సాక్షరభారత్‌ అవార్డుకు వీర్నపల్లి | veernapally selected the saksharabarth award | Sakshi
Sakshi News home page

సాక్షరభారత్‌ అవార్డుకు వీర్నపల్లి

Published Fri, Sep 2 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

veernapally selected the saksharabarth award

  • కలెక్టర్‌ నీతూప్రసాద్‌
  • కరీంనగర్‌/ఎల్లారెడ్డిపేట: వందశాతం అక్షరాస్యత సాధించిన ఎంపీ వినోద్‌కుమార్‌ దత్తత గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి సాక్షరభారత్‌ అవార్డుకు ఎంపికైందని కలెక్టర్‌ నీతూప్రసాద్‌ తెలిపారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అవార్డును ఈనెల 8న న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో భారత రాష్ట్రపతి అందజేస్తారని వివరించారు. వీర్నపల్లిలో 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు కృషిచేసిన వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు, గ్రామప్రత్యేకాధికారి, డిప్యూటీ సీఈవో, సంబంధిత జిల్లా అధికారులు, సిరిసిల్ల రెవెన్యూ డివిజనల్‌ అధికారి, గ్రామ, మండల అధికారులు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్‌ అభినందనలు తెలిపారు. సాక్షరభారత్‌ అవార్డు రావడం జిల్లాకు గర్వకారణం అని, దీనిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని ఇతర అన్ని గ్రామాలు 100 శాతం అక్షరాస్యత సాధించుటకు పోటీతత్వంతో కషి చేయాలని పిలుపునిచ్చారు. అవార్డు రావడంపై ఎంపీడీవో చిరంజీవి, జెడ్పీటీసీ తోట ఆగయ్య, ఎంపీపీ ఎలుసాని సుజాత, ఏఎంసీ చైర్మన్‌ అందె సుభాష్, సర్పంచ్‌ మాడ్గుల సంజీవలక్ష్మి, ఎంసీవో మాడ్గుల రాజంయాదవ్‌ హర్షం వ్యక్తంచేశారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement