Rowdys
-
వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ బరితెగింపు
-
అ‘రాజకీయం’
రోజుకో హత్యతో అట్టుడుకుతున్న విశాఖలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కొత్తగా పెంచిపోషిస్తున్న విష సంస్కృతి మరింత అలజడి రేపుతోంది. గతంలో సంచలన హత్య కేసులు ఎదుర్కొని రౌడీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సదరు ఎమ్మెల్యేపై ప్రస్తుతానికి మోసాల చిట్టా తప్ప ‘రికార్డెడ్’గా నేరచరిత(?) లేదు. అదేవిధంగా.. ఇప్పుడు నగరంలో జరుగుతున్న హత్యలకూ అతనికి సంబంధం లేదు.. హంతకులెవరో, బాధితులెవరో కూడా ఆయనకు తెలియదు. కానీ.. హత్యలు చేసి కష్టాల్లో’ ఉన్న నేరగాళ్లకు ఆయన షెల్టర్ ఇస్తున్నారన్న వాదనలే కలకలం రేపుతున్నాయి. దీని వెనుక ఆయన రాజకీయ ‘దురాలోచన’ కనిపిస్తోంది. ఇప్పుడు వారికి ‘సహకారం’ అందిస్తే భవిష్యత్తులో.. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో తనకు అండగా ఉంటారని, లేదా తన అడ్డాలోనే ‘పడి’ ఉంటారన్న ముందస్తు నేరపూరిత యోచనతో సదరు టీడీపీ నేత చేస్తున్న నయా రాజకీయం సంచలనమవుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖలో రౌడీషీటర్లు, నేరస్తులు అంతా కట్టకట్టుకుని ఎక్కడుంటారు?.. అని అడిగితే ఓ టీడీపీ ఎమ్మెల్యే పేరే సమాధనమవుతుంది. అధికార పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే కార్యాలయం కొన్నేళ్లుగా నేరచరితులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందనేది అందరికీ తెలిసిన వాస్తవం. సహజంగానే నేరచరిత ఉన్న సదరు నేత మాస్ అప్పీల్ ముసుగులో తొలుత చిన్నపాటి ఘర్షణలు చేసే వారిని వెనకేసుకుని తిరుగుతూ వచ్చాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ‘పరిధి’ పెంచాడు. రౌడీషీటర్లకు సపోర్ట్ చేసేవాడు. నగరంలో ఎక్కడ గలాటా జరిగినా బాధ్యులైన నిందితులకు ఆయన ఇల్లు, కార్యాలయాలు అడ్డాగా మారిపోయాయి. అలాగని ఆయనపై ప్రస్తుతం క్రిమినల్ కేసులేమీ లేవు. గతంలో ఓ సంచలన హత్య కేసులో నిందితునిగా ఉన్నప్పటికీ దాన్ని కోర్టు కొట్టివేసింది. ఆర్ధికపరమైన వివాదాలు, భూ కబ్జా కేసులు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. కానీ హత్య కేసుల్లోని నిందితులకు, వివాదాస్పద వ్యక్తులకు సదరు ఎమ్మెల్యే షెల్టర్ ఇస్తున్నాడన్న వాదనలు బలంగా ఉన్నాయి. ఆ నిందితులకు అండ? విశాఖలో ఇటీవలి కాలంలో హత్యా సంస్కృతి పెచ్చుమీరిపోయింది. కట్టడి చేయాల్సిన బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి ఆయా కేసుల్లో ప్రధాన నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకోమని తన వర్గీయులను పురమాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నగరంలో ఈమధ్య కాలంలో జరిగిన రెండు హత్య కేసుల్లో నిందితులకు సదరు ఎమ్మెల్యే అనుచరులు అండగా నిలుస్తుండటం వివాదాస్పదమవుతోంది. వాస్తవానికి ఆ హత్యలతోనూ.. ఆ నిందితులతోనూ ఎమ్మెల్యేకి గానీ, ఆయన అనుచరులకు గానీ ఎటువంటి సంబంధాలు లేవు. కానీ హత్యలు, ఇతర నేరాలు చేసి కేసుల్లో ఇరుక్కున్న వారికి ఒకింత అండగా నిలబడితే.. ‘కష్టకాలంలో ఉన్నప్పుడు ఫలానా ఎమ్మెల్యే మనకు సపోర్ట్ చేశారు.. ఆయన కోసం మనం ఏదైనా చేద్దాం’.. అనే ఇంప్రెషన్ కోసం, నేరస్తులను కూడగట్టుకోవడం కోసమే సదరు ఎమ్మెల్యే ఇలాంటి అనైతిక రాజకీయాలకు తెరలేపాడన్న వాదనలు ఉన్నాయి. ఎన్నికల వేళ ఈ తరహా నేరస్తులను అవసరమైన చోట్ల దందాలకు వినియోగించాలన్నదే సదరు ఎమ్మెల్యే ప్లాన్‌గా తెలుస్తోంది. గత ఎన్నికల్లో కూడా ఇదే మాదిరి రాజకీయాలకు ఆయన పాల్పడ్డాడనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఈ క్రమంలో ఇటీవల జరిగిన హత్య కేసులు, వివాదాల్లో నిందితులకు ఎమ్మెల్యే మనుషులు ఆర్ధిక సాయం చేయడంతో పాటు పోలీస్స్టేషన్లలో థర్డ్ డిగ్రీ యాక్షన్లు లేకుండా చూడటం, అవసరమైతే లాయర్లను ఏర్పాటు చేయడం వంటి సాయం చేస్తున్నారని తెలుస్తోంది. ..అందుకే ఆ ఎమ్మెల్యేకు దూరమైన పోలీసు అధికారి వర్గ సమీకరణల నేపథ్యంలో నగరానికి చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి మొదట్లో సదరు ఎమ్మెల్యేకు బాగానే ప్రాధాన్యత ఇచ్చారు. తదనంతర కాలంలో అతని వ్యవహారం, నేరస్తులకు అండగా నిలుస్తున్న వైనం పోలీసు అధికారికి కళ్లకు కట్టినట్టు కనపడింది. వివాదాలకు ఏమాత్రం తావు లేకుండా ఉండాలని తాపత్రయపడే ఆ అధికారి ఇక మొహమాటాలకు పోకుండా ఇటీవలి కాలంలో సదరు ప్రజాప్రతినిధిని దూరం పెట్టారని అంటున్నారు. అయితే ఆ ఎమ్మెల్యే మాత్రం ‘పోలీసులకు మనం ఎంత చెబితే అంత.. ఆ పోలీసు అధికారి మనోడేనన్న’ రీతిలో ఇంకా కిందిస్థాయి పోలీసు అధికారుల వద్ద హల్చల్ చేస్తున్నారన్న వాదనలున్నాయి. -
పట్టపగలే ఇంటర్ విద్యార్థి కిడ్నాప్
మదనపల్లె క్రైం: మదనపల్లెలో రౌడీలు రెచ్చిపోయారు. కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న ఓ విద్యార్థిని సోమవారం పట్టపగలే కిడ్నాప్‌చేశారు. పొలాల్లోకి తీసుకెళ్లి చితకబాదారు. విషయం బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించి చివరకు చీకటిపడ్డాక అక్కడే వదలిపెట్టి వెళ్లిపోయారు. పట్టణంలో ఈ ఘటన తీవ్రకలకలం రేపింది. బాధితుని కుటుంబీకులు, పో లీసుల కథనం మేరకు... మదనపల్లె పట్టణం నక్కలదిన్నె తాం డాలో నివాసం ఉంటున్న కాట్లగంటి రవికుమార్, గీత దంపతుల కుమారుడు వేణుమాధవ్ (16) స్థానిక బెంగళూరు రోడ్డులో లయన్స్ క్లబ్ ఎదురుగా ఉన్న ఓ కార్పొరేట్ కళాశాలలో ఇం టర్ మొదటి సంవత్సరం ఎంఈసీ చదువుతున్నాడు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే పరీక్ష రాయడానికి అతడు కళాశాలకు వెళ్లాడు. పరీక్ష రాసి కళాశాల బయటకు రాగానే సిపాయి వీధికి చెందిన కొందరు రౌడీషీటర్లు అతని వెంటపడ్డారు. నడచుకుంటూ ఇంటికి వెళుతున్న అతడిని కోర్టు సమీపంలో దారి అడ్డగించి బలవంతంగా ఆటోలో ఎక్కించారు. మండలంలోని కొత్తపల్లె పంచాయతీ రంగారెడ్డి కాలనీ సమీపంలోని శేషమహల్ ఏరియా దగ్గరున్న వ్యవసాయ పొలాల వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ వేచివున్న రౌడీ గ్యాంగ్ విద్యార్థిపై మూకుమ్మడిగా దాడిచేసింది. బీరుబాటిళ్లు, బెల్టులతో చితకబాదారు. కారణం చెప్పి కొట్టమని బ్రతిమలాడినా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కొట్టడం పూర్తయ్యాక వారు పీకల దాకా మద్యం తాగారు. రాత్రి 9 గంటల సమయంలో అక్కడే వదిలేసి వెళ్లారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఎక్కడున్నా వెతికి చంపేస్తామని కూడా చెప్పారు. అనంతరం బాధితుడు ఇంటికి చేరుకుని విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. వారు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం సభావేదికపై గూండాలా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పాల్గొన్న జన్మభూమి సభా వేదికపైకి రౌడీలు, గూండాలు రావడమేమిటని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విస్మయం వ్యక్తం చేశారు. సభా వేదికపైకి వచ్చిన రౌడీషీటర్లతో పాటు వారిని ప్రోత్సహించిన అధికారులు, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పులివెందుల సభలో ఎంపీ అవినాష్‌రెడ్డిని మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడంపై బొత్స మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జన్మభూమి అధికారిక కార్యక్రమమని చెప్పిన చంద్రబాబు.. మరి ఎంపీ అవినాష్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసేందుకు ఎందుకు ప్రయత్నించారో చెప్పాలన్నారు. సభకొచ్చినప్పటికీ అవినాష్‌రెడ్డిని మాట్లాడని వ్వకుండా చంద్రబాబు మైక్ లాక్కోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. స్థానిక ఎంపీతో మాట్లాడించాలన్న కనీస మర్యాద చంద్రబాబుకు తెలియకపోవడం శోచనీయమన్నారు. అవినాష్‌రెడ్డి సభలో ఎవరినీ దుర్భాషలాడలేదని.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించే ప్రయత్నం మాత్రమే చేశారన్నారు. అంతమాత్రాన మైక్ లాక్కోవాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు.టీడీపీ ప్రభుత్వం పదేపదే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనమన్నారు. -
ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన పోకిరీలు
రఘునాథ్ అనే యువకుడి కంటికి గాయాలు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స హైదరాబాద్: ఫలక్‌నుమా రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై శుక్రవారం రాత్రి పోకిరీలు రాళ్లు రువ్వడంతో ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యారుు. ఈ ఘటనలో గద్వాల ప్రాంతానికి చెందిన రఘునాథ్ (25) అనే యువకుడికి ఎడమ కంటికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం రఘునాథ్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో గద్వాల నుంచి కాచిగూడకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. రఘునాథ్ తండ్రి బాలరాజు కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డొస్తే అంతు చూస్తాం...
= వంక స్థలం ఆక్రమణకు రౌడీల యత్నం = అడ్డుకున్న స్థానికులు, కార్పొరేటర్ అనంతపురం క్రైం : మేం పరిటాల మనుషులం..ఈ స్థలం మాది.. అందుకే ఇక్కడ చదును చేస్తున్నాం. ఎవరైనా కాదంటే అంతు చూస్తాం. ఇవీ వంక స్థలాన్ని కబ్జా చేసేందుకు వచ్చిన వారి వ్యాఖ్యలు. అయితే స్థలం కబ్జాదారులను స్థానికులు, మూడో డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ గిరిజమ్మ అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... మూడవ డివిజన్ పరిధిలోని వేణుగోపాల్‌నగర్ 80 అడుగుల రోడ్డుకు అడ్డంగా వంక పారుతోంది. అయితే, ఆ స్థలానికి సంబంధించిన యజమాని మృతి చెందారు. కొంతమంది కబ్జాదారులు వంకను కబ్జా చేయడానికి నకిలీ పత్రాలను సృష్టించారు. శనివారం కొంతమంది రౌడీలు అక్కడికి ప్రవేశించి వంక స్థలాన్ని ఆక్రమించాలని జేసీబీలతో పనులు చేపట్టారు. అయితే స్థానికులు, కార్పొరేటర్ గిరిజమ్మ వారిని అడ్డుకున్నారు. ఏయ్ మేము ఎవరో తెలుసా? పరిటాల మనుషులం. అడ్డొస్తే మీ అంతు చూస్తామని రౌడీలు మహిళా కార్పొరేటర్‌పై దౌర్జన్యానికి దిగారు. దీంతో కార్పొరేటర్ ఈ విషయాన్ని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆ స్థలాన్ని ఆక్రమిస్తే వంక నీరంతా ఇళ్లల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని కార్పొరేటర్ గిరిజమ్మ పోలీసులకు వివరించారు. మంత్రి పేరు చెబుతూ వారి బంధువులమని టౌన్ ప్లానింగ్ అధికారులను బెదిరించి వంక స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల రంగ ప్రవేశం వంక స్థలాన్ని కొంతమంది రౌడీలు ఆక్రమిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో వన్‌టౌన్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వంక స్థలాన్ని కబ్జా చేయడానికి వచ్చిన రియాజ్, బాబాలతో పాటు మరో ఆరు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబ్జాదారులకు పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం.