎన్ మూర్తి, జీవీ నరసింహరావు, ఏఎంవీఐ బి.లక్ష్మీకిరణ్, ఎస్ఏ ఎం.సత్తిబాబు, కానిస్టేబుల్ పి.రామకృష్ణ, ఆఫీసర్ సబార్డినేట్ డీవీ రమణ. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ : సీఐలు టి.గోపాలకృష్ణ, బి.వెంకటేశ్వరరావు, ఎస్సైలు డి.రామారావు, ఎల్.చిరంజీవి, కానిస్టేబుల్స్ వి.శ్రీనివాస్, వై.సత్యనారాయణమూర్తి, వై.సత్యనారాయణ, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఆర్సీ చిట్టిబాబు, డి.సుధ, ఎస్ఏలు జీవీవీఎస్ శ్రీనివాసరావు, ఇందిరాకుమారి, జేఏ పి.రాంబాబు, అబ్కారీ ఇన్స్పెక్టర్లు జి.గంగాధర్, ఎస్.శ్రీధర్, ఎస్సై వీరభద్రం, సూర్యారావు, హెడ్ కానిస్టేబుల్స్ నరసింహరావు, సత్యనారాయణ, కానిస్టేబుళ్లు ఏడుకొండలు, నాగేశ్వరరావు, ఎన్ఫోర్స్మెంట్ కానిస్టేబుళ్లు వెంకటగిరిబాబు, త్రిమూర్తులు, ఏవీఎస్ రామరాజు, జేఏ పి.మనోరమ, డిస్టిలరీస్ సూపరింటెండెంట్ ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి, సీఐలు రాజశేఖర్, శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్స్ ఎం.శ్రీనివాసరావు, జి.వెంకటేశ్వరరావు. ఎస్ఏ డి.వెంకట్రావు, జేఏ కె.పార్వతి. ఆర్అండ్బీ : ఈఈ ఎ.రామచంద్రరావు, డీఈఈలు జి.ఏడుకొండలు, బీవీ మధుసూదనరావు, ఏఈఈలు పి.అశ్రిత, రాజేంద్రప్రసాద్, ఏటీఓలు ఎస్.వీరభద్రరావు, ఎస్.జయన్న, సూపరింటెండెంట్ వై.శ్రీనివాస్, టీఓ పుత్రయ్య, డబ్ల్యూఐ ఆర్.రామకృష్ణ, ఆర్.శ్రీనివాసరావు. ఆర్డబ్ల్యూఎస్ : డీఈఈలు ఎస్ఆర్ కుమారి, కేకేఎన్ కుమార్, ఏఈఈవీ గనిరాజు, ఏఈ రాజశేఖర్, సూపరింటెండెంట్ ఎం.నరసింహారావు, ఎస్ఏఎంవీ సత్యనారాయణ. సోషల్ వెల్ఫేర్ : ఎస్ఏ పీటీ దొర, జేఏ కె.ఆనందరావు, ఏఎస్‌డబ్ల్యూఓలు యు.చిన్నయ్య, ఎం.వెంకట్రావు, వార్డెన్లు ఎంవీఎస్ మూర్తి, వీజీ మణి, కుక్‌లు సుజాతరాణి, సూరమ్మ, కమాటి సత్యనారాయణ, అప్పలరాజు, పోలీసు శాఖ : ఎస్పీ కాకినాడ : డీఎస్పీలు పి.రవీంద్రనాధ్, ఎం.వీరారెడ్డి, సీఐలు ఎన్.మధుసూధనరావు, పి.సోమశేఖర్, ఆర్ఐ ఎస్.వెంకటేశ్వరరావు, ఆర్ఎస్సైలు కేవీవీఎస్ ప్రసాద్, కె.రాజేష్, కామేశ్వరరావు, ఎస్సైలు బి.సంపత్‌కుమార్, జి.వెంకటేశ్వరరావు, కె.వంశీధర్, కె.పల్లంరాజు, ఏఎస్సై నాగేశ్వరరావు,. ఏఆర్ఎస్సై బి.అనసూర్యారావు, హెచ్‌సీలు ఎ.వెంకన్న, ఎస్.సూర్యప్రకాశరావు, సీహెచ్ కృష్ణ, సీహెచ్ఎస్ ప్రకాశరావు, కె.శ్రీనివాసరావు, కానిస్టేబుల్స్ బి.రవీంద్రకృష్ణ, ఎండీకే మొహిద్దీన్, ఆర్.కిషోర్, అహ్మద్ఆలీఖాన్, పి.వెంకటేశ్వర్లు, కె.గణేష్‌బాబు, టీవీఎస్ నారాయణ, బి.నరసింహరావు, ఆర్వీ రమణ, రాంప్రసాద్, పి.శ్రీనుబాబు, ఎ.సత్తిరాజు, ఇ.రాజు, జి.శ్రీనివాస్, టి.బాలశివాజీ, శివరామకృష్ణ. ఎస్పీ రాజమండ్రి : సీఐ ఎ.నాగమురళి, ఎస్సైలు వి.రామకోటేశ్వరరావు, ఎ.వెంకటేశ్వరరావు, ఎంవీఎస్ మల్లేశ్వరరావు, ఏఎస్సైలు మావుళ్ళు, హెచ్‌సీ నాగస్వర్ణలత, కానిస్టేబుళ్లు సత్యానందం, ఎస్కె మహ్మద్, వి.కృష్ణ, కె.వెంకటేశ్వరరావు, కె.సురేష్, పి.వెంకటేశ్వరరావు, ఎం.కేశవరావు, కేజీవీ ప్రసాద్. -
ఇదే స్ఫూర్తిని కొనసాగించండి
భానుగుడి(కాకినాడ), న్యూస్‌లైన్ : ‘పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈ ఏడాది జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపి నందుకు అభినందనలు. ఇదే స్ఫూర్తిని కొనసాగించండి’ అని కలెక్టర్ నీతూప్రసాద్ ఉపాధ్యాయలకు సూచించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులను శుక్రవారం కలెక్టర్ నీతూప్రసాద్ సత్కరించారు. జిల్లాలోని ప్రధానోపాధ్యాయుల సమావేశం శుక్రవారం కాకినాడ అంబేద్కర్‌భవన్‌లో డీఈఓ కేవీ శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆ సమావేశంలో కలెక్టర్ నీతూప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఉపాధ్యాయులు వందేమాతర గీతం ఆలపించారు. జ్యోతి ప్రజ్వలన, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేయడంతో కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయపాలనలే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపాయన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. నిరంతర మూల్యాంకన విధానంపై శ్రద్ధ వహించాల న్నారు. డీఈఓ కేవీ శ్రీనివాసులు రెడ్డి విద్యావ్యవస్థను ప్రగతిపథంలో నడిపించారని కలెక్టర్ కొనియాడారు. 172మంది ఉపాధ్యాయులకు సత్కారం వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించిన 172 మంది ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. దుశ్శాలువా, మెమెంటోలను అందజేసి అభినందించారు. రాయవరం(137), సామర్లకోట(128), కపిలేశ్వరపురం( 122), ప్రత్తిపాడు(117), సఖినేటిపల్లి( 106), కాజులూరు(104), పిఠాపురం(100), గోకవరం(103) మంది విద్యార్థులు అధికంగా గల పాఠశాలలుగా నిలిచాయి. జిల్లాలో పదికి పదిపాయింట్లు సాధించిన 29మంది విద్యార్థులకు కలెక్టర్ నీతూప్రసాద్ ప్రశంసాపత్రం,మెమెంటోలను అందజేసి సత్కరించారు. కాకినాడ కార్పొరేషన్లో 2 పాఠశాలలు, గండేపల్లి మండలంలో 3 జెడ్పీ ఉన్నతపాఠశాలలు, కరప మండలంలో 2 జెడ్పీ పాఠశాలలు, పెద్దాపురం మండలంలో 3, తాళ్లరేవు మండలంలో 3 జెడ్పీపాఠశాలలు, ఏలేశ్వరం మండలంలో 2 జెడ్పీ పాఠశాలల్లో విద్యార్థులు పదికి పదికి జీపీఏ పాయింట్లు సాధించారు. మారిన సిలబస్‌పై సమీక్ష మధ్యాహ్నం సెషన్లో 9,10 తరగతులకు సంబంధించి మారిన పాఠ్యపుస్తకాల సిలబస్‌కు సంబంధించి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఈఓ కేవీ శ్రీనివాసులు రెడ్డితో సహా పలువురు అధికారులు ఉపాధ్యాయుల సందేహాలను నివృత్తి చేశారు. ఏజేసీ మార్కండేయులు, ఆర్జేడీ ఆర్.ప్రసన్నకుమార్, ఏజెన్సీ డీఈఓ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
సెల్‌టవర్ ఏర్పాటును అడ్డుకోవాలి
సాక్షి, కాకినాడ:ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం రత్నగిరి రిసార్ట్స్ సమీపంలో జనావాసాల మధ్య ఇప్పటికే పంచాయతీ అనుమతి లేకుండా ఒక సెల్‌టవర్ నిర్మించారని, ఇపుడు మరో టవర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు హాజరైన అన్నవరం గ్రామస్తులు కలెక్టర్ నీతూప్రసాద్‌కు ఈ సెల్ టవర్ ఏర్పాటును అడ్డుకోవాలని అర్జీ అందజేశారు. జనావాసాల మధ్య లాడ్జి నిర్వహిస్తున్న వ్యక్తి తన భవనం పై ఈ సెల్ టవర్ల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నారని వారు ఆరోపించారు. లాడ్జి నిర్వహణకు కూడా అనుమతి లేదని పేర్కొన్నారు. ‘నిర్భయ’ కేసు నమోదు చేయాలి మైనర్‌బాలికపై లైంగిక వేధింపులను అడ్డుకున్న ఆమె అన్నను కొందరు చంపేశారని, దీనిపై నిర్భయ చట్టం కింద కాకుండా ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. గత ఏప్రిల్ 24న ఏలేశ్వరం మందుల కాలనీలో ఈ హత్య జరిగింది. ఎనిమిది మంది నిందితులు ఉండగా, ముగ్గురి పైనే కేసు నమోదు చేశారని బాధితులన్నారు. ఎస్సైని సస్పెండ్ చేసి, ఐపీసీ 354 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని బాధితుల పక్షాన దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధి ఎ. సూర్యనారాయణ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును కలెక్టర్ నీతూప్రసాద్ జిల్లా ఎస్పీకి పంపించారు. గ్రీవెన్స్‌కు 200 అర్జీలు గ్రీవెన్స్ సెల్‌కు దాదాపు 200 అర్జీలు అందాయి. రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఉపాధి రుణాలు, ఉద్యోగాల కల్పన, కళాశాలల్లో విద్యార్థులకు సీట్లు కోరుతూ ఆయా అర్జీలు అందాయి. డయల్ యువర్ కలెక్టర్‌కు 30 ఫిర్యాదులు ఎన్నికల అనంతరం తొలిసారి నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి జిల్లా నలుమూలలనుంచి 30 మంది ఫోన్లో ఫిర్యాదులు చేశారు. సఖినేటిపల్లి జెడ్పీటీసీ మెంబర్ సఖినేటిపల్లి, అంతర్వేది తదితర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిపై ఫిర్యాదు చేశారు. ఆలమూరు మండలం పినపళ్ల నుంచి గృహరుణం కోసం, మండపేట మండలం కేశవరం నుంచి రేషన్ కార్డు కోసం, బిక్కవోలు మండలం ఊలపల్లిలో వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు కోరుతూ ఫోన్లు చేశారు. డయల్ యువర్ కలెక్టర్‌లో వచ్చిన వినతులు, ఫిర్యాదులపై తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. త్వరలో బీసీ,ఎస్సీ కార్పొరేషన్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక చేపడతామని పేర్కొన్నారు. -
పోలీసు పోస్టల్ బ్యాలట్‌లో 39 శాతం పోలింగ్
సాక్షి, కాకినాడ : పోలీసు పోస్టల్ బ్యాలట్‌లో తొలిరోజైన శుక్రవారం 39 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓట్లు 2,913 కాగా 1145 ఓట్లు మాత్రమే పోలై 39 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు గానీ బ్యాలట్ పేపర్లు ఆయా సబ్‌డివిజినల్ కేంద్రాలకు చేరుకోలేదు. జిల్లాలో మొత్తం 4,500 మంది పోలీస్‌లు, హోంగార్డులు ఉండగా కేవలం 2,913 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు కావడం విశేషం. పోలింగ్ సమయం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంది. అయితే బ్యాలట్ పేపర్లు చాలా డివిజన్లలో మధ్యాహ్నం ఒంటిగంటకు గానీ చేరకపోవడంతో పోలింగ్ ఆలస్యంగా జరిగినట్టు సమాచారం. దానికి తోడు అభ్యర్థుల ఏజెంట్లు రావడం ఆలస్యం కావడం, దాంతో బ్యాలట్ బాక్సులకు సీళ్లు వేయడం ఆలస్యమైంది. పెద్దాపురం పోలీసు డివిజన్ పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు,జగ్గంపేట,తుని రిటర్నింగ్ అధికార్లు పెద్దాపురం పోలీసు పోస్టల్ బ్యాలట్ పోలింగ్ కేంద్రానికి రాలేదు. అక్కడకు చేరుకున్న కలెక్టర్ నీతూప్రసాద్ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ పోస్టల్ బ్యాలట్ పేపర్లు తెలుపు, గులాబీ రంగుల్లో ఉండగా బ్యాలట్ బాక్స్‌లకు కూడా పార్లమెంటుకు తెలుపురంగు, అసెంబ్లీకి పింక్ కలర్ కాగితాలు అంటించారు.నేడు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోలేకపోయిన పోలీసు సిబ్బంది ఈనెల 26,27,28,30 తేదీల్లో ఓటు వేయాల్సిందిగా కలెక్టర్ నీతూప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పోలీసులు, ఇతర ఉద్యోగులు నూరుశాతం పోలింగ్‌లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికల నిర్వహణకు సహకరించండి
సాక్షి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల నాయకులకు కలెక్టర్ నీతూప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం తన చాంబర్లో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. నామినేషన్ల ఘట్టం శనివారం ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 19 వరకు నామినేషన్లను స్వీకరిస్తారని, అయితే మధ్యలో 13, 14, 18 తేదీలు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో ఆ రోజులు మినహా మిగిలిన దినాల్లో నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. అసెంబ్లీకి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని రిటర్నింగ్ అధికారులకు, పార్లమెంటు స్థానాలకు కాకినాడ, రాజమండ్రి, అమలాపురం కేంద్రాల్లోని ఆయా ఆర్వోల వద్ద నామినేషన్లు దాఖలు చేయాలన్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 23వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా ఉపసంహరణ చేసుకోవచ్చన్నారు. ఆరోజే అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తామన్నారు. ఆ వెంటనే అభ్యర్థులు ప్రచారం ప్రారంభించుకోవచ్చన్నారు. మే 7వ తేదీన పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. మే 28వ తేదీ వరకు ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని కలెక్టర్ వివరించారు. నామినేషన్లు వేసేదిలా.. పార్లమెంటు స్థానానికి ఫారం-2ఏ, అసెంబ్లీ స్థానానికి ఫారం-2బిలో నామినేషన్ దాఖలు చేయాలి. ఎంపీ అభ్యర్థి రూ.25 వేలు, అసెంబ్లీ అభ్యర్ధి రూ.10 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌గా ఆర్వోకు నేరుగా కానీ ట్రెజరీ చలాన రూపంలోకానీ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ మొత్తంలో సగమే చెల్లిస్తూ, ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలి. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి ప్రతిపాదకుడు ఒకరు చాలు. రిజిస్టర్డ పార్టీలు లేదా ఇతరులకైతే పదిమంది ప్రతిపాదకులు కావాలి. అభ్యర్థికి రాష్ట్రంలో ఎక్కడ ఓటున్నా ఆ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ప్రతిపాదకులకు మాత్రం తప్పనిసరిగా అభ్యర్థి ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారో.. అదే నియోజకవర్గంలో ఓటర్లుగా ఉండాలి. నామినేషన్ ఫారంతో పాటు అభ్యర్థి ఫారం-26 అఫిడవిట్‌ను రూ.10 విలువ కలిగిన స్టాంపు పేపరుపై నోటరీ చేయించి సమర్పించాలి. అఫిడవిట్‌లోని అన్ని కాలమ్స్ తప్పనిసరిగా పూరించాలి. ఖాళీగా వదిలితే నామినేషన్‌ను తిరస్కరిస్తారు. కొత్త బ్యాంకు అకౌంటు నామినేషన్‌కు ముందుగానే అభ్యర్థి స్వయంగా లేదా ఏజెంటుతో కలిసి కొత్త బ్యాంకు అకౌంటు ప్రారంభించాలి. అప్పటి నుంచి ఎన్నికల ఖర్చును అదే అకౌంటు ద్వారా లావాదేవీలు జరపాలి. అకౌంటు వివరాలను, పాస్ బుక్ నకలును ఆర్వోకు అందించాలి. ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.28 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.70 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. లెక్కింపు పూర్తయిన తరువాత నెల రోజుల లోపు అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాలను వ్యయ పరిశీలకులకు తప్పనిసరిగా సమర్పించాలి. అనుమతుల కోసం ప్రత్యేక విభాగం నియోజకవర్గ కేంద్రాల్లో ఈసారి రాజకీయ పార్టీలకు లేదా అభ్యర్థులకు ప్రచారం కోసం ర్యాలీలు, ఊరేగింపులు, వాహనాల పర్మిషన్లు వేగంగా ఇచ్చేందుకు సింగిల్ విండో పర్మిషన్ సెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెల్లో అన్ని శాఖల లైజన్ అధికారులు ఉంటారు. అభ్యర్థులు 48 గంటల ముందు ప్రతి అంశానికీ వేర్వేరుగా అనగ్జర్-16లో అభ్యర్థనను అందిస్తే వాటిపై అనుమతులు ఇచ్చేదీ, లేనిదీ 36 గంటల్లో తెలియజేస్తారు. డీఆర్వో బి.యాదగిరి, కాంగ్రెస్ నుంచి దొమ్మేటి వెంకటేశ్వర్లు, టీడీపీ నుంచి నున్న దొరబాబు, బీజేపీ నుంచి వేటుకూరి సూర్యనారాయణరాజు, బీఎస్పీ నుంచి చొల్లంగి వేణుగోపాల్, సీపీఐ తరఫున పీఎస్ నారాయణ, సీపీఐ ఎంఎల్ తరఫున జె. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఓటే ఆయుధం
మారేడుమిల్లి, న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్యానికి ఓటే ఆయుధమని కలెక్టర్ నీతూ ప్రసాద్ పేర్కొన్నారు. ఓటు హక్కును సద్వినియోగపరుచుకుని అభివృద్ధికి తోడ్పాటునందించే నాయకులను ఎన్నుకోవాలని గిరిజనులకు ఆమె సూచించారు. కలెక్టర్ నీతూప్రసాద్ గురువారం మారేడుమిల్లి మండలంలో పర్యటించారు. తొలుత ఆమె స్థానిక జెడ్పీ హైస్కూలులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. మారేడుమిల్లిలోని పోలింగ్ కేంద్రాల్లో ఫర్నిచర్, తాగునీటి ఏర్పాట్లు, విద్యుత్‌సరఫరా, వెబ్ సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మారేడుమిల్లి మండలం బంద గ్రామంలో ఓటు వేసేలా ప్రజలను చైతన్య పరచేందుకు ఓటర్లకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలకు బంద గ్రామంలో పోలింగ్ బూత్‌లను నూతనంగా ఏర్పాటు చేసినట్టు ఆమె తెలియజేశారు. సాధారణంగా వెయ్యిమంది ఓటర్లు ఉన్నచోట ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాన్ని కేటాయిస్తుందన్నారు. అయితే గిరిజన ప్రాంతాల్లో దూరభారాలను పరిగణనలోకి తీసుకొని 400 మంది ఓటర్లు ఉన్నప్పటికీ పోలింగ్‌కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గుడిసే గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు, ఆర్డీవో శంకరవరప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణికుమార్, ఈఈ నాగేశ్వరరావు, తహశీల్దారు సుబ్బారావు, రెవెన్యూ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఓటర్ల అవగాహనకు వినూత్న కార్యక్రమం
-
పదోన్నతి
సాక్షి, కాకినాడ :జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్‌కు పదోన్నతి లభించింది. ఆమెకు అదనపు కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2012 ఫిబ్రవరి 24వ తేదీన ఆమె తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. గత రెండేళ్లుగా ఆమె అందిస్తున్న సేవలకు పలు సందర్భాల్లో మంచి గుర్తింపు లభించింది. ఆధార్ నమోదు, వివిధ పథకాలకు అనుసంధానం పరంగా జాతీయస్థాయిలో జిల్లాను అగ్రస్థానం లో నిలపడం కోసం ఆమె ప్రత్యేక శ్రద్ధతో కృషిచేశారు. వంటగ్యాస్‌కు నగదు బదిలీని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు వివిధ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయడంలో కలెక్టర్ నీతూప్రసాద్ కృషి ఉన్నతాధికారుల ప్రశంసలందుకుంది. సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై కూడా నీతూప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కాగా కలెక్టర్‌కు పదోన్నతి లభించడంపై జేసీ ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజు, డ్వామా పీడీ పి.సంపత్‌కుమార్‌తో సహా పలువురు జిల్లా అధికారులు, ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాథ్ తదితరులు అభినందనలు తెలిపారు. -
వీఆర్ఏ,వీఆర్వో పోస్టుల రిజర్వేషన్ రోస్టర్
సాక్షి, కాకినాడ : జిల్లాలో వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి సంబంధించి రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలను కలెక్టర్ నీతూప్రసాద్ ఆదివారం విడుదల చేశారు. డివిజన్ల వారీగా వీఆర్ఏ పోస్టులు మొత్తం 357 కాగా కాకినాడ డివిజన్ నుంచి 49,పెద్దాపురం డివిజన్ నుంచి 41,రాజమండ్రి డివిజన్ నుంచి 43,అమలాపురం నుంచి 129,రంపచోడవరం డివిజన్ నుంచి 28,రామచంద్రపురం డివిజన్ నుంచి 67 ఉన్నాయి. అలాగే వీఆర్ఓ పోస్టులు 87 ఉండగా వీటిలో నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లోని 82 ఖాళీల్లో రిజర్వేషన్ల రోస్టర్ ఇలా ఉంది. ఓసీ జనరల్‌కు 16,ఓసీ మహిళలకు 10,ఎస్సీ జనరల్‌కు 7,ఎస్టీ జనరల్‌కు 5,ఎస్టీ మహిళలకు 3,బీసీ ఎ జనరల్‌కు 4,బీసీ మహిళలకు 3,బీసీ బీ జనరల్‌కు 7,బీసీ బీ మహిళలకు 3, బీసీ సీ జనరల్‌కు 1,బీసీ డీ జనరల్‌కు 7,బీసీ డీ మహిళలకు 2,బీసీ ఈ జనరల్‌కు 4,బీసీ ఈ మహిళలకు 1,ఎక్సు సర్వీసు మెన్ జనరల్‌కు 2, రిజర్వు చేశారు. మిగిలిన అయిదు ఖాళీలు షెడ్యూల్ ప్రాంతాలలో ఎస్టీ జనరల్‌కు 4,ఎస్టీ మహిళలకు 1 రిజర్వు చేశారు. వీఆర్ఏ పోస్టుల రిజర్వేషన్ల వివరాలు ఇక 56 మండలాల్లోని 306 గ్రామాల్లో భర్తీ చేయనున్న 357 వీఆర్ఏ పోస్టులకు కేటగిరీల వారీగా ఓసీ జనరల్‌కు 84,ఓసీ మహిళలకు 46, ఎస్సీ జనరల్‌కు 38,ఎస్సీ మహిళలకు 8,ఎస్టీ జనరల్‌కు 25, ఎస్టీ మహిళలకు 29,బీసీ ఏ జనరల్‌కు 15,బీసీ ఏ మహిళలకు 8,బీసీ బీ జనరల్‌కు 6, బీసీ బీ మహిళలకు 14,బీసీ సీ జనరల్‌కు 17,బీసీ డీ మహిళలకు 18, బీసీ ఈ మహిళలకు 15,ఎక్సు సర్వీస్ మెన్ మహిళలకు 17,వికలాంగ(అంధులు)మహిళలకు 15,హెచ్ హెచ్ జనరల్‌కు 2 రిజర్వు చేశారు. -
‘మంచి నాయకులను ఎన్నుకోండి’
రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : ఓటు హక్కు పొందడం ఎంత ముఖ్యమో, దాన్ని వినియోగించుకోవడం అంతే ముఖ్యమని ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు శశిభూషణ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం రాజమహేంద్రి మహిళా కళాశాల ఆవరణలో 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులను కలసి ఓటు ప్రధాన్యతను వివరించారు. 18 ఏళ్లు నిండిన వారందరూ కచ్చితంగా ఓటు హక్కు పొందాలన్నారు. ఓటు విలువపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. యువతరం పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ ఓటు హక్కుపై ఇంతమంది విద్యార్థులకు అవగాహన ఉండడం అభినందనీయమన్నారు. ఓటు వేయడం ద్వారా హక్కును సద్వినియోగపరచుకోవాలని విద్యార్థినులను కోరారు. జేసీ రేవు ముత్యాలరావు మాట్లాడుతూ చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం 60-70 శాతం మధ్య పోలింగ్ జరుగుతోందని, అది 80-90 శాతానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రి కళాశాలలో 470 మంది విద్యార్థులకు ఓటు హక్కు ఉందని నిర్వాహకుడు రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుగోపాలరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ కన్నన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రాజమహేంద్రి మహిళా కళాశాల కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధికారులను సత్కరించారు. ప్రిన్సిపాల్ ప్రకాశరావు పాల్గొన్నారు.