Roti Festival
-
కోర్కెలు తీరాలి.. మళ్లీ రావాలి (ఫొటోలు)
-
రొట్టెల పండుగకు రెడీ అయిన దర్గాలు
ముస్తాబవుతున్న సాతో షహీద్ దర్గా కొడవలూరు: మండలంలోని గండవరం సాతో షహీద్ దర్గా రొట్టెల పండగకు ముస్తాబవుతోంది. ఇక్కడ మొహర్రం నెల 13వ రోజున రొట్టెల పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాతో షహీద్ దర్గా ఆవిర్భావానికి ఒక చరిత్ర ఉందని ముస్లిం పెద్లు చెబుతున్నారు. సుమారు 4 వందల సంవత్సరాల క్రితం మత ప్రచారం కోసం 12 మంది ముస్లిం మత ప్రవక్తలు ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ జరిగిన పవిత్రయుద్ధంలో ఏడుగురు ప్రవక్తల తలలు ఈ ప్రాంతంలో పడ్డాయని చెబుతుంటారు. ప్రవక్తల మొండెలు మాత్రం నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద పడ్డాయని అందువల్లే అక్కడ 12 సమాధులతో బారా షహీద్ దర్గా ఆవిర్భవించగా, ఏడు తలలు పడిన చోట సాతో షహీద్ దర్గా నిర్మాణం జరిగిందని నానుడి ఉంది. ఇక్కడి దర్గాలోని ఏడు సమాధులు కూడా మత ప్రవక్తల తలలకు చిహ్నాలేనన్నది ముస్లిం భక్తుల విశ్వాసం. వీరిని మొహరం నెల పదో రోజున హతమార్చినందున ఆ రోజున బారాహహీద్ దర్గాలో రొట్టెల పండగ జరుగుతుందని, ఆ రోజుకు మూడో రోజైన జియారత్ (చిన్న కర్మ) రోజున సాతోషహీద్ దర్గాలో రొట్టెల పండగ నిర్వహించడం జరగడం ఆనవాయితీ. బారాషహీద్ దర్గాకు వచ్చిన భక్తుల్లో చాలా మంది ఇక్కడకూ వచ్చి రొట్టెలు పట్టుకుంటారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారితో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు వచ్చి రొట్టెలు పట్టుకుంటారు. నెల్లూరు నుంచి కావలి వైపు వచ్చే బస్సుల్లో జాతీయ రహదారిపై గండవరం క్రాస్ రోడ్డులో దిగి ఆటోల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. నెల్లూరు నుంచి ఇక్కడికి 15 కిలో మీటర్లు ఉంటుంది. హిందు, ముస్లిం ఆరాధ్య క్షేత్రం అనుమసముద్రంపేట: దక్షిణ భారతదేశంలో మత సామరస్యానికి ప్రతీకగా హిందు, ముస్లింల ఆరాధ్య క్షేత్రంగా ఏఎస్‌పేట దర్గా విరాజిల్లుతుంది. 1747–1750 హిజ్రి శకం మధ్య కాలంలో 1161–1164లో హజరత్ నాయబ్ రసూల్ రహమతాబాద్లో ఆ గ్రామాన్ని నిర్మించారని, వారి కాలంలో నిర్మించిన కట్టడాలు చెబుతున్నాయి. ముస్లింల ఆరాధ్యదైవం అల్ హజ్ హజరత్ సయ్యద్ ఖాజారంతుల్లా ఖాజ హలాం నక్షబంద్, ఖుర్షీద్ బేగం పుణ్యదంపతులకు జన్మించారు. నక్షబంద్ పరమ సాత్వికుడు. అత్యంత దైవభక్తి గలవాడు. ఇరాన్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి బీజాపూర్‌లోని బెల్గాంలో నివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడే నాయబ్ రసూల్ జన్మించారు. చిన్నతనం నుంచి వినయ విధేయతలతో సత్పవర్తనతో మెలిగేవారు. నాయబ్ రసూల్ తల్లి చిన్నతనంలో మరణించడంతో సవతి తల్లి ప్రేమకు నోచుకోక తండ్రి అనుమతితో ఏడేళ్ల వయస్సులోనే పవిత్ర గ్రంధం ఖురాన్ పఠనం పూర్తి చేసి లోకజ్ఞానం సంపాదించారు. అనంతరం దేశాటనకు బయలుదేరి మక్కా మసీదును సందర్శించారు. అక్కడ రసూల్ గురువుల ఆశీర్వాదం పొందారు. తర్వాత కర్నూలు జిల్లా నంధ్యాలకు చేరుకుని కొంత కాలం అక్కడ నివాసముండి తల్లి మరణానంతరం కర్నూలు నవాబు వద్ద సిపాయిగా ఉద్యోగంలో చేరారు. అప్పటికే ఆ ప్రాంతంలో ఘోర కరువు రావడంతో ప్రజలు తీవ్ర వేదనకు గురవుతుండడంతో నాయబ్ రసూల్ తన గురువుల ఆశీర్వాద బలంతో వర్షాలు కురిపించారని చరిత్ర చెబుతుంది. నాయబ్ రసూల్ మహిమలను గుర్తించిన కర్నూలు నవాబు తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. అనంతరం నెల్లూరు జిల్లా ఉదయగిరికి చేరుకున్న ఆయన 1762లో ప్రస్తుత దర్గా ఉన్న ప్రాంతం అనుమసముద్రంపేటకు వచ్చి స్థిర నివాసం ఏర్పర్చుకున్నాడు. ఆయన తన బోధనలు, మహిమలతో ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుని కీర్తి గడించాడు. దర్గాకు వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా రహమతాబాద్లోని దర్గా ప్రాంతంలో కోనేటిని నిర్మించారు. క్రీస్తు శకం 1780లో ఖాజానాయబ్ రసూల్ మరణించడంతో ఆయన సతీమణి హబీబాఖాతూన్ (దొరసానమ్మ) దర్గా నిర్మించారు.దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. దర్గాకు చేరేందుకు మార్గాలు హజరత్ నాయబ్‌రసూల్, దొరసానమ్మ దర్గాకు చేరాలంటే నెల్లూరు రైల్వేస్టేషన్ లేదా బస్టాండ్ నుంచి ఏఎస్‌పేటకు బస్సు వసతి ఉంది. బుచ్చి, సంగం, హసనాపురం మార్గాల మీదుగా చేరవచ్చు. నెల్లూరు నుంచి 55 కిలోమీటర్ల దూరం దర్గాకు చేరవచ్చు. నెల్లూరు నుంచి ఆత్మకూరుకు చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుపాళెం మీదుగా దర్గాకు చేరుకోవచ్చు. 13 కిలో మీటర్ల దూరం ఉంటుంది. మత సామరస్యానికి ప్రతీక కసుమూరు దర్గా వెంకటాచలం: మత సామరస్యానికి ప్రతీకగా కసుమూరు మస్తాన్ వలీ (హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాద్రి ఉరఫ్ కాలేషా పీర్ మస్తాన్ వలీ) దర్గా విరాజిల్లుతోంది. హిందూ, ముస్లింలు ఆరాధ్య దైవంగా భావించే మస్తానవలీ దర్గా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగా గుర్తింపు పొందింది. దేశ నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి భక్తులు దర్గాకు హాజరవుతారు. నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా వద్ద మంగళవారం నుంచి రొట్టెల పండగ ప్రారంభం కానుండటంతో కసుమూరు దర్గాకు భక్తుల తాకిడి పెరుగుతోంది. రొట్టెల పండగ నుంచి కసుమూరుకు.. బారాషహీద్ వద్ద రొట్టెల పండగకు వచ్చే భక్తులు కసుమూరు మస్తాన్‌వలీ దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నెల్లూరు నుంచి కసుమూరు దర్గాకు చేరుకునేందుకు భక్తులు నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి నేరుగా కసుమూరు బస్సులు నడుపుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు కసుమూరుకు అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు నగరం నుంచి కసుమూరుకు 25 కిలో మీటర్ల దూరం ఉంది. ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తులు బారాషహీద్ దర్గా నుంచి పొదలకూరు రోడ్డు మీదుగా పాలిచెర్లపాడు అడ్డరోడ్డు నుంచి కసుమూరుకు చేరుకోవచ్చు. బారాషహీద్ దర్గా నుంచి అయ్యప్పగుడి, వెంకటాచలం మీదుగా కసుమూరుకు చేరుకోవచ్చు. దీంతో కసుమూరులో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండగకు వచ్చే భక్తులంతా వేల సంఖ్యలో కసుమూరు దర్గాను దర్శించుకోనుండటంతో వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంపీడీఓ సరళ కసుమూరులో భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రణాళికలు తయారు చేశారు. తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. చిల్లకూరులో దో షహీద్ దర్గా.. చిల్లకూరు: నెల్లూరులోని బారాషహీద్ దర్గాకు అనుబంధంగా అంతటి ప్రాముఖ్యం ఉన్న చిల్లకూరులోని దో షహీద్ దర్గాలో ఈ నెల 12న రొట్టెల పండగ నిర్వహణకు ముస్తాబు చేస్తున్నారు. కొడవలూరు మండలం గండవరం వద్ద జరిగిన పవిత్ర యుద్ధంలో సయ్యద్ అహ్మద్ షా, సయ్యద్ మహ్మాద్ షా అనే వీరుల తలలు తెగి అక్కడ నుంచి గుర్రాలపై మొండాలు ఇక్కడికి వచ్చి పడి పోవడంతో చిల్ల కూరు ముఖ ద్వారంలో ఉన్న దో షహీద్ దర్గాను వందల ఏళ్ల క్రితం నిర్మించారని ప్రతీతి. బొబ్బిలికి చెందిన ఒక మహారాణి ఈ మార్గంలో చెన్నైకు పయనిస్తూ ఇక్కడ విశ్రమించడంతో ఆమెకు కలలో దోషహీద్లు కనిపించాయి. అవి దర్గాను అభివృద్ధి చేయాలని చెప్పడంతో వారు సహకారంతో అప్పటి నుంచి ఇక్కడ నెల్లూరులో రొట్టెల పండగ జరిగిన మూడో రోజు చిల్లకూరులో రొట్టెల పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నెల 12న రొట్టెల పండగ, 25వ తేదీ గంధోత్సవం నిర్వహిస్తున్నట్లు దర్గా ముతవల్లి జుబేర్‌బాషా తెలిపారు. నెల్లూరు బారాషహీద్ దర్గాను దర్శించుకున్న భక్తులు దో షహీద్ దర్గాను దర్శించుకోవాలంటే బస్సులో గూడూరు వరకు వచ్చి అక్కడ నుంచి ఆటోలో రావచ్చు. ప్రత్యేక వాహనాల్లో వచ్చే వారైతే నేరుగా జాతీయ రహదారిలోని గూడూరు సర్కిల్ వరకు వచ్చి అక్కడ నుంచి ఒక కి.మీ. దూరంలోని దర్గా వద్దకు చేరుకోవచ్చు . వేనాడులో మహిమాన్విత షావలీ దర్గా తడ: తడ మండలం వేనాడులోని షేక్ దావూద్ షావలీ అల్లా మహిమాన్విత బాబా దర్గాగా ప్రసిద్ధి చెందారు. నెల్లూరులో జరిగే రొట్టెల పండగ హాజరయ్యే భక్తులు చాలా మంది వేనాడు దర్గాను కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి నెల్లూరు వెళ్లే భక్తులు కొంత మంది తొలుత వేనాడు బాబా దర్శనం చేసుకుని వెళుతుండగా, మరి కొందరు నెల్లూరులో పండగ అనంతరం వేనాడుకు వస్తున్నారు. దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం దర్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 144 అడుగుల పొడవుతో ఆసియాల్లోనే అత్యంత పొడవైన దర్గాగా వేనాడు దర్గాకు పేరుంది. తీరని కోర్కెలు ఉన్నవారు, కోరికలు తీరిన వారు అమావాస్య రోజున బాబా దర్గా వద్ద నిద్ర చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివారం అమావాస్య రోజున వేలాదిగా భక్తులు తరలివచ్చి నిద్ర చేస్తారు. దర్గా వద్ద ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా గంధోత్సవం నిర్వహిస్తారు. నెల్లూరు నుంచి సూళ్లూరుపేట వచ్చి అక్కడ నుంచి శ్రీహరికోట మార్గంలో 17 కిలో మీటర్లు ప్రయాణించిన తర్వాత అటకానితిప్ప వద్ద నుంచి కుడి వైపునకు గ్రావెల్‌రోడ్డు వెళ్తుంది. ఆ మార్గంలో 11 కిలో మీటర్లు ప్రయాణిస్తే దర్గాకి చేరుకోవచ్చు. సూళ్లూరుపేట నుంచి నిర్ణీత వేళల్లో ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా జీపులు, ఆటోల సౌకర్యం ఉంది. -
వరాల రొట్టె.. ఒడిసి పట్టు
రెండున్నర శతాబ్దాలకుపైగా నమ్మకానికి, మత సామరస్యానికి ప్రతీకగా రాష్ట్రానికే ప్రతిష్టాత్మకంగా జరిగే రొట్టెల పండగకు నెల్లూరు నగరం ముస్తాబైంది. ఏటా మొహర్రం పండగ రోజు రొట్టెల పండగ ప్రారంభం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, సౌదీ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న క్రమంలో అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో జరుగుతున్న మొదటి పండగ కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 10న ప్రారంభమయ్యే రొట్టెల పండగ 14వ తేదీ వరకు జరగనుంది. నెల్లూరు నగరపాలక సంస్థ, జిల్లా పోలీసు యంత్రాంగం, నీటి పారుదల శాఖ, పలు శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్గా ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వరాల రొట్టెల పండగ వచ్చేసింది. కోరుకున్న కోర్కెలు తీరి వదిలే వరాల రొట్టెను.. కోర్కెలతో ఒడిసి పట్టుకునేందుకు భక్తులు వచ్చేశారు. హిందూ, ముస్లిం మతాల సామరస్యానికి ప్రతీకగా జరిగే పండగ మంగళవారం షహదాత్‌తో ప్రారంభమవుతుంది. 11న గంధం మహోత్సవం, 12న రొట్టెల పండగ 13న తహలీల్ ఫాతేహా, 14న ముగింపు సభతో రొట్టెల పండగ ముగియనుంది. గతేడాది ఉత్సవాలకు 10 లక్షల మంది హజరయ్యారు. దానిని ప్రామాణికంగా తీసుకొని అధికారులు ఈ ఏడాది కూడా ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రూ.1.57 కోట్లతో దర్గా ప్రాంగణంలో తాగునీరు, విద్యుత్, పారిశుధ్య, ఇతర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే రెండు రోజుల నుంచి దర్గాలో భక్తు రద్దీ బాగా పెరిగింది. విద్యుత్ వెలుగులో బారాషహీద్ దర్గా ప్రాంగణం ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తుల రాక ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. రొట్టెల పండగకు రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, రాష్ట్రాలతో పాటు దుబాయ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువులో నీటి నిల్వలను ఉండేలా చర్యలు తీసుకున్నారు. ముందుగానే సోమశిల నుంచి నీరు విడుదల చేసి 11.5 అడుగుల మేర నీటి మట్టం తగ్గకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. మరో వైపు భక్తుల రద్దీ దృష్ట్యా నీటి శుద్ధి కోసం మంగళవారం నుంచి 300 క్యూసెక్ల నీటిని విడుదల చేసేలా అన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు నీటిని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయడానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. రాష్ట్ర నీటిపారదుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, నెల్లూరు నగర కమిషనర్ మూర్తి నిరంతరం దర్గా ప్రాంగణంలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రొట్టెల పండగలో 11, 12 తేదీలో భారీగా భక్తులు తరలిరానుండటంతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు ముందస్తుగా చేపట్టారు. వర్షాల వల్ల ఇబ్బంది వస్తే ప్రాంగణంలో ఉండే భక్తుల కోసం అందుబాటులో ఉన్న రెండు కల్యాణ మండలపాలను బస కోసం సిద్ధం చేసి ఉంచారు. అన్ని విభాగాల అధికారులు మంగళవారం నుంచి రొట్టెల పండగ విధుల్లో ఉంటారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ దర్గా ప్రాంగణంలో 48 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని దర్గా ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. 1,891 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు రొట్టెల పండగకు వచ్చే వారి సంఖ్యను గుర్తించటానికి ప్రత్యేకంగా సాప్ట్వేర్ సిద్దం చేశారు. అలాగే నగరంకు అన్ని వైపుల నుంచి వచ్చే వాహనాలకు వీలుగా 14 చోట్ల పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మూడు షిప్టుల్లో 4,500 మంది కార్మికులు రొట్టెల పండగ నేపథ్యంలో మూడు షిప్టుల్లో 4,500 మంది పారిశుధ్య కార్మికులు దర్గాలో, నగరంలో పని చేయనున్నారు. నీటిని శుభ్ర చేయడం మొదలుకొని దర్గా పరిశుభ్రంగా ఉంచడం వరకు అన్ని పనులు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు హాజరయ్యే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది 63 మందిని విధులకు కేటాయించారు. అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఎస్పీ ఐశ్వర్యరస్తోగి సూచించారు. మంగళవారం రొట్టెల పండగ ప్రారంభం కానుంది. జిల్లాతోపాటు ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 2,500 మంది సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్పీ బారాషహీద్ దర్గాను పరిశీలించి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. అనంతరం పోలీసు కవాతు మైదానంలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. 11వ తేదీ రాత్రి గంధ మహోత్సవం, 12వ తేదీ ప్రధానమైన రోజులన్నారు. ఆ రోజుల్లో పెద్దసంఖ్యలో భక్తులు దర్గాను దర్శించుకుంటారన్నారు. దర్గాలోకి ప్రవేశించే ద్వారం వద్ద, దర్శనం అయ్యాక బయటకు వచ్చేద్వారాల వద్ద ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్వర్ణాల ఘాట్ వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. క్రైమ్ పార్టీలు విస్తృతంగా తిరుగుతూ నేరాలు జరగకుడా చూడాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలన్నారు. జిల్లా అధికారులందరూ ఇతర జిల్లాల నుంచి బందోబస్తు విధులకు హాజరైన సిబ్బందిని సమన్వయం చేసుకుని పండగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. ట్రాఫిక్ సిబ్బంది విధిగా రేడియం జాకెట్లు, హ్యాండ్సిగ్నల్ బ్యాట్లు వెంట ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
10 నుంచి రొట్టెల పండుగ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షాహిద్ దర్గాలో ఈనెల 10వ తేదీ నుంచి 14వరకు రొట్టెల పండుగ జరుగనుంది. రాష్ట్ర పండుగ హోదా కలి్పంచిన నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 10న షహదాత్‌తో ప్రారంభమయ్యే రొట్టెల పండుగ 14న ముగియనుంది. ఆంధ్రా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు సౌదీ దేశాల్లో ఉంటున్న ముస్లింలు తరలివస్తారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు హాజరై వారి కోర్కెలకు అనుగుణంగా రొట్టెలు వదులుతారు. పది లక్షల మంది భక్తులకు సౌకర్యం కలి్పంచేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా బారా షాహిద్ ప్రాంగణాన్ని ముస్తాబు చేయడంతో పాటు కోర్కెల రొట్టెలు ఇచ్చే పవిత్ర స్వర్ణాల చెరువులో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారు. 11న గంధం మహోత్సవం.. రొట్టెల పండుగలో కీలకమైన గంధం మహోత్సవం ఈనెల 11వ తేదీన జరుగనుంది. 11న రాత్రి భారీ ఉరేగింపుగా గంధను దర్గాకు తీసుకొచ్చి బారా షాహిద్‌లకు సమరి్పస్తారు. కార్యక్రమంలో కడప పెద్ద దర్గా పీఠాధిపతి హజరత్ ఆరీపుల్లా హుస్సేని పాల్గొంటారు. 10వ తేదీన షహదాత్, 11న గంధ మహోత్సవం, 12న రొట్టెల పండుగ, 13న తహలీల్ ఫాతేహ, 14న ముగింపు సభ జరుగుతుంది. -
భక్త సాగరమై..
విద్య.. ఉద్యోగం.. పెళ్లి.. సంతానం.. ఆరోగ్యం.. సౌభాగ్యం.. తదితర తమ కోరికలు తీరాలంటూ భక్తులు స్వర్ణాల చెరువు బాట పట్టారు. కుల, మతాలకు అతీతంగా, మత సామరస్యాలకు ప్రతీకగా నిలిచే వరాల పండగ శుక్రవారం ప్రారంభమైంది. రొట్టెల పండగ కోసం రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల నుంచి లక్షలాది మంది భక్తులు నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాకు తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో పుణ్య స్నానాలు ఆచరించి రొట్టెలు వదిలారు. మతబోధకులైన యుద్ధవీరుల త్యాగనిరతిని స్మరిస్తూ సమాధులను దర్శించారు. తొలి రోజు సుమారు 2 లక్షల మంది తరలివచ్చారని అధికార వర్గాలు అంచనా. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో కీలక ఘట్టమైన గంధమహోత్సవం శనివారం అర్ధరాత్రి జరగనుంది. నెల్లూరు సిటీ: మతసామరస్యాలకు అతీతంగా నిర్వహించే రొట్టెల పండగ శుక్రవారం ప్రారంభమైంది. శుక్రవారం భక్తులు స్వర్ణాల చెరువు ఘాట్‌కు పోటెత్తారు. నగరంలోని దర్గామిట్టలోని బారాషహీద్ దర్గాలో ప్రతి ఏటా రొట్టెల పండగ ఘనంగా నిర్వహిస్తున్నారు. బారాషహీదులను దర్శించుకుని రొట్టెను పట్టుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. కోరికలు తీరిన భక్తులు మళ్లీ తిరిగి రొట్టెను వదలడం ఆనవాయితీ. మొదటి రోజు ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల నుంచి అధికంగా భక్తులు తరలివచ్చారు. 10 రొట్టెల బోర్డులు ఏర్పాటు బారాషహీద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు పట్టుకునే భక్తుల కోసం కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెరువు వద్ద భక్తులు తమకు కావాల్సిన రొట్టెను సులువుగా గుర్తించి పట్టుకునేందుకు బోర్డులు ఏర్పాటు చేశారు. వ్యాపార, నూతనగృహం, ప్రమోషన్, సౌభాగ్యం, ఆరోగ్యం, సంతానం, వివాహం, ఉద్యోగం, విద్య, ధన రొట్టెల బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ బోర్డుల వద్దకు భక్తులు వచ్చి రొట్టెలు పట్టుకుంటున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో.. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు, ఇతరశాఖలు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఘాట్ నిర్వహణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఘాట్ వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసింది. నగరంలో వాహనాలు పార్కింగ్ చేసేందుకు 10 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రాంతాల్లో మొత్తం 120 మొబైల్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు. రాత్రుళ్లు విద్యుత్ వెలుగులు కోసం దర్గా ఆవరణలో ప్రత్యేకంగా స్తంభాలు ఏర్పాటు చేశారు. బారాషహీద్ దర్గా రోడ్డుకు ఇరుçవైపులా బారికేడ్లు.. బారాషహీద్ దర్గాకు వచ్చే క్రమంలో బయట వాహనాలు రానివ్వకుండా రెండు వైపులా పోలీసు శాఖ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే బారాషహీద్ దర్గా ఆవరణకు పంపిస్తున్నారు. దర్గాలో పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. 40 సీసీ కెమరాలతో, డ్రోన్ కెమరాలతో బారాషహీద్ దర్గా ప్రాంగణంలో నిఘా ఏర్పాటు చేసింది. పోలీస్ శాఖ నుంచి 2 వేలు మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. దర్గా ప్రాంగణంలో 50 సీసీ కెమరాలతో ప్రతి క్షణం నిఘాను ఏర్పాటు చేశారు. పోలీస్ అవుట్‌పోస్టు ద్వారా తప్పిపోయిన చిన్నారులు, వృద్ధులను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. విధుల్లో నలుగురు మున్సిపల్ కమిషనర్లు రొట్టెల పండగకు జిల్లాలోని నలుగురు మున్సిపల్కమిషనర్లు విధుల్లో ఉన్నారు. ఆత్మకూరు కమిషనర్ శ్రీనివాసులు, నాయుడుపేట కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, కావలి కమిషనర్ వెంకటేశ్వర్లు, గూడూరు కమిషనర్ ఓబిలేష్కు దర్గాలోని కొన్ని ప్రాంతాలను కేటాయించారు. మూడు షిఫ్ట్‌లుగా విధులు నగర పాలక సంస్థ నుంచి 350 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. దర్గాను ఏడు జోన్లుగా విభజించి టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ శాఖల ఉద్యోగులకు విధులు కేటాయించారు. కమిషనర్ అలీంబాషా, అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇంజినీరింగ్ ఎస్ఈ రవికృష్ణంరాజు దర్గాలో ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. పారిశుద్ధ్యం ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు కాంట్రాక్ట్ పద్ధతిన 800 మంది కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించుకున్నారు. వీరందరికీ మూడు షిఫ్ట్‌లుగా విధులు కేటాయించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 320 మంది, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు 320 మంది రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు షిఫ్ట్‌కు 300 మంది కార్మికులు పనిచేస్తారు. నేడు గంధమహోత్సవం రొట్టెల పండగలో రెండో ఘట్టం గంధమహోత్సవం శనివారం జరగనుంది. కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 గంధపు బిందెలతో ఊరేగింపుగా సాగి ఈద్గాకు చేరుతుంది. అక్కడ ఫకీర్ల విన్యాసాల నడుమ గంధాన్ని దర్గాకు తీసుకువస్తారు. అక్కడ కడప పీఠాధిపతి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం గంధాన్ని సమాధులకు పూసి, భక్తులకు పంచుతారు. -
నెల్లూరు: రొట్టెల పండుగ ప్రారంభం
-
నేటి నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ
-
తొలి రోజే పోటెత్తిన భక్తులు
కులమతాలకు అతీతకంగా నిర్వహించే రొట్టెల పండగ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజే బారాషహీద్ దర్గాకు భక్తులు పోటెత్తారు. కోర్కెలు తీరిన వారు రొట్టెలు వదిలేందుకు, వరాలు కోరుకునే వారు పట్టుకునేందుకు జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చారు. దీంతో స్వర్ణాల చెరువు వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. నెల్లూరు సిటీ: బారాషహీద్ దర్గాలో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన రొట్టెల పండగకు ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన భక్తులు అధికంగా తరలి వచ్చారు. తొలి రోజు వివాహ, విద్య, ఉద్యోగ రొట్టెలు అధిక శాతం మంది అందుకున్నారు. నగర పాలక సంస్థ అధికారులు భక్తుల సౌకర్యార్థం రొట్టెల పేర్లుతో కూడా బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ బోర్డు వద్ద రొట్టెలు వదిలేవారు, అందుకునే వారు సులభంగా వెళ్లేందుకు వీలు కల్పించారు. అన్ని శాఖల సమన్వయంతో దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఘాట్ నిర్వహణ కార్పొరేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతోంది. ఘాట్ వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసింది. ప్రమాదాలు సంభవించకుండా «అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో వాహనాలు పార్కింగ్ చేసేం దుకు 10 స్థలాలు ఏర్పాటు చేశారు. దర్గా రోడ్డుకు ఇరుçవైపులా బ్యారికేడ్లు బారాషహిద్ దర్గాకు వచ్చే క్రమంలో వాహనాలు రానివ్వకుండా రెండు వైపులా పోలీసు శాఖ బ్యారి కేడ్లు ఏర్పాటు చేసింది. పాస్‌లు ఉన్నవారి వాహనాలు మాత్రమే పంపిస్తున్నారు. దర్గాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. డ్రోన్ కెమెరాలతో దర్గా ప్రాంగణంలో నిఘా ఏర్పాటు చేసింది. 40సీసీ కెమెరాలతో దర్గా ఆవరణలో ఏమి జరుగుతుందో పోలీసు శాఖ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. విధుల్లో నలుగురు మున్సిపల్ కమిషనర్లు రొట్టెల పండగకు జిల్లాలోని నలుగురు మున్సిపల్ కమిషనర్లు విధుల్లో ఉన్నారు. వెంకటగిరి, గూడూ రు, ఆత్మకూరు, కావలి కమిషనర్లు నరేంద్రకుమార్, చంద్రశేఖర్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు పండగ ఏర్పాట్ల పర్యవేక్షణ విధులు కేటాయించారు. గతంలో పనిచేసిన కార్పొరేషన్ కమిషనర్ కరణం వెంకటేశ్వర్లను పండగ ఏర్పాట్లు చూసుకునేందుకు మంత్రి నారాయణ ప్రత్యేకంగా పిలిపించారు. మూడు షిఫ్ట్‌లుగా విధులు నగర పాలక సంస్థ నుంచి 350 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. దర్గా, స్వర్ణాల చెరువు పరసరాలు శుభ్రం చేసేందుకు కాంట్రాక్ట్ పద్ధతిన 830 మంది కార్మికులను తీసుకున్నారు. వీరందరికీ మూడు షిఫ్ట్‌లుగా విధులు కేటాయించారు. శానిటరీ సూపర్వైజర్ శివనాగేశ్వరరావు కార్మికులకు విధులు కేటాయించారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు 320 మంది, మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి 10 గంటల వరకు 320 మంది రాత్రి 10 నుంచి ఉదయం ఆరు గంటల వరకు 190 మంది కార్మికులు పనిచేస్తారు. సేవా కార్యక్రమాలు రొట్టెల పండగకు వచ్చే లక్షల మంది భక్తులకు నీరు, మజ్జిగ, భోజనాలు కల్పించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. భారతీ సిమెంట్, సీఎంఆర్ షోరూమ్ ని ర్వాహకులు నీరు, మజ్జిగ ఉచితంగా పంపిణీ చేశా రు. మేయర్ అబ్దుల్ అజీజ్‌కు చెందిన హాజీ అబ్దుల్ అజీజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా అన్నదానం చేశారు. ఆదివారం రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని మేయర్ అజీజ్ ప్రారంభించారు. -
ముందుగానే మొదలైన సందడి
నెల్లూరు (మినీబైపాస్): బారాషహీద్ దర్గా రొట్టెల పండగకు ముందే సందడి మొదలైంది. అక్టోబరు 1వ తేదీ పండగ ఆరంభం కానున్న నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తుల రాక గురువారం నుంచే ప్రారంభమైంది. కుల మతాలకు అతీతంగా జరిగే పండగలో అందరూ పాల్గొంటారు. గురువారం భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలను అందుకోవడం, మార్చుకోవడం చేశారు. రొట్టెల పండగకు మూడు రోజుల ముందే భక్తుల రాకతో సందడిగా మారింది. చెరువులో రొట్టెలు మార్చుకుని దర్గా వద్ద సమాధులను దర్శించుకుంటున్నారు. కోర్కెలు నెరవేరాయి వైజాగ్ నుంచి పోయిన సంవత్సరం వచ్చి కుమార్తెకు పెళ్లి కావాలని రొట్టెను పట్టుకొన్నాం. పాపకు పెళ్లయింది. తీరిన కోర్కె రొట్టెను వదిలేందుకు వచ్చాము. చాలా సంతోషంగా ఉంద. – హసన్ వాల్, ఖాదర్ బీ పిల్లల కోసం రొట్టెలు పట్టుకున్నాం నంద్యాల నుంచి వచ్చాము. మాకు పిల్లలు లేకపోవడంతో పిల్లల కోసం రొట్టెను పట్టుకోవడానికి ఎంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. పండగ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందుగానే వచ్చేశాం. – కరిముల్లా, ఖమర్ కుమార్తె పెళ్లి కోసం బెంగళూరు నుంచి ఐదేళ్లుగా వచ్చి రొట్టెను పట్టుకొంటున్నాం. మాకు అనుకొన్నది అనుకొన్నట్టుగా జరిగాయి. ఇప్పుడు కుమార్తె పెళ్లి కోసం వచ్చాము. ఉద్యోగ రీత్యా సెలవు దొరకకపోవడంతో ముందుగానే వచ్చాం. – షబానా ప్రభుత్వ ఉద్యోగం కోసం వరంగల్ నుంచి వచ్చాము. మేము రావడం నాల్గో సారి. చదువు రొట్టెను పట్టుకొన్నా..చదువు పూర్తయింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం రొట్టెను పట్టుకొన్నాం. మా అమ్మకు ఆరోగ్యం సరిగా లేదు ఆరోగ్య రొట్టెను కూడా పట్టుకొన్నాం. – అభిజి బీ, పర్వీన్ -
వరాల పండగ ప్రారంభం
-
రొట్టెల పండుగకు భారీ బందోబస్తు
-
రొట్టెల పండగకు విస్తృత ఏర్పాట్లు
మంత్రి నారాయణ నెల్లూరు(బృందావనం):రొట్టెల పండగకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ తెలిపారు. పండగ ఏర్పాట్లను ఆదివారం రాత్రి మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 20వ తేదీన రూ.6కోట్లతో ఘాట్లు, సేదతీరేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దర్గా అభివృద్ధికి ముఖ్యమంత్రి ఆదివారం మరో› రూ.5కోట్లు మంజూరు చేశారని తెలిపారు. భవిష్యత్తులో బారాషహీద్దర్గాను ఉన్నతమైన ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నామన్నారు. ఆక్రమణలను ప్రణాళికాబద్ధంగా తొలగిస్తాం నగరంలోని ఆక్రమణలను ప్రణాళికాబద్ధంగా తొలగిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నిర్వాసితులకు కొత్తూరులో గృహ వసతి సదుపాయం కల్పించనున్నామన్నారు. రానున్న మరో రెండు నెలల్లో కురిసే వర్షాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సూచనలు, సలహాల మేరకు ఆక్రమణల తొలగింపు జరుగుతుందన్నారు. తాను ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదన్నారు. కొందరు ఎమ్మెల్యేలు తనపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. టీడీపీ నెల్లూరురూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రొట్టెల పండగ నిర్వహణకు సంబంధించిన ఫెస్టివల్ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా షేక్ జంషీద్, పఠాన్ ఇమ్రాన్‌ఖాన్‌లను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో మేయర్ అబ్దుర్ అబ్దుల్అజీజ్, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి తిరుపతినాయుడు పాల్గొన్నారు. -
కనుల పండువగా గంధ మహోత్సవం
-
మూడో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగ
-
ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండగ
-
ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండగ
-
ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండగ
నెల్లూరు నగరంలోని ప్రఖ్యాత బారా షహీద్ దర్గాలో రొట్టెల పండగ శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం నిండిపోయింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండగకు సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. మొహరం నెలలో మెదటి రోజు అయిన షహదత్ తో ఏటా ఈ రొట్టెల పండగ మొదలైతుంది. మొదటి రోజుతోపాటు మూడో రోజు జియారత్ కీలక దినాలుగా భక్తులు భావిస్తారు. గతంలో అయితే, షహదత్ నాడు మాత్రమే రొట్టెల పండగ జరిగేది. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో నిర్వహణ రోజులను కూడా పొడిగిస్తూ వస్తున్నారు. భక్తులు కోర్కెలు నెరవేరడానికి రొట్టెలను కొనుగోలు చేసి... అప్పటికే కోర్కెలు నెరవేరిన వారితో వాటిని మార్పిడి చేసుకుంటారు. ఈ ఏడాది దర్గా పక్కనే ఉన్న చెరువు మధ్యలో వేదికను ఏర్పాటు చేసి... రొట్టెల పండగ చరిత్రను తెలియజేప్పేలా లేజర్ షో, ఫైర్ షో ఏర్పాటు చేశారు. -
నెల్లూరులో రొట్టెల పండుగ సందడి