పదోన్నతి | Collector Neetu Prasad Was promoted | Sakshi
Sakshi News home page

పదోన్నతి

Published Wed, Feb 5 2014 2:22 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Collector Neetu Prasad Was promoted

సాక్షి,  కాకినాడ :జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్‌కు పదోన్నతి లభించింది. ఆమెకు అదనపు కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2012 ఫిబ్రవరి 24వ తేదీన ఆమె తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. గత రెండేళ్లుగా ఆమె అందిస్తున్న సేవలకు పలు సందర్భాల్లో మంచి గుర్తింపు లభించింది. ఆధార్ నమోదు, వివిధ పథకాలకు అనుసంధానం పరంగా జాతీయస్థాయిలో జిల్లాను అగ్రస్థానం లో నిలపడం కోసం ఆమె ప్రత్యేక శ్రద్ధతో కృషిచేశారు. వంటగ్యాస్‌కు నగదు బదిలీని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు వివిధ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయడంలో కలెక్టర్ నీతూప్రసాద్ కృషి ఉన్నతాధికారుల ప్రశంసలందుకుంది. సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై కూడా నీతూప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కాగా కలెక్టర్‌కు    పదోన్నతి లభించడంపై జేసీ ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజు, డ్వామా పీడీ పి.సంపత్‌కుమార్‌తో సహా పలువురు జిల్లా అధికారులు, ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాథ్ తదితరులు అభినందనలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement