royal challengers banglalore
-
IPL 2022: ముంబై తప్పక గెలవాలి.. రోహిత్ సేనపై ప్రేమ కురిపిస్తున్న ఆర్సీబీ!
IPL 2022 MI Vs DC: ఒకరి ఓటమి మరొకరికి సంతోషం.. ముందుకు సాగేందుకు గొప్ప అవకాశం. ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు అన్వయించే వ్యాఖ్యలు ఇవి. ముంబై ఇండియన్స్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోవాలని.. బెంగళూరు జట్టు కోరుకుంటోంది. అలా అయితేనే వాళ్లు ఐపీఎల్-2022లో కొనసాగే అవకాశం ఉంటుంది మరి! అందుకే బెంగళూరుకు.. ముంబై జట్టుపై అమితమైన ప్రేమ కలిగింది. రోహిత్ సేన కచ్చితంగా పంత్ బృందాన్ని ఓడించాలని ఆర్సీబీ బలంగా కోరుకుంటోంది. ఆఖరికి తమ ట్విటర్ ప్రొఫైల్ పిక్‌లో రెడ్ కలర్‌ను బ్లూలోకి మార్చేంతంగా ప్రేమ పొంగిపోతోంది! అంతేనా ముంబైకి మద్దతు తెలుపుతూ ఓ ‘లేఖ’ కూడా రాసింది. ‘‘హేయ్.. ముంబై పల్టన్.. ఆర్సీబీ జట్టు మొత్తం మీకు చీర్స్ పలుకుతోంది. ఇప్పుడు మనమంతా ఒకే కుటుంబం.. ఢిల్లీతో మ్యాచ్‌లో బాగా ఆడండి’’ అని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ స్టార్ ఫినిషర్ దినేశ్ కార్తిక్ తాను ముంబై జెర్సీలో ఉన్న పాత ఫొటోను షేర్ చేసి రోహత్ సేనకు మద్దతు పలికాడు. ఇక బెంగళూరు ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఢిల్లీని ముంబై ఓడిస్తేనే కదా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌నకు వెళ్లేది! కాబట్టి బెంగళూరు జట్టు ఇలా కోరుకోవడంలో తప్పేముంది! మీరేమంటారు అంతేగా! అంతేగా! చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అందుకే ఇలా: సెహ్వాగ్ చదవండి👉🏾RR Vs CSK: హెట్మెయిర్ భార్యను ప్రస్తావిస్తూ గావస్కర్ కామెంట్.. ‘మీకసలు బుద్ధుందా’ అంటూ.. #RedTurnsBlue for today! A letter to @mipaltan from RCB. 💪🏻 We’re backing you to #PlayBold all the way. Go get ‘em, champs! 🙌🏻#WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #MIvDC pic.twitter.com/MDFYFv20lb — Royal Challengers Bangalore (@RCBTweets) May 21, 2022 📹 : A peek into the diving drill that James Pamment put Aryan through 👊#OneFamily #DilKholKe #MumbaiIndians @aryanjuyal11 MI TV pic.twitter.com/pFX95WBlJw — Mumbai Indians (@mipaltan) May 21, 2022 -
IPL 2022: స్ట్రైక్ రేటు 375.. డీకేతో అట్లుంటది మరి! పట్టరాని సంతోషంలో కోహ్లి!
IPL 2022 SRH Vs RCB: ఐపీఎల్-2022లో భాగంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ అదరగొట్టాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 8 బంతుల్లోనే ఒక ఫోర్, 4 సిక్సర్ల సాయంతో 30 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేటు 375. కాగా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(73- నాటౌట్)కు తోడుగా ఆఖర్లో డీకే అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో ఆర్సీబీ భారీ స్కోరు చేయగలిగింది. ప్రత్యర్థికి 193 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ నేపథ్యంలో డీకేపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. గత మ్యాచ్‌లలో ఫినిషింగ్ టచ్‌తో జట్టుకు విజయాలు అందించిన తీరును ప్రస్తావిస్తూ.. ‘‘ప్రస్తుత కాలంలో ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఫినిషర్ దినేశ్ కార్తిక్’’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. ‘‘10 బంతులు మిగిలి ఉండగా క్రీజులోకి వచ్చి అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. నవ్వుతూ మైదానం వీడటం. ఇది కేవలం డీకేకే సాధ్యమవుతుంది’’ అని కొనియాడాడు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లి.. డీకే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తుండగా.. ‘‘టేక్ ఏ బో’’ అంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా సన్‌రైజర్స్ బౌలర్ జగదీశ సుచిత్ బౌలింగ్‌లో కోహ్లి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. చదవండి👉🏾IPL 2022: డేవిడ్ వార్నర్‌పై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు Dinesh Karthik The Great Finisher. Last four balls.#RCB #SRHVRCB#IPL2022 pic.twitter.com/4RTFOmIkaU — @salla (@iamsalla) May 8, 2022 Comes in with just 10 balls to go. Plays the most impactful knock of the innings. Smiles. Leaves. Just DK things. #SRHvRCB #IPL2022 pic.twitter.com/yHu5gXDGRb — Wasim Jaffer (@WasimJaffer14) May 8, 2022 pic.twitter.com/DsFW2kmG1b — Diving Slip (@SlipDiving) May 8, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్రిస్ గేల్‌కు ఏమైంది?
ప్రపంచ క్రికెట్ లో క్రిస్ గేల్ ఒక సముచిత క్రికెటరే కాదు.. విధ్వంసకర ఆటగాడు కూడా. ఆది నుంచి ప్రత్యర్థి బౌలర్ పై పైచేయి సాధించే అరుదైన ఆటగాళ్లలో గేల్ ఒకడు. ప్రస్తుత వెస్టిండీస్ క్రికెట్ లో స్టార్ ఆటగాడు ఎవరైనా ఉంటే అది గేల్ మాత్రమేనని కచ్చితంగా చెప్పొచ్చు. పిచ్ లోకి అడుగుపెట్టాడంటే ఎడాపెడా బంతుల్ని బౌండరీలకు దాటించడం గేల్ కు తెలిసిన విద్య. సునామీ, విధ్వంసకరం, సుడిగాలి.. ఈ తరహా ఆటకు చిరునామా గేల్ అంటే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ మ్యాచ్ అయినా, దేశవాళీ లీగ్ అయినా గేల్ బ్యాట్ కు పదునెక్కువ. ట్వంటీ 20 క్రికెట్లో ఇప్పటివరకూ ఏడు సెంచరీలు సాధించిన గేల్.. ఈ ఫార్మాట్ లో తొలి సెంచరీ సాధించిన ఘనతనూ సొంతం చేసుకున్నాడు. మరోవైపు 2013 ఐపీఎల్ సీజన్ లో 30 బంతుల్లో ఫాస్టెస్ సెంచరీ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న గేల్.. ఐపీఎల్ చరిత్రలో నాలుగు సెంచరీలు సాధించడం విశేషం. గత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో గేల్ పాత్ర వెలకట్టలేనిది. మరి అటువంటి గేల్‌కు ఐపీఎల్-9వ సీజన్ లో ఏమైందనేది అసలు ప్రశ్న. అతని పరుగుల తుపాన్ కు బ్రేక్ పడినట్లు కనబడుతోంది. ఇప్పటివరకూ ఈ ఐపీఎల్ సీజన్ లో ఐదు మ్యాచ్‌లాడిన గేల్ మొత్తంగా 19 పరుగులు చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ ఐపీఎల్లో 1, 0, 7, 5, 6 గేల్ వ్యక్తిగత స్కోర్లు. ఇందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 7 కాగా, అతని ఖాతాలో రెండు ఫోర్లు, 1 సిక్స్ మాత్రమే ఉండటం గమనార్హం.