రఘునాథ్ అనే యువకుడి కంటికి గాయాలు
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్: ఫలక్‌నుమా రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై శుక్రవారం రాత్రి పోకిరీలు రాళ్లు రువ్వడంతో ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యారుు. ఈ ఘటనలో గద్వాల ప్రాంతానికి చెందిన రఘునాథ్ (25) అనే యువకుడికి ఎడమ కంటికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం రఘునాథ్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో గద్వాల నుంచి కాచిగూడకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. రఘునాథ్ తండ్రి బాలరాజు కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన పోకిరీలు
Published Sun, Oct 2 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
Advertisement
Advertisement